మంచి మాట

ఆదిశంకరులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మానికి గ్లాని సంభవించినప్పుడు పరమాత్మ తన అంశారూపములైన త్రిమూర్తులకు పరిస్థితులను చక్కదిద్దే పనిలో నియోగిస్తాడు. పురుష రూపంలో పరమేశ్వరుడుగాను,స్ర్తి రూపంలో పరాశక్తిగాను పరిగణిస్తారు. ఈ రెండు రూపములు ఒక్కటే. అదే పరమాత్మ.
పురుష రూపంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా, వారికి చైతన్య శక్తులునందించే ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులుగా ముగ్గురమ్మలను సృజించాడు. సృష్టిలో అందరు సమానులైనా, దైవీ గుణ సంపత్తి కలవారు దేవతలుగా, అసురీ ప్రవృత్తిగలవారిని రాక్షసులుగా పరిగణించడం జరుగుతున్నది. అట్టి రాక్షస ప్రవృత్తిని కలిగి ధర్మానికి గ్లాని కలిగిస్తున్న వారిని దునుమాడడానికి పరమేశ్వరుడు తమ అంశల ద్వారా చక్కదిద్దడం తెలిసిందే. త్రిపురాసురులను సంహరించడానికి పరమశివుడు, శుంభ నిశుంభాది దానవులను పరిమార్చడానికి పరమేశ్వరి పరమాత్మ సంకల్పాన్ని నెరవేర్చిన వైనం పురాణేతిహాసాలలో విశదంగా వివరించడం జరిగింది.
పుణ్యభూమి, వేదభూమి అయిన ఈ భారతభూమిపై ఎందరెదంరో మహాపురుషులు, కారణజన్ములు అవతరించారు. ఈ దేశ సంస్కృతిని, ఐక్యతను, ధర్మాన్ని పరిరక్షించడానికి పరమాత్మ తన అంశారూపంలో అవతరించారు. భగవదవతారములను నాలుగు విధాలుగా విభజిస్తారు. విజ్ఞులు- పూర్ణావతారాలు (శ్రీరాముడు, శ్రీకృష్ణుడు), కళావతారాలు (మత్స్య, కూర్మ, వరాహాది అవతారాలు), అంశావతారములు (కపిలుడు, జడభరతుడు), అంశాంశతారములు శంకర, రామానుజ, మధ్వాచారులు మున్నగువారు.
సంస్కృతి, ఆధ్యాత్మికత లోపించి ధర్మం క్షీణించినపుడు, అవ్యవస్థ నెలకొన్నప్పుడు శ్రీ శంకరులు శివుని అంశగా ఈ భూమిపై ఉదయించిన జ్ఞానభాస్కరులు. దేశమంతా కప్పివైచిన దట్టమైన చీకట్లను తొలగించడానికి తన అద్వైత ప్రభలను పరీవ్యాప్తం చేసి, ఉజ్జ్వలంగా నిలిపి ప్రకాశింపజేసారు.
శంకరునిగా అవతరించిన శివుని దర్శించుకోడానికి ఒక రోజున దదీచి, ఉపమన్యుడు, గౌతముడు, అగస్త్యుడు, త్రితలుడు మున్నగు మహామునులు శివగురు ఇంటికి వచ్చారు. ఆ దంపతుల అతిథి మర్యాదలను స్వీకరించి, వారి ద్వారా శంకరులను గురించి తెలుసుకున్నారు. శంకరుల అద్వితీయ మేధా సంపత్తికి అచ్చెరువొంది తమ తపోబలంచే మరో ఎనిమిది సంవత్సరాల ఆయుష్షును ప్రసాదించి, బాలుడు తన అసమాన పాండిత్యంతో మేరునగధీరుడై భారతీయ ఆధ్యాత్మిక సంస్కృతుల వికాసానికి అద్వైత సిద్ధాంతాన్ని నేల నాలుగు చెరగులా పరీవ్యాప్తం చేసి తన పేరును, వంశం పేరును చిరస్థాయి చేస్తారని ఆశీర్వదించారు.
త్రిపురాసుర సంహారంలోను, మహిషాసుర, రక్తబీజాది అసురులను మర్దించడంలోనూ శివ శివానీలను సమస్త దేవతలు తమ అంశలను, అస్త్ర శస్త్రాలను సమకూర్చిన విధంగా శ్రీశంకరులు తమ దిగ్విజయ యాత్రలో సనాతన వైదిక ధర్మ పరిరక్షణలో దేవతా గణమంతా అతని వెంట నడిచింది.
శ్రీశంకరాచార్యులు జన్మించిన నాటికే వ్యాసమునీంద్రులు వేదరాశిని వింగడించి నాలుగు వేదాలుగా ఆవిష్కరించారు. వ్యాస మునీంద్రుల ఆదేశానుసారం నాల్గు దిక్కులలో పీఠాలను స్థాపించి, వాటికి తొలి అధిపతులుగా తన ముఖ్య శిష్యులను అధిష్ఠింపజేశారు. అవి- తూర్పున పురీక్షేత్రంలో హస్తామలకాచార్యులు, పశ్చిమంలో ద్వారకలో శ్రీ పద్మపాదాచార్యులు, ఉత్తరదిశలో బదరీ క్షేత్రంలో శ్రీ తోటకాచార్యులు, దక్షిణంలో శ్రీ శృంగారిలో శ్రీ సురేశ్వరాచార్యులు నియుక్తులైనారు. ఉభయ భారతదేవి శారదా మాతగా శ్రీ శృంగేరిలో కొలువై వుండడం చేత దక్షిణామ్నాయం (పీఠం) శ్రీ శృంగేరీ శారదా పీఠంగా ప్రాచుర్యం పొందింది. శ్రీ శంకరాచార్యులవారు కేంద్రీయ స్థానంగా కంచిలో పీఠాన్ని నెలకొల్పి తానే ప్రప్రథమ పీఠాధిపతులుగా ఉంటూ కామాక్షి సహిత ఏకామ్రేశ్వరుని ఆరాధించినట్లు కథలున్నాయి.

- ఎ. సీతారామారావు