మంచి మాట

కలిమహిమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనేక అవకతవకలతో, మనుషుల నడతలు అస్తవ్యస్తంగా సాగడానికి కారణం కలియుగ ప్రభావం. వినాశకాలానికి మార్గం చూపే మానవయానం, అవినీతి, అబద్ధం, క్రూరత్వం, కక్షలు, కార్పణ్యాలు, అసూయలు, స్వార్థం వంటి బుద్ధులతో సాగుతూ ఉంటుంది. కన్నవారికి కడు దూరంగా, వారికి ఏ ఆసరా అందివ్వకుండా, కేవలం తమ కుటుంబానికే పరిమితం అయే పిల్లలతో వృద్ధుల జీవితం దుర్భరం అవుతుంది. మానుగానే పుట్టే పిల్లలు మొక్కలుగా వంచశక్యం కాదు. మానవత్వం, జాలి, సహాయం వంటి మంచి గుణాలు వీరికి అబ్బవు. చెబితే వినరు, పెద్దవారిని గౌరవించడం మాట అటుంచి వీరింకా ఎందుకుండటం? వీరివల్ల ఉపయోగం ఏముంది? అనే ఆలోచనలతో వారిని చులకనగా, నిర్లక్ష్యంగా చూస్తూ అవమానాల పాలు చేయడంతో, వయసుమీరినవారు క్రుంగుబాటు జీవితాన్ని అనుభవిస్తూ నరకయాతనలతో కాలం గడపవలసి రావడం కలి ప్రభావమే.
ఉమ్మడి కుటుంబాలు కనిపించనంతగా మారిపోవడానికి కారణం కొత్తగా తల్లితండ్రులైన వారి బాధ్యతారాహిత్యమే. వీరి వల్ల వసుధైక కుటుంబమనే భారతీయత బీటలు బారి కుటుంబ వ్యవస్థనే అవస్థలమయం చేస్తుంది. ప్రేమ, గౌరవం, ఆప్యాయత, ఆదరణలు ఎదుటివారినుండి ఆశించడమే తప్ప వాటిని పెద్దవారికి ఇవ్వాలనే జ్ఞానం మృగ్యమైపోతోంది నేటి జనంలో. ఇక తిన్న ఇంటివాసాలనే లెక్కపెడుతూ, ఏరుదాటగానే తెప్ప తగలేస్తూ ఎక్కిన నిచ్చెననే పడదోసే దుర్మార్గులు సమాజానికే చీడపురుగులు. వీరి ఉనికి నేడు ఎక్కువగా కనపడుతోంది. అడుగడుగునా ఎదుగుదలకై శ్రమించేవారికి అడ్డం వస్తూ, తాము పైకెగబ్రకాలనే దురాశాపరులవల్ల అందరికీ అభివృద్ధి దొరకదు.
వాతావరణ కాలుష్యం ఏర్పడి, చెట్లు నరకబడి, బోరు బావులతో భూమి నీటిశాతాన్ని కోల్పోవడంతో పర్యావరణంలో అసమతౌల్యతఏర్పడుతోంది. దీనికి కారణం నేటి సగటు మానవుల చర్యలే. గుళ్లు గోపురాలు భక్తి పేరుతో దేవాలయాలను సందర్శించేవారు సైతం ఆలయ నియమాలు పాటించకుండా, తోటి భక్తులను బాధపెట్టేవారు, తొక్కిసలాటలతో ప్రాణాలకు సైతం ముప్పు కలిగించే వారు కలియుగంలో కోకొల్లలు. ఆర్భాటానికి దుబారా ఖర్చు చేసే మనుషులు, పేదవారికి పిడికెడు అన్నం పెట్టడానికి సందేహిసిస్తున్నారు. వీటన్నింటితో పాటుగా ముఖ్యులు, ప్రాముఖ్యులైనవారు సైతం పదవికోసం పాకులాటలతో ప్రజా జీవితాన్ని నిత్య నరకంగా మారుస్తూ ఉన్నారు.
ఎవరికి వారు తరతరాలకూ సరిపడే ఆస్తులను సమకూర్చుకోవడానికి నీతినియమాలను పట్టించుకోవడం లేదు. ఉపకారానికి ప్రత్యుపకారం కాక అపకారాలు చేస్తూ వెళ్తున్నారు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే వచ్చే భవిష్యత్తుకాలం ఏమవుతుంది? స్వలాభం కొంతమాని పక్కవారికి తోడుపడాలి అని చెప్పిన పెద్దలసూక్తిని ఎపుడు పాటిస్తారు.
ఏది ఏమైనా కలికాల ం అంటూ మానవత్వాన్ని కాలరాస్తూ మనుషులు రాక్షసులుగా మసలడం ఎప్పటికీ మంచిదికాదు. రాబోయే కాలం లోనైనా మనుషులు వారిలో అణగారి ఉన్న మానవత్వాన్ని వెలికితీసి నరుల సేవనే నారాయణ సేవగా గుర్తించే కాలం రావాలని భగవంతుణ్ణి ప్రార్థిద్దాం.
మంచివారికి సత్యధర్మాలను పాటించేవారికి భగవంతుడు ఎపుడూ తోడు ఉంటానన్న వాక్యాన్ని నమ్మి మన కర్తవ్యాన్ని విస్మరించకుండా చేయవలసిన పనిని భగవంతునికి అర్పణ చేసి ఫలితం ఆశించకుండా పని చేస్తే ఆ దేవాదిదేవుడు అండగా ఉండి కలి మాయా ప్రభావం నుంచి సత్యవంతులను, ధర్మపరాయణులను రక్షిస్తాడు. సదా భగవంతుని నామాన్ని జపిస్తూ కలిబారినుంచి తప్పించుకుందాం. ధర్మాన్ని పాటిద్దాం. సత్యానే్న సదా పలుకుదాం.

-ఎం.వి.రమణకుమారి