మంచి మాట

కాలం - ధర్మం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలగమనంలో ధర్మాలు మారుతూ వుంటాయన్నది నిజం. కాలంలో రాత్రింబగళ్ళు ఒకేలా వున్నా దాని గమనంలో జీవుల చావు పుట్టుకల చక్రభ్రమణంలో, తరాలు మారుతున్నకొద్దీ అంతరంగాల విభేదాలతో పోరాటాలు పెరిగి శాస్త్రాలు, చట్టాలు మారుతాయన్నది సత్యం, అందరికీ అనుభవైకవేద్యం.
కృతయుగంలో ధర్మం నాలుగు పాదాల నడిస్తే ఆ ధర్మమే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పాదం పోగొట్టుకుని చివరికి కలియుగంలో ఒక్క పాదం మీద నడుస్తోందని పురాణాలు చెప్తున్నాయి.
ఈ కలియుగం ప్రథమ పాదంలోనే మన కళ్ళెదుటే ఎన్నో ఇదివరలో వున్న ధర్మాలు ఇపుడు అధర్మాలుగా మారిపోతున్నాయి. దానికి అనుగుణంగా చట్టాలు మార్చబడి శిక్షలు విధింపబడుతున్నాయి.
కాలంలో మారుతున్న ధర్మాలకి, యువతరంలోని భావాలకి మానసికంగా సిద్ధపడలేక, అనుసరించలేక, సర్దుకుపోలేక పాత తరాలవారు ఆవేదనలకి గురౌతున్నారు. అయినా తప్పనిసరి పరిస్థితులు ఎదురౌతున్నాయి.
ఒకటి రెండు శతాబ్దాల ముందు పురాణకాలంలో కొందరు తమకి తాముగా భర్త లేని పరిస్థితులని మానసికంగా ఎదుర్కోలేక వారికివారు సతీసహగమనానికి సిద్ధపడినట్లు చెప్తున్నాయి పురాణాలు. ఇందుకు ఉదాహరణలుగా పురాణాలల్లో పాండురాజుతో మాద్రి, జమదగ్నితో రేణుకాదేవి.. ఇలా కొందరు మనకి కనబడతారు.
అయితే త్రేతాయుగంలో రామాయణకాలానికి కౌసల్య, సుమిత్ర, కైక ముగ్గురిలో ఎవరూ దశరథుడితో సహగమనం చెయ్యలేదు. ఆ రోజుల్లోనే వానరులలో ధర్మాలు వేరుగా వున్నట్లు తెలుస్తోంది. వాలి చావు అనంతరం సుగ్రీవుడికి తార కూడా భార్య అయినట్లు, అది వారికి ధర్మమన్నట్లు మనకు తెలుస్తుంది.
శ్రీరామచంద్రుడు ఏకపత్నీవ్రతం ధర్మమని చెప్పి తను ఆచరించి చూపాడు. అంతేకాదు, ఆయన ఒకే మాట, ఒకే పత్ని, ఒక బాణం ధర్మంగా ఆచరించాడు. ఆయన తమ్ములు, ప్రజలు కూడా ఆచరించినట్లు రామరాజ్యం ధర్మరాజ్యంగా చూపారు వాల్మీకి. ద్వాపరంలో ఆ ధర్మం మారింది. చెప్పడానికి, ఆచరించడానికీ కొన్నిచోట్ల పొంతనలు కనబడవు. శ్రీకృష్ణుడు తనకి తానుగా రుక్మిణిని మాత్రమే కోరి వివాహం చేసుకున్నా, మిగిలిన వారినందరినీ వారికోరిక మేరకు వివాహం చేసుకున్నాడు. అలాగే ధర్మరాజుతోసహా అందరూ బహు భార్యల్ని చేసుకున్నట్లు భారతం చెప్తోంది. అది ధర్మంగానే చెప్పబడింది. ఇక కలియుగానికి వస్తే సతీసహగమనాలు, ముసలివారైన పురుషులు పదేళ్ళలోపు అమ్మాయిల్ని వివాహం చేసుకోవడం లాంటివి ఒకనాడు ధర్మంగా చెలామణీ అయ్యాయి. అంతేకాదు, ముసలి మొగుడు ప్రాణాలు కోల్పోతే వారితోపాటు వివాహమంటే ఏమిటో కూడా తెలియని పసిపాపల్ని బలవంతంగా సహగమనం అంటూ చితిమీద దహనం చేసేవారు.
రాజారామ మోహన్‌రాయ్ వంటి సంస్కర్తల సంస్కరణాలవల్ల ఆ పరిస్థితి మారి ఆ పద్ధతి చట్టవిరుద్ధమైంది. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో చట్టం కళ్ళు కప్పి అక్కడక్కడా ఆ దుష్కర్యాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
సమాజంలోని కొంతమంది కొంతకాలం క్రితం కన్యాశుల్కం, నేటికాలంలో వరకట్నం అనే దురాచారాలు కనబడుతూనే ఉన్నాయ. కాని స్ర్తిల జీవితం మహన్నోత్తంగా ఉండడానికి చట్టాలు చేసారు. కాని నేడు వాటిలోని లొసుగులతో కొంతమంది దురాచారాలకు పాల్పడుతారు. కొంతమంది భారతీయ సంప్ర దాయాలను కాలరాస్తూ పాశ్చాత్య పోకడలని అనుసరిస్తున్నారు.
కాని ఇప్పటి సమాజానికి పనికివచ్చేట్టుగాను, మానవ జన్మ సార్థకం కాగలిగే సూక్తులను చెప్పే వేదాన్ని పరిగణనలోకి తీసుకొని ప్రపంచానికి తలమానికంగాను, స్ర్తీపురుషులు జీవనం సాగించాల్సిన అవసరం ఉంది. మానవజీవితం అమృతత్వ సాధనకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం సమాజంలోని అందరి పైన ఉంది. దీనికి చక్కని మార్గం దైవభక్తే. అందరిలో దైవంపట్ల ఆసక్తి, దైవభక్తి ఉంటే పాపభీతి ఏర్పడుతుంది. సమదృష్టి అలవడుతుంది. సమాజంలోని ప్రతిప్రాణిలోను దైవాంశను చూసే నేర్పు కలుగుతుంది. అపుడు కాలంతో పాటు మారిన ధర్మం కూడా సమాజోద్ధరణకు, మానవవికాసానికి ఉపయోగపడుతుంది.

- ఆర్.ఎస్.హైమవతి