మంచి మాట

భగీరథ యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిరాశపడకుండా ఏ విషయాన్నయినా పట్టుదలతో సాధించగలిగిన శక్తిని అలవరచుకోవాలి. పదే పదే ప్రయత్నమే విజయానికి రహస్యం. నేటి సమాజంలో అనేకమంది నిరుత్సాహంతో నిరాశ చెంది తమ తనువులు బలిచేస్తున్నారు. నేటి విద్యార్థులు భావి భారత పౌరులుగా కీర్తింపబడాలంటే ఆత్మన్యూనత విడనాడాలి. నేటి కాలంలో ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల అభిరుచిని గ్రహించి మసలుకోవటంతోపాటు శివాజీని ఛత్రపతిలా తీర్చిదిద్దే జిజియాబాయిలుగా మారవలసిన అవసరం ఎంతైనా ఉంది.
ఇక్ష్వాక వంశానికి చెందిన సగర చక్రవర్తికి ఇద్దరు భార్యలకూ సంతానం లేదు. ఎన్ని వ్రతాలు పూజలు చేసి విసిగి హిమాలయానికి వెళ్లి సగర చక్రవర్తి తపస్సు చేసాడు. భృగు మహర్షి అనుగ్రహంతో ఒక భార్యకు వంశకరుడయిన అసమంజసుడు అనే కుమారుడు, రెండవ భార్యకు 60వేలమంది కుమారులు (సగరులు) జన్మించారు. అసమంజసుని కుమారుడు అశుమంతుడు. కొన్ని వేల సంవత్సరాలు రాజ్యపాలన చేసిన సగర చక్రవర్తి అశ్వమేథయాగం చేయగా, అశ్వాన్ని ఇంద్రుడు రాక్షస రూపంలో అపహరించగా, 60వేల మంది కుమారులను వెతకటానికి పంపగా వారు భూమి మీద వెతికినా గుర్రం కనపడలేదు. భూమి తవ్వి పాతాళ లోకానికి వెళ్లగా అక్కడ కపిల ముని ఆశ్రమ సమీపంలో గుర్రం కట్టివేయబడటం చూసి సగరులు ఆ కపిల ముని మీద కోపంతో అత్యుత్సాహంతో చెట్లు, నాగళ్లు, కర్రలు, పొదలుతో 60వేలమంది మునిమీదకు వస్తున్నట్లు గమనించిన కపిలుడు ఒక హుంకారం చేయగా 60వేలమంది సగరులు బూడిద కుప్పలుగా పడిపోయారు. సగర చక్రవర్తి విచారంగా, యాగం పూర్ణం కానందుకు అశుమంతుడిని పిలిచి తమ పినతండ్రులు ఆచూకీతోపాటు యజ్ఞ అశ్వమును వెతకమని పంపగా పాతాళలోకంలో బూడిద రాశులుగా పడి వున్న తన పినతండ్రులను చూసి విచారించి తన పినతండ్రులకు జలతర్పణం గావించాలని నీటి కోసం వెతకగా ఒక్క చుక్క కూడా కనిపించక దిగులు చెంది ప్రక్కనే కట్టినే కట్టియున్న యజ్ఞ అశ్వమును తోడ్కొని సగర చక్రవర్తికి విషయాన్ని వివరించి యజ్ఞాన్ని నిర్విఘ్నంగా పూర్తిచేశారు. తన పినతండ్రులకు ఉత్తమ గతులు కలుగలేదని విచారంగా ఉండగా గరుత్మంతుడు మాటలతో ఆకాశగంగను భస్మరాజులుపై ప్రవహింపచేస్తే ఉత్తమ గతులు కలుగుతాయని తెలుసుకొని ఏమీ చేయలేక బాధతో ఉండగా, సగర చక్రవర్తి మరణించగా అసమంతుడు మహారాజుఅయ్యాడు. ఆతరువాత ఆయన కుమారుడు దిలీపుడు దిలీపుని కుమారుడు భగీరథుడు మహారాజు సింహాసనాన్ని కాలక్రమంలో అధిరోహించాడు.ఆయన పట్టుదలతో ఆకాశగంగకై వేయి సంవత్సరాలు ఘోర తపస్సు చేయగా బ్రహ్మ ప్రత్యక్షమై భగీరథుడు కోరిక మేరకు దివి నుంచి భువికి గంగను పంపడంలో పరమేశ్వరుని దయకావాలని తెలుసుకొన్నాడు. మరలాఅపుడు భగీరథుడు మరో వెయ్యి సంవత్సరాలు శివునికై ఘోర తపస్సు చేశాడు. పరమశివుడు ప్రత్యక్షమై, నేను గంగను పట్టుకుంటానని హిమాలయాలకు వెళ్లి బిందు సరోవరం వద్ద శంకరుడు సంసిద్ధుడు కాగా, భువికి దిగడంలో గంగ అహంకరించింది. దానివల్ల ఆకాశగంగ శివుని జటాజూటంలో కొన్ని వందల సంవత్సరాలు అక్కడే ఉండిపోయంది. భగీరథుడు నిరాశ చెందాడు. పరమశివుని మళ్లీ తపస్సు చేయగా, ఆకాశగంగను ఏడు పాయలుగా పరమేశ్వరుడు వదలగా ఏడవ పాయను భగీరథుడు ఆనందంగా పాతాళలోకానికి తీసుకువెళ్లి తన పితృదేవతల భస్మరాసులమీద ప్రవహింపజేయగా అందరి ఆత్మలు శాంతించి ఉన్నత లోకాలకు వెళ్లారు. బ్రహ్మ భగీరథుని ప్రయత్నానికి ఆశ్చర్యపడి పితరుల కొరకు ఇంత శ్రమపడి ఆకాశగంగను పాతాళానికి తీసుకువెళ్ళేవు. ఈ రోజునుంచి ఈ గంగను భగీరథుని కుమార్తెగా ‘్భగీరథి’ అనే పేరుమీద పిలవబడుతుందని వేనోళ్ల భగీరథ ప్రయత్నాన్ని శ్లాఘించాడు.

-మోటమర్రి మురళీకృష్ణ