మంచి మాట

గోవింద నామం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతటా వ్యాపించిన విష్ణువు చిన్నికృష్ణుడిగా కనిపించిన అవతారం కృష్ణావతారం. గోవిందావతారం దాల్చి, భక్తులకు ఆనందం కలిగించాడని, శంకరత్పాదులు ప్రతిపాదన చేసిన నామం గోవిందనామం.
సాక్షాత్తు శంకరుడు శంకరత్పాదులు, ప్రతిపాదన చేసిన, దామోదర గుణమంజీరా.. గోవిందా, సుందర వదనారవిందం గోవిందా అని, గిరి పర్వతముపై, చిన్నికృష్ణుడిని, గోపీ గోపాలురు, భక్తబృందం చూసినపుడు ఆనంద పరవశులైనారు. ఏడు రోజులు, ఒంటి వ్రేలుపై నిల్పి మమ్ము కాపాడిన గోవిందుడితడే. అతడు ఆరగించు పదార్థములు భగవంతుడే ఆరగిస్తున్నట్లు సంతోషపడినారు. ఇకముందు నుంచి ఈ గిరినే ప్రార్దిస్తామని, వర్షదేవుడును ప్రార్దించమని, శ్రీకృష్ణుడితో గోపీ గోపాలురు, వారు తెచ్చిన పదార్థములు శ్రీకృష్ణుడి ముందుంచారు. చిన్ని కృష్ణుడు వాటిని ఆరగిస్తూ ఉంటే అంతా సంతోషిస్తూ కేరింతలు కొట్టుకుంటూ ఆనందించినారు, పాటలు పాడుకున్నారు, నృత్యాలు చేసి శ్రీకృష్ణుని ముద్దాడారు.
‘గుణమంజీరా’ అంటే గుణములు ఉన్నవాడని, లేనివాడని, హరి విశ్వవ్యాప్తుడని, హరి విశ్వమని చెప్పుకుంటారు. సుందరవదనుడు, దేహధారుడు, పదేండ్ల ప్రాయముగల చిన్నికృష్ణుడు, సంపూర్ణ అవతారం నేడు శ్రీవేంకటేశ్వర అవతారంగా ఉన్నాడు.
చిన్నికృష్ణుడికి సప్తవర్ష ప్రాయములో బ్రహ్మ, ఇంద్రాది దేవతలు అభిషేకం చేసి, స్వామిని పట్ట్భాషిక్తున్ని చేసినపుడు వారు పిల్చిన నామం గోవిందా గోవిందా అని పిల్చిన నామం సర్వపాపహరం.
ప్రతి యేడూ వర్షఋతువుకోసం గోకులంలో గోపాలురు ఇంద్రుడికి యజ్ఞయాగాదులు చేసుకుంటూ పిండివంటలు చేసి ఇంద్రుడికి అర్పించే పద్ధతి ఉండేది. కానీ శ్రీకృష్ణుడు మాత్రం ఒప్పుకోక ప్రకృతికి నిలయమైన పర్వతములు దైవనిర్ణితములని, పర్వతములకు తాము చేయు ప్రార్థనలతో పిండివంటలు అర్పించవలెనని చెప్పి వారితో ఆ పద్ధతే చేయించాడు. దానికి ఇంద్రుడు కోపగించి ప్రళయము సృష్టించాడు. ఏడు రోజులు ఏకధాటిగా తెరిపిలేకుండా గోకులంలో వర్షము, గాలితో ప్రళయము సృష్టించేడు. గోపాలురను, గోకులాన్ని భయకంపితులను చేశాడు. గోకులమంతా శ్రీకృష్ణుడికి మొరపెట్టుకున్నాయి, ఈ విపత్తునుంచి కాపాడమని, విన్నపాలు చేసుకున్నారు.
చిన్నికృష్ణుడు ఏడేండ్ల ప్రాయముగలవాడు వారికి ధైర్యం చెప్పి గోవర్థన పర్వతాన్ని ఎత్తి గోకులాన్నంతా కాపాడి ఇంద్రుడికి గర్వభంగం చేశాడు. అప్పుడు బ్రహ్మ, ఇంద్రాది దేవతలు శ్రీకృష్ణుడికి క్షమాపణ చెబుతూ పాదాలు కడిగినారు. అప్పటినుండి స్వామి పాదాలు బ్రహ్మకడిగిన పాదములని భక్తులచేత కీర్తించబడినాయి.
ఈ ఏడు రోజులు గోవర్థన పర్వతాన్ని తన చిటికెన వ్రేలుపై నిలబెట్టి గోపాలురని, గోవులను, గోకులాన్ని కాపాడినప్పుడు పిల్చిన నామం గోవిందా.. గోవిందా నామం.
జలములనుండి భూమిని పైకి తీసుకొని వచ్చి సృష్టికి కారణమైనవాడు కనుక గోవింద నామం ఇవ్వబడినది, పిలువబడినది. గోవులంటే ప్రీతి, ప్రేమ. వాటి కాపరిగా ఉండటం చేత గోవిందా గోవిందా అని పిలువబడ్డాడు. ఈ నామమెంతో మధురం, సర్వపాపహరం. మనం ప్రతి వస్తువు భూమి నుండే పొందుతాం కనుక భూమికి వసుంధర అని పేరు వచ్చింది. భూమిని కాపాడినవాడు, పోషించువాడు కనుక వసుంధరుడు గోవిందా.. గోవిందా అని పిలువబడ్డాడు. ఆవులలో సమస్త దేవతలు వచ్చి ఉంటారు. వాటిని కాచేవాడుగా, పాలించేవాడిగా ఉండటంవల్ల గోవింద నామం వచ్చింది. గోసేవ చేస్తే చిత్తశుద్ధి కలుగుతుందంటారు. గోదానంవల్ల పుణ్యం దక్కుతుంది. గోదానంవల్ల అక్రూరుడు పుట్టాడు. అక్రూరుడనగా క్రూరత్వం లేనివాడు. శుద్ధ బ్రాహ్మణుడు. శమంతకమణిని ఎవరూ తీసుకోలేనపుడు అక్రూరుడు ఆ మణిని ధరించి రాజ్యపాలన చేసిన ధర్మాత్ముడు.
‘గో’ అనే పదానికి ఒక్క అర్థం కాదు అనేక అర్థాలున్నాయి. ఏ ఒక్క నామం ద్వారానైనా మనం ఈశ్వరుణ్ణి చేరవచ్చు. గోపూజ గోవిందపూజతో సమానం. గోవిందనామం సర్వపాపహరం.

-జమలాపురం ప్రసాదరావు