మంచి మాట

ప్రశాంతత -- మంచిమాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ సృష్టిలోని ప్రాణమున్న జీవఠాసులన్నింటికీ ఆహారం తర్వాత అత్యంత ముఖ్యమైంది నిద్ర. కడుపు నిండా భోజనం, కంటినిండా నిద్ర ప్రతి ప్రాణికి అవసరం. వాస్తవానికి నిద్ర అంటే బాహ్యేంద్రియములతోపాటు మనస్సుకు కూడా విశ్రాంతినివ్వడమే నిద్ర. ఉదయం నిద్రనుండి మేల్కొని పనులలో మునిగి తేలి అలసిన శరీరం రాత్రి కాగానే తిరిగి నిద్రాదేవి ఒడిలోకి ఒరుగుతుంది. ఆహారం మానవుని శక్తిని ఆరోగ్యాన్ని కలిగిస్తే నిద్ర ఆసక్తిని ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది.
జీవితంలో సగ భాగం నిద్రతోనే గడుస్తుంది. నిద్ర అనేది ఒక మత్తు మందులాంటిది. అందుకే ఒక సినీ కవి మత్తువదలరా! నిద్దుర మత్తు వదలరా! ఆ మత్తులోనే గమ్మత్తుగా చిత్తవుదువురా అంటాడు. అంటే నిద్ర చురుకుదనంతోపాటు సోమరితనాన్ని కూడా కలగచేస్తుంది. రామాయణంలో కుంభకర్ణున్ని సోమరితనానికి ఉదాహరణగా పేర్కొనడం కద్దు.
ముఖ్యంగా నిద్రకు మూడు అవస్థలున్నాయి. అవి జాగ్రత్తవస్థ, స్వప్నావస్థ, మరియు సుషుప్తి అవస్థ. మూడు అవస్థలలో శరీరం, బుద్ధి వేర్వేరుగా పని చేస్తాయి. జాగ్రతావస్థలో పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు మనస్సు, బుద్ధి పనిచేస్తాయి. ఈ స్థితి మెలకువగా ఉండే స్థితి. ఇక స్వప్నావస్థలో పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు పనిచేయవు. కానీ మనస్సు మాత్రం మేలుకొనియే ఉంటుంది. అందువల్ల దాని ద్వారా స్వప్నాలు చూస్తాము. కళ్లు మూసుకుని ఉన్నప్పటికీ అంతర్‌దృష్టి ద్వారా ఎన్నో దృశ్యాలను మనస్సు చూస్తుంది. మంచి స్వప్నాలతో సంతోషం చెడు స్వప్నాలతో బాధ, దుఃఖం కలుగుతుంది. స్వప్నావస్థలో అన్ని ఇంద్రియాలు అణగి నిద్రపోతున్నప్పటికీ సూక్ష్మమైన మనసు మేలుకొని వుండడంవల్ల మనస్సుతో దేనిని చూస్తామో దానినే స్వప్నంలో దర్శించుకుంటాము. అంటే మనుషులు, వస్తువులు, సృష్టిలోని ప్రతి వస్తువు వారికి ఎంతో స్పష్టంగా చక్కగా కనిపిస్తాయి. అందుకు అనుగుణంగా కలగన్నవారు ప్రతిస్పందిస్తూ నిద్ర లేవగానే జరిగినది స్వప్నంగా భావిస్తారు. ఒక్కొక్కసారి స్వప్నాల ద్వారా ఈ జన్మ, గత జన్మ, మలి జన్మకు సంబంధించిన విషయాలు కూడా తెలుస్తుంటాయన్నారు.
ఇక మూడవ దశ సుషుప్తి. ఈ అవస్థలో ఇంద్రియాలు, మనస్సు కూడా హాయిగా విశ్రాంతి పొందుతూ నిదురిస్తాయి. దీనినే మనం గాఢ నిద్ర అని వ్యవహరిస్తాము. మంచి నిద్రపట్టి మెలకువ రాలేదని అంటాం. ఈ అవస్థే సుషుప్తి. అలసిపోయిన శరీరావయవాలు, శరీరం పరిపూర్ణ విశ్రాంతితో సుఖ నిద్ర అనుభవిస్తాము. ఆగర్భ శ్రీమంతులు అనేక బాధ్యతలతో సతమతమయ్యే వ్యక్తులు సుఖ నిద్రను అనుభవించలేరు. ఆకలి రుచి ఎరుగదు, నిద్ర చోటు ఎరుగదు అనునది సామెత. మనస్సు వికలమైతే పరుపులున్నా పట్టదు నిద్ర. మనస్సు సంతోషంగా వుంటే గరుకునేలపైనైనా గురకలు పెట్టవచ్చు. అతి నిద్ర సోమరితనానికి నాంది.
పెందలకడనే నిద్రించు పెందలకడనే మేల్కొను అను పెద్దల సూక్తిని మరిచిపోయారు. అర్ధరాత్రివేళ షికార్లు చేస్తూ టీవీలు చూస్తూ అనేక రోగాలకు ఆశ్రయమిస్తున్నారు. ఇక పండుగ పబ్బాల సమయంలో లౌడ్ స్పీకర్లు పెద్ద శబ్దంతో పెట్టి శబ్ద కాలుష్యం కలిగిస్తూ రోగులకు పిల్లలకు చదువుకునే విద్యార్థులకు అనేక ఇబ్బందులు కలగచేస్తున్నారు.
మనుషులు సుఖ నిద్రకు దూరమవుతున్నారు. కంటినిండా సుఖ నిద్రను అనుభవించినవారు దినమంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండి ఎలాంటి అలసట చికాకు లేకుండా దినమంతా హాయిగా తమ పనులు చేసుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. పర్యావరణ హాని వల్ల కూడా నిద్రలేమి ఏర్పడుతున్నది. కావున ప్రతి వ్యక్తి పర్యావరణ పరిరక్షణ గావించుటకు ప్రయత్నించాలి. అప్పుడే ప్రకృతి మనకు చక్కని నిద్రను ప్రసాదిస్తుంది. ప్రశాంత వాతావరణం మనిషికి దివ్యౌషధము లాంటిది.

-పెండెం శ్రీధర్