మంచి మాట

భవబంధాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం ఈ మానవ జన్మ. ఈ భూమికి చేరిన ప్రతిక్షణం ఎంతో విలవైనదని గ్రహించాలి. ప్రతి మనిషి భవబంధాలు ఇక్కడే మొదలవుతాయి. ముందుగా ఈ జన్మనిచ్చిన భగవంతునిది భక్తిబంధం. ఆ తర్వాత అమ్మా నాన్నలది. అన్న అక్క చెల్లి తమ్ముళ్ల బంధం. అలా మన జీవితం ఎన్నో అనుబంధాల అపురూప జన్మ జన్మల బంధాలమయం.
భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది భక్తి. అది అర్చనం, సేవనం, కీర్తనం,.తృణమో ఫణమో పత్రమో, ఫలమో ఏవైనా కావచ్చు. భగవంతుడు ఇది నాకు ఇవ్వాలని దీ కోరడు. భక్తితో ఏమిచ్చినా స్వీకరిస్తాడు. రెండు చేతులో జోడించి భగవంతుడా! నీవే నాకు దిక్కు! అని తలిస్తే మనకై తరలి వస్తాడు. ఉదాహరణకు గజేందుడు హరీ అని పిలవగనే తరలివచ్చి గజేంద్రునికి మోక్షాన్ని కలిగించాడు.
మార్కండేయుడు శివా అని పిలువగానే యముడి బారినుండి కాపాడి చిరంజీవిని చేసాడు మహాశివుడు. అలాగే కన్నడు శివలింగానికి భక్తితో తన కనులను ఇచ్చి ఆ మహాదేవునికి చేరువైనాడు. జీవాత్మయే పరమాత్మ అన్నట్టు శ్రీ కాళహస్తి పుణ్య క్షేత్ర కథనం మనకు శ్రీ సాలెపురుగు కాళం పాము హస్తి ఏనుగుల ద్వారా ఏర్పడి శ్రీ కాళహస్తి అయినది. ఇలాఎన్నో పుణ్యక్షేత్రాల్లో భగవంతుడు మనకై వెలిసివున్నాడు.
భగవంతుడు సర్వాంతర్యామి. మనం ఏమి చేసినా తను చూస్తూనే వుంటాడు. మన అంతరాత్మ సాక్షిగా మనం ఎపుడూమంచి చేయాలి. చెడు గురించి ఏనాడు తలంచరాదు. ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే మనల్నికాపాడుతుంది. ఏ క్షణంలోనైనా ధర్మం దారి తప్పకూడదు. అలా తప్పిన మరుక్షణం ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకు శిక్ష విధిస్తాడు. అందుకే సదా మనం ధర్మమార్గానే్న పయనించాలి. మానవతతో మనుషులుగా జీవించాలి.
ఈ కలియుగంలో మానవులు క్షణికమైన సుఖలకోసం జీవితాలను పాడుచేసుకుంటున్నారు. మనిషి జీవితం నిత్యనూతనంగా వుండాలంటే చెడు వ్యసనాలవైపు వెళ్ల కూడదు. పురాణాల్లో సైతం చాలామంది రాక్షసులు స్ర్తిలవల్లె హతమైన సంఘటనలు మనకు విదితమే. సీతను చెరపట్టిన రావణుడు, మోహినిని వలచిన భస్మాసురుడు, ద్రౌపదిని కోరిన దుర్యోధన కీచకులు ఇలా ఎందరో రాక్షసులు ఆ భగవంతుని చేతిలో మరణించారు.
భగవంతుడు మనకై ప్రతి మనిషికి ఒక బంధం ఏర్పరుస్తాడు. అదే వివాహ బంధం. రాముడిలా ఒక భార్య, ఒక మాట అన్నరీతిలో మనిషి జీవితాన్ని చరితార్ధం చేసుకోవాలి. కానీ స్ర్తి వ్యామోహంతో పడి అయినవారిని వదిలి డబ్బును, ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్న ఘటనలు ఈ కలియుగంలో కోకొల్లలు. ఎంతోమంది మద్యం మత్తులో పడి జీవితాలను పాడుచేసుకుంటున్నారు. నూరేళ్ల జీవితాలు మూన్నాళ్ల ముచ్చటగా మారుస్తున్నారు. వారిని నమ్ముకున్న వృద్ధులను భార్యాపిల్లలను దిక్కులేని వారుగా చేస్తున్నారు. ఇక మదము. ఇది ఏదైనా డబ్బు, అధికారం, గర్వం లాంటిది. ఇందులో ఏది ఎక్కువైనా మనిషికి కళ్లు కనిపించవు. అందరూ ఉన్నా ఎవరూ లేని అనాధలామారడం ఖాయం. ప్రతి మనిషి మద్యం, మగువ, మదాలను విడనాడాలి. మంచి మానవత్వంతో జీవించాలి. అపుడే మహోన్నతమైన మానవ జన్మకు ఓ అర్ధం చేకూరుతుంది. మంచిని పెంచాలి...పంచాలి అపుడే మన జీవితం ఆనందమయం అవుతుంది.
అన్ని అనర్ధాలకు మూలం ఆవేశం. చీటికి మాటికీ మనం ఆవేశపడడం ఎంతమాత్రం తగదు. ఆవేశం వల్ల మనిషి విచక్షణ జ్ఞానం కోల్పోతాడు. ఏమి చేస్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో తనకే అర్ధం కాదు. తిరిగి చూసేలోపు జరగాల్సిన అనర్ధం జరిగిపోతుంది. మనికి ఆభరణం శాంతి సహనం. ఏ ఉపద్రవం ముంచుకువచ్చినా మనం శాంతంగా వుంటే పరిష్కారం దానంతట అదే పరిష్కారమవుతుంది. ఆవేశపడితే సమస్య మరింత జటిలం అవుతుంది. అందుకే ఎందరో మహాత్ములు ఓం శాంతి శాంతి అన్న మంత్రం జపించారు.

- కురవ శ్రీనివాసులు