మంచి మాట

సూర్యశక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సర్వమంగళ మాంగళ్యం సర్వ పాప ప్రణాశనం
చింతాశోక ప్రశమనం ఆయుర్వర్థనముత్తమమ్
రామ రావణ యుద్ధంలో అగస్త్య మహర్షి శ్రీరామచంద్రునికి ప్రబోధించిన ఆదిత్య హృదయంలో సూర్యారాధనవల్ల సర్వశుభాలు కల్గుతాని, సర్వపాపములు విధ్వంసమవుతాయని, విచారము శోకము నశిస్తుందని, ఆయుష్షు వృద్ధి చెందుతుందని వక్కాణించారు. రావణుడితో యుద్ధము జరిపి, శారీరకంగా, మానసికంగా బలీహీనపడిన రామచంద్రుడికి ఆదిత్య హృదయ పారాయణం దివ్యఔషధంలా పనిచేసి శక్తివంతుడు, ఉత్సాహవంతుడై రావణుని సంహరించి, లోకకల్యాణానికి కారకుడయ్యాడు.
వాయునందనుడు బాల్యంలో సూర్యుణ్ణి చూసి, ఫలమని భ్రమించి, దరిచేరి, తప్పు గ్రహించినవాడై, సూర్యుని ప్రార్థించి, ఆయనతో కలిసి ముల్లోకాలు పర్యటించి సకల శాస్త్రాలను నేర్చుకుని మహాబలసంపన్నుడు, ప్రతిభావంతుడయ్యాడు.
గుడిలోని విగ్రహాలను, పటములలోని చిత్తరువులను దేవుడి ప్రతిరూపాలుగా భావించి మనిషి ఆరాధిస్తున్నాడు. కాని సూర్యభగవానుడు ప్రత్యక్షంగా కన్పించే దైవం. ప్రాతఃకాలమున సూర్యునికి అర్ఘ్యాన్ని సమర్పించి, స్తుతిచేసి, నమస్కరించి ఎందరో మహానుభావుల సద్గతి పొందారు. స్థితికారకుడైన నారాయణుడే సూర్యుడి రూపంలో మనలను రక్షిస్తున్నాడు. అందుకే ఆయనను సూర్యనారాయణుడని అనేకులు కొలుస్తున్నారు. రథసప్తమి, మాఘమాసమునందలి భానువారముల భాస్కరుడికి అత్యంత ప్రీతికరమైనవిగా భావించి, భక్తులు పూజలు సల్పుతున్నారు.
సూర్యుని శక్తి అమోఘము, అద్వితీయము. ‘ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్’ అన్న సూక్తి అక్షరాలా నిజం. సూర్య నమస్కారాలను యథావిధిగా పాటించడం ద్వారా, మనిషి శారీరక, మానసిక పటుత్వం పొందుతాడు. ఒత్తిడినుంచి విముక్తి లభిస్తుంది. జీర్ణవ్యవస్థ, రక్తప్రసరణ మెరుగుపడతాయి. వైద్యశాస్త్ర రీత్యా మనిషి చర్మానికి తగినంత సూర్యరశ్మి తగలటం ద్వారా విటమిన్ ‘డి’ ఉత్పత్తి జరిగి, రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడటమేకాక, ఎముకలు బలాన్ని పుంజుకుంటాయని తెలుస్తున్నది.
తిమిరంలో సంచరించే జీవికి, వస్తువులను దర్శించే శక్తి వుండదు. ప్రాతఃకాలాన సూర్యోదయంతో వెలుగు ద్వారా సకల జీవులు చైతన్యాన్ని పొంది, వస్తు దర్శనాన్ని గావించుకొని, విచక్షణను, జ్ఞానాన్ని పొందుతున్నాయి. వన్యమృగాలు సైతం తమ ఆహారం కొరకు వెలుగులో అనే్వషణ జరిపి ఆహారాన్ని, నీటిని పొంది, ప్రాణాల్ని నిలుపుకుంటున్నాయి.
సముద్రాల్లోని, నదుల్లోని నీటిని గ్రహించి మేఘాలుగా మార్చి, ఋతువు రాగానే వర్షాన్ని అందించేవాడు సూర్యుడు. వృక్షసంతతి సూర్య కిరణాల సహాయంతో, ‘కిరణజన్య సంయోగక్రియ’ ద్వారా ఆహారాన్ని ఉత్పత్తి చేసి మనిషికి అందిస్తున్నాయి. రోగకారకాలైన అనేక మిలియన్ల క్రిమికీటకాలు, కేవలం సూర్యకిరణ స్పర్శవల్ల నశించి పరిసరాలు శుభ్రపడుతున్నాయి.
సూర్యశక్తి మహాశక్తివంతమైనది. విద్యుచ్ఛక్తి కంటే కూడా మెరుగైనది. అందుకే శాస్తజ్ఞ్రులు దీన్ని పరివిధాలుగా ఉపయోగించుకొని, పర్యావరణ కాలుష్యాన్ని కొంతవరకు తగ్గిస్తున్నారు. భూతలానగాని, ఆకాశమార్గానగాని, నీటిపైనగాని పయనించే మనిషికి ‘దిశానిర్దేశం’ చేసి గమ్యాన్ని చేర్చేవారు భానుడే.
ప్రతి వ్యక్తి ప్రాతఃకాలాన సూర్యుణ్ణి ఆదిత్య హృదయం లేదా సూర్యాష్టకం వంటి స్తుతులను పఠించి సూర్యుడికి నమస్కరించి దిన చర్యను ప్రారంభించటం శ్రేయస్కరం. అనేక గ్రహపీడలనుంచి విముక్తి లభిస్తుంది. పాపాలు హరించబడతాయి. ఆరోగ్యకరమైన, ఉల్లాసవంతమైన జీవితాన్ని గడపటానికి సూర్యారాధన ఎంతో అవసరం. ఉదయం నుంచి రాత్రివరకు నాలుగ్గోడలమధ్యనే ఉండకుండా, సూర్యుడు ప్రసాదించిన వెలుగులో సంచరించి, జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని పొందటం ప్రతిమనిషికి ఎంతో ముఖ్యం.

- వై.వి.రమణారావు