మంచి మాట

నమ్మకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగవంతునిపైన నమ్మకం, విశ్వాసం ఉండడం అవసరమే అని భక్తులు అంటారు. హేతువాదులు, భగవంతునిపైన నమ్మకం లేనివారు నమ్మకం అక్కర్లేదు, చేసేపనిని జాగ్రత్తగా పరిశీలించి నలుగురి ఉపయోగపడేటట్టుగా చేయమని చెబుతుంటారు. ‘నీవు చేసే పనే ఈశ్వరుడని భావించు పని యే పరమాత్మ’అనే వారు ఉంటారు. కేవలం భగవంతునిపైన భక్తి ఉండగానే సరిపోదు. కొంతమంది గురువుగార్ల దగ్గర, ఆధ్యాత్మిక వేత్తల దగ్గర భగవంతుని విగ్రహం దగ్గర పడీ పడీ దణ్ణం పెడుతుంటారు. వీరినిచూచి వీరికి చాలా భక్తి ఉందని అనుకొంటే పొరపాటు పడిన వారు అవుతారు. భక్తి అంటే కేవలం భగవంతుడిని ఎవరో వ్యక్తిని కాని, ఫోటోని కాని, విగ్రహాన్ని కాని భగవంతుడని నిరంతరం పూజాదికాలు చేస్తూ ఇవతల వారిని పురుగుల్లాగా లేక తమ కన్నా తక్కువగా చూస్తూ వారిని చీదరిస్తూ, లేక తామే బాగుండాలన్న ధ్యేయంతో ఇతరులను మోసం చేస్తూనే లేక వారి పట్ల అన్యాయాలు చేస్తూ ఉంటే వారిలో ఉన్న భక్తి కొరగానిది అవుతుంది.
మరికొంతమంది కేవలం మాకు చాలా భక్తి ఉంది అని నిరంతరం కేవలం పూజలోనే గడిపేస్తుంటారు. ధ్యానాదికాలుచేయడం, పొద్దున్న సాయంత్రం పూజ చేయడం లేకపోతే భజనల్లో పాల్గొనడం ఇవన్నీ కూడా వారు చేయాల్సిన నిత్యకర్మలను వదిలి మరీ చేస్తుంటారు. ఈ తరహ భక్తీ కూడా పనికిరాదు. ఏ పురాణాలు కాని ఏ భగవంతుడు కాని కేవలం స్తుతులు, హారతులు చేస్తూ కాలం గడపమని చెప్పలేదు. నీవు చేయాల్సిన కర్మను నీవు చేయి ఆపై వచ్చే ఫలితాలపై ఆశపెట్టుకోకు నీకు ఏమి కావాలో దాన్ని నేను నీకు ఇస్తాను’ అని మాత్రమే చెప్పాడు.
దాని బట్టి చూచినా మనుషులుగా పుట్టి వ్యర్థాలాపనలతో కాలం వెళ్లబుచ్చుకోక కర్తవ్యపాలన చేయాలని తెలుస్తుంది.
విశేష అవతారాలైన శ్రీకృష్ణ, శ్రీరామ అవతారాల్లో కూడా భగవంతుడు తాను దుష్టశిక్షణ కోసం పుట్టానని చెబుతూ దుష్టులను శిక్షించడమే కా క పుత్రునిగా ఎలా ఉండాలో ఏ కర్తవ్యాన్ని చేయాలో ఒక అన్నగా, ఒక తమ్మునిగా, ఒక పౌరునిగా, ఒక తండ్రిగా, ఒక పరిపాలనాధికారిగా అసలు మనిషిగా ఏమేమి చేయాలో ఎలా ఉండాలో కూడా చేసి చూపించాడు. వాటి మీద దృష్టినిలిపితే భక్తిలోని అంతరార్థం తెలుస్తుంది.
రాముడు పుట్టిన భగవంతుడు మైత్రీధర్మాన్ని కూడా లోకానికి విదితం చేశాడు. అరాచకాలను సృష్టించేవారిని ఏవిధంగా ప్రయత్న పూర్వకంగా తాను దేవుడిని కనుక అలౌకిక శక్తులతో వారిని నష్టపరుస్తాను అని చేసినట్లుగాక తాను తాను దూరం చేసుకొన్న సీతమ్మను ప్రయత్న పూర్వకంగా వెతుకుతూ అనేక కష్టాలను అనుభవించిన రాముడు వానరులను సాయం తీసుకొని వారధి నిర్మాణం చేసి శత్రువుతో భయంకరమైన యుద్ధం చేసి మరీ శత్రు నాశనం చేశాడు.
శ్రీకృష్ణుడుగా పుట్టినప్పుడు కూడా అలౌకిక చర్యలను చూపినప్పటికీ తాను ఒక కొడుకుగా అటు యశోదమ్మకు, ఇటు దేవకీదేవికి ఆనందం కలిగే పనులు చేసాడు. రాక్షసులను మట్టు పెట్టుగలనని తాను దేవుణ్ణి అని చెబుతూనే కొందరు రాక్షసులకు వెరిచినట్లు వారినుంచి దూరంగా పారిపోయినట్లు చేసి చూపించాడు. తిరిగి వారిని మట్టుపెట్టాడు.
ధర్మానికి గ్లాని జరిగితే నన్ను నేను సృజియంచుకుంటాను. అధర్మాన్ని కాలరాచి ధర్మాన్ని పునఃస్థాపిస్తాను అని భగవంతుడే చెప్పినట్లు గీత చెబుతుంది. అక్కడ కూడా భగవంతుడు నేను అతీంద్రియశక్తులు కలవాణ్ణి కనుక అధర్మాన్ని ఏ మంత్రంతోనో కాలరాస్తాను అని అనలేదు. తాను మళ్లీ పుట్టి ఏ అధర్మాన్ని ఏ విధంగా నాశనమొనర్చాలో దానికి తగ్గట్టుగా పుట్టి అధర్మనాశనం చేస్తానని ప్రకటించడం వెనుక ఏ కష్టం వచ్చిందో దాని పూర్వాపరాలుతెలుసుకొని మనసు పెట్టి ఆలోచించి కష్టాన్ని దూరం చేసుకోమని హితవు పలుకుతున్నాడు.
ఈవిధంగా చేయడంలోని లోకంలో అన్ని పనులు సాఫీగా జరిగిపోతాయని కాక అపుడప్పుడు కాలం ఎదురుతిరుగుతుందని అలా అననూకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు వాటిని ఏవిధంగా తనకు అనుకూలంగా మార్చుకుని తిరిగి అనుకున్నదాన్ని సాధించాలన్న మర్మాన్ని చేసి చూపించిన కార్యదక్షత కల నాయకుడు శ్రీకృష్ణుడు అని తెలియబరిచాడు. అందుకే మనిషిగా పుట్టినందుకు ఆలోచించి వివేకంతో తాను చేయవలసిన పనులను చేయాలి కాని సోమరులుగా తిని పడుకోవడం అనే వాటిలో చిక్కుకోకూడదు.

- రామారావు