మంచి మాట

సంపద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవులు పుట్టినప్పటినుంచి మరణించేవరకు సంపాదించినదంతా సంపదయే. కొందరు తమ జీవితకాలంలో పుణ్యం సంపాదిస్తే, మరికొందరు పాప సంపదను సంపాదిస్తారు. మామూలు మానవులు సంపద అంటే ధనమని, భవంతులని, పొలాలని భావిస్తారు. మహాత్ములు సంపద అంటే త్యాగం, శీలము, పరోపకారం వంటి మంచి లక్షణాలను సంపదగా భావిస్తారు. అధర్మంగా, అన్యాయంగా సంపాదించిన సంపదంతా పాప సంపదవుతుంది. ధర్మంగా, న్యాయంగా సంపాదించిన సంపద పరోపకారం కోసం వినియోగిస్తే పుణ్యసంపద అవుతుంది. పూర్వం రాజులు ఉన్నారు, రాజ్యాలు ఉన్నాయి. కాని వారందరూ ఏమి మూటగట్టుకుని పోయారు. కొందరు పాపం సంపాదించుకుని నామరూపాలు లేకుండాపోయారు. మరికొందరు పుణ్యం సంపాదించుకుని కలకాలం ప్రజల నోట్లో నాలుకై నిలిచిపోయారు. పుణ్యం సంపాదించాలంటే మనిషికి దయాగుణం, దానగుణం, త్యాగభావన, సత్ప్రవర్తన, పరోపకారం వంటి సుగుణాలు ఉండాలి.
పాప, పుణ్యాల సంపద సంపాదించేవారికంటే భిన్నంగా భక్తినే సంపదగా సంపాదించే భక్తాగ్రేసరులు ఉన్నారు. వీరిలో చెప్పుకోదగ్గవారు భక్తతుకారాం, భక్తరామదాసు, భక్తమార్కండేయుడు, భక్తశిరియాలుడు, భక్తకన్నప్ప, జనాబాయి వంటివారు ఎందరో మనకు ఆదర్శప్రాయులుగా కనిపిస్తారు. పాప పుణ్యాల సంపాదనకంటే భక్తి సంపద నిజమైనది. ఉత్తములు భక్తి సంపద సంపాదిస్తే, మధ్యములు పుణ్యపు సంపద సంపాదిస్తారు. అధములు పాపపు సంపద సంపాదిస్తారు. ఉత్తములు భగవంతునిలో ఐక్యమైతే మధ్యములు స్వర్గలోకం చేరుతారు. అధములు నరకలోకం పోతారు.
మానవులు సంసార సాగరంలో పడి సంసారాన్ని గట్టెక్కించేందుకు తప్పని తెలిసిన అన్యాయం, అధర్మం చేస్తున్నాడు. దీంతో పాపఫలం పొందుతున్నాడు. న్యాయంగా, ధర్మంగా ప్రవర్తించి సంసారాన్ని కలిగినదాంట్లో నడిపించవచ్చు. కోరికలు గుర్రాలై పరిగెత్తడంవల్ల వాటి వెంట పడి పరుగులు తీస్తున్నాడు. చేయరాని పనులు చేస్తున్నాడు. దీంతో పాపఫలం పెరిగిపోతుంది. జీవితం దుర్భరమవుతుంది.
ప్రహ్లాదుని మనుమడైన బలి చక్రవర్తి కన్నుమిన్ను గానక దేవతలను సైతం పీడించాడు. పాపం మూటగట్టుకున్నాడు. చివరకు వామనునికి ఇచ్చిన మాటకు కట్టుబడి మూడు అడుగుల నేల దానంచేశాడు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నందున కీర్తి సంపద సంపాదించాడు. దీనినిబట్టి మానవులు ఆడిన మాట తప్పవద్దు. పూర్వం భూదేవి కూడా బ్రహ్మతో కూడా ఇదే చెప్పింది. ఏ పాపం చేసినా భరిస్తాను కాని ఆడిన మాట తప్పినవారిని భరించనని.
మానవులు కనీసం ఆడిన మాట తప్పకుండా జీవిస్తే కొంతవరకైనా జీవితానికి ఉపయోగపడే సంపద సంపాదిస్తారు. జీవితం పునీతం చేసుకుంటారు.
............................................................
మంచిమాట శీర్షికకు ఆధ్యాత్మిక సంబంధమైన వ్యాసాలను
సులభశైలిలో ఎవరైనా సొంతంగా రాసి పంపించవచ్చు.
రచనలు పాఠకులకు ఆసక్తికరంగా వుండాలి.
మూడు అరఠావులకు తగ్గకుండా వుండాలి.
ప్రచురించిన రచనలకు పారితోషికం ఉంటుంది.

- జాధవ్ పుండలిక్‌రావు పాటిల్