మంచి మాట

భక్తసులభుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పత్రముగాని, పువ్వునుగానీ, ఫలాన్నిగాని లేదా నీటినిగాని భక్తితో ఎవరైతే నాకు సమర్పిస్తారో వాటిని నేను ఆనందంగా స్వీకరిస్తాను అని భగవద్గీతలో భగవానుడు స్వయంగా చెప్పాడు. అంటేఇక్కడ ఇచ్చేవస్తువు ముఖ్యంకాదు ఇవ్వాలనుకొన్న మనసే ముఖ్యం అని విజ్ఞులు అంతరార్థాన్ని గ్రహించాలని అంటారు. ఇంతకు ముందు యుగాల్లో భగవానుని కోసం కీర్తనలు పాడేవారు. వారి గానశక్తికిఆనందంపొంది వారికి కావాల్సిన రూపంలో భగవంతుడు వారికి దర్శనం ఇచ్చేవాడు. అంతకన్నా ముందు తపస్సులు చేసేవారు. ఎన్నో ఏళ్లు ఏకాగ్రచిత్తంతో భగవానుని కోసమే చింతించి చింతించి ఆ పరదైవం యొక్క దర్శనం పొందేవారు. భగవానుని దర్శనం పొందిన వారు ఎంతో ఆనందాబ్దిలో మునిగిపోయేవారు.
తపస్సు చేయాలన్న, సంకీర్తనలు ఆలపించాలన్నా ఎంతో కష్టపడాలి., ఈ కలియుగంలో మాత్రం - అట్లాంటి కష్టం ఏమాత్రం లేకుండా కేవలం మనస్ఫూర్తిగా భగవంతుని భజిస్తే చాలు. మనసున కృష్ణనామాన్ని తలుచుకుంటే చాలు. అంతకన్నా మానవత్వంతో మసిలితే చాలు. మనఎదురుగా ఉన్నవారికి కష్టం కలిగినపుడు మనమూ స్పందించి వారికి వచ్చిన కష్టాన్ని దూరం చేస్తే చాలు. వారు చిరునవ్వు నవ్వేలా చేయగలిగితే చాలు. కాస్తంత మంచిమాట, కాస్తంత ధైర్యం కాస్తంత నీకు నేను ఉన్నానన్న స్పృహ కలిగిస్తే చాలు వారిలో నిద్రాణమై ఉన్న శక్తి బయల్వెడు తుంది. వారిలో ఆత్మనూన్యత కాని వెనకబాటుతనం కాని ఉంటే అవి దూరం అయపోతాయ. అట్లా తోటివారికి సాయం చేస్తే చాలు. పరమాత్మ సంతోషప డుతాడు. సృష్టిస్థితిలయకారకుడైన పరమాత్మ మనకు తోడునీడగా ఉంటాడు.
అది చెప్పడానికే ఎన్నో పురాణ కథలున్నాయ. రంతిదేవుడు, శిబిచక్రవర్తి, కర్ణుడు వీరందరూ ఎదుటివారి కష్టాన్ని చూడలేక పోయనవారే. కష్టనష్టాలలో కుంగిపోతున్నజీవుల్లో నారాయణుని అంశను చూచి వారికి బాసటగా నిలిచినవారే. గజేంద్రుడు ఏ తపస్సు చేయలేదు. కాని నేను మొసలినుంచి తప్పించుకోగలను అనే అహం ఉన్నంతవరకు భగవంతుని నామాన్ని గుర్తుచేసుకోలేదు. కాని, తనలో ఎపుడైతే శక్తి క్షీణించిందో వెంటనే భగవంతుని గూర్చి ఆలోచించాడు. యోగుల హృదయాల్లో నివసించేవాడు, అంతటా నిండిఉన్నవాడు అసలు ఉన్నాడా లేడా అన్న సందేహాన్ని వెలిబుచ్చాడు. సందేహాన్ని కూడా విడిచి నీవు ఉన్నావు. ఎట్లా ఉన్నావో ఉన్నవాడిని ఉన్నట్టుగా కదిలిరా అని ఎలుగెత్తి పిలిచాడు. సర్వస్య శరణాగతి చెందాడు.
తన్ను నమ్మిన భక్తుని కాపాడానికి భగవంతుడు నిముషమైనా ఆలస్యం చేయడు కదా. అందుకనే మహావిష్ణువు ఉన్నవాడు ఉన్నట్టు లేచి వచ్చినా ఆయనవెంట శంఖచక్రాలు లక్ష్మీదేవి వచ్చారు. అలా వచ్చిన చక్రాన్ని తీసుకొని మొసలినుంచి గజేంద్రుణ్ణి రక్షించికాపాడాడు. అసలు శ్రీకృష్ణుని నమ్మితే చాలు నమ్మినవారికి నమ్మినట్లుగా శ్రీకృష్ణుని కృప లభిస్తుంది. తన్ను చూచిన ఆనందంతో అరటిపండు పడవేసి తొక్కలు పెట్టినా తిన్న కృష్ణుడు శ్రీరామావతారంలో శబరి ఎన్నో ఏళ్లుగా రామునికోసం ఎదురు చూచి చూచి మంచి పళ్లు ఇవ్వాలన్న ఆశతో తాను తిని చూచి ఇచ్చిన మధురమైన పండ్లను ఎంతో అప్యాయంగా పెట్టితే అంతే ప్రేమానురాగాలతో తిన్నాడు.
కంసునికోసం తీసుకొని వెళ్లే చందనాన్ని తనకు ఇవ్వమని అడిగి పుచ్చుకున్న కృష్ణుడు కృష్ణదర్శనంతో పరమానందం చెందే కుబ్జను అందాలొలికే సుందరాంగిని చేశాడు. భగవంతుని యందు నమ్మకం ఉంటే చాలు అది మహోత్తుంగ తరంగమై భగవంతుణ్ణే శాసించగలదు. అటువంటి భక్తే నిజమైన భక్తి కాని ఆటాటోపాలకు అంగరంగవైభోగం అనిపించే ఆడంబరాలకు భగవంతుడు పలుకడు. ఎంతటి కఠినుడో అంతటి భక్తసులభుడు భగవానుడు. మనసావాచాకర్మణా భగవంతుని స్మరిస్తేచాలు భగవంతుని కరుణకటాక్షాలు తప్పక పొందవచ్చు.

-ఎ. రాజమల్లమ్మ