మంచి మాట

పూజావిధానములు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవుని దర్శించుటకు అనేక మార్గాలున్నట్టే దేవుణ్ణి పూజించడానికీ ఉన్నాయ. వాటిలో పుష్పములు, గంధము, కుంకుమ, క్షీరము, ఘృతము, పెరుగు, తేనె, చక్కెర, బెల్లం, తమలపాకులు, వక్కలు, బియ్యం, పసుపు, అగరుబత్తులు, దీపపు ఒత్తులు, ఉదకం, పంచపాత్ర, ఉద్ధరిణి, మామిడాకులు, పండ్లు, కొబ్బరికాయ, కర్పూరం.. తదితర పూజా సామగ్రిని ఉపయోగించుకుంటూ తన ఇంట్లో తాను పూజచేస్తుంటే దీనిని సాధారణ పూజ అని లేక సాత్విక పూజ అనీ అంటాం.
అట్లాకాక సామూహికంగా ఫూజలు చేయడం వాటిల్లోను మరలా అందరినీ ఆకట్టుకోవాలన్న తపనతోనైనా, అందరికన్నా ఎక్కువగా పూజచేసానన్న తృప్తి మిగలాలన్న ధ్యాసతోనో లేక అందరికన్నా పూలు కాని, ప్రసాద వితరణ కానీ ఏదైనా అది ఆ పూజచేసేవారే భలే చేశారన్న ప్రజల భావన వినాలన్న ఉత్సుకతతోనైనా భారీఎత్తున పూజలను బ్యాండు మేళాలు, మైకులు లాంటివి పెట్టి అందులో మంత్రోచ్చారణ ఊరందరికీ వినిపించేలా చేయడం లాంటివి రాజస పూజలనీ అంటారు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా భగవంతుణ్ణి మెప్పించడం కన్నా తనను అందరూ పొగడడానే్న ఎక్కువగా ఆశిస్తున్నట్టు ఉంటుంది. ఇలాంటి పూజలను భగవంతుడు మెచ్చుతాడా అంటే అది సందేహమే. అట్లాఅని సాత్విక పూజలన్నీ భగవంతుడు మెచ్చేవే అంటే కాదు అందులోను తాను మాత్రమే ప్రతిరోజు పూజచేస్తానన్న అహంకారమో, లేక మనసులేకుండా యాంత్రికంగా పూజ చేయడం ఇలాంటి దోషాలేవన్నా అందులో ఉన్నట్టయతే ఆ పూజను కూడా భగవంతుడు మెచ్చుకుంటాడన్నది సంశయమే.
ఇంకా కొన్ని పూజలు ఉంటాయ. అవి తామస పూజలనవచ్చు ఎందుకంటే తనకు మాత్రమే ఉన్నతి కోరుకుంటూ, దానితోపాటు ఎదుటివారి వినాశాన్ని కోరుతూ, లేక విశ్వమంతా తన అధీనంలో ఉండాలన్న ధ్యాసతోనో చేసే పూజలు. ఇందులో పరహింస ఎక్కువగా కనిపిస్తుంది. ఇటువంటివీ భగవంతుడు మెచ్చు కుంటాడనడంలో సందేహమే ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే ఇవన్నీ కాక తనకు ఈ మానవ జన్మనిచ్చినందుకు కృతజ్ఞత తెలుపుకోవడానికో, లేక భగవంతుడు సర్వవ్యాపి కనుక తాను నిమిత్తమాత్రుడని తనను ధర్మమార్గంలో పయనించేట్లు చేయమని కోరడమో లేక తనతో పాటు మిగతా జీవరాసులన్నీ కూడా సుఖసంతోషాలతో ఉండేవిధంగా జీవించేటట్లు చేయమని వేడుకోవడమో కూడా భగవంతుని ఆరాధననే.
అట్లాకాక చేసే పనినే భగవంతుని రూపంగా భావించి కర్తవ్యనిష్టతో చేస్తూ ఫలితాన్ని భగవంతునికే వదిలివేస్తూ ఉండడమూ భగవంతుని ఆరాధననే. ఇట్లా ఇక్కడా అక్కడా అనే తేడాల్లేకుండాఅంతటనూ వ్యాపించే ఉండే భగవంతుని తత్వాన్ని తెలుసుకొంటూ భగవంతునికి ప్రియతములుగా జీవించడమూ భగవంతుని ఆరాధననే. మానవత్వంతో మసులుతూ ఎదుటివారిని నొప్పించకుండా జీవన యాత్రను సాగించడమూ భగవంతుని ఆరాధననే.
అందుకే భగవంతుడిని ఏవిధంగా ఆరాధించాలన్నది కాక తనకు లభించిన అమూల్యమైన ఈ మానవ జన్మ సార్థకత పొందేట్లుగా ఎదుటివారికి చేతనైనంత సాయం చేస్తూ జీవించాలి. స్వార్థాన్ని వీడి నలుగురికీ లాభం చేకూరేవిధంగా పనులు చేయాలి. తాను ఒక్కడూ సంతోషంగాఉండాలని కాక తనతో ఉన్న నలుగురూ సంతోషంగా ఉండాలనే విధంగా పనిచేస్తే భగవంతుని మారురూపులుగా చిరస్మరణీయులుగా ఉంటారు.
..............................................................................

మంచిమాట శీర్షికకు ఆధ్యాత్మిక సంబంధమైన వ్యాసాలను సులభశైలిలో ఎవరైనా సొంతంగా రాసి పంపించవచ్చు. రచనలు పాఠకులకు ఆసక్తికరంగా వుండాలి.
మూడు అరఠావులకు తగ్గకుండా వుండాలి.
ప్రచురించిన రచనలకు పారితోషికం ఉంటుంది.

- హనుమాయమ్మ