మంచి మాట

భక్తిమార్గము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగవంతుని దర్శించడానికి యుగయుగాలుగా మానవుడు తపన పడుతూనే వున్నాడు. కృతయుగంలో తపస్సు, త్రేతాయుగము మరియు ద్వాపర యుగములలో యజ్ఞయాగాదులతోను ఆ పరాత్పరుని ప్రత్యక్షం చేసుకొన్నారు. యుగయుగాలకు భావనలో మార్పు వచ్చింది కాని భక్తి మాత్రం ఒక్కటే! ఈ చరాచర సృష్టికి మూలమైన పరమాత్మను శ్లాఘిస్తూ కల్పన చేసే మనోభావాలనే భక్తి అంటారు. ఇది కలియుగం. నిరంతరం ఆ కవి యొక్క ప్రభావానికి లోనయి సంసార సాగరంలో మానవుడు కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. కొన్ని క్షణాలు కూడా మనో నిగ్రహంతో భగవంతుని ధ్యానించడం కష్టం. అటువంటిది ఇక తపస్సుకు, యజ్ఞయాగాదులకు కాలం అనుకూలించదు. మరి ఈ కలియుగంలో భగవంతుని చేరాలంటే మార్గమేమిటి? నామస్మరణ మాత్రముతోనే భగవంతుని వీక్షించవచ్చునని మన సనాతనం విశదపరచింది. ఎందరో భక్తాగ్రేసురులు ఆచరించి, అనుభవించిన భక్తి విధానాలతో నవ విధ భక్తి మార్గము ఒకటి. ఇది ఒక ఆరోహణాక్రమ అభ్యాసము. శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవ, అర్చన, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మనివేదన అనే నవ విధములుగా ఆ భగవంతుని ధ్యానించి కైవల్యమును సాధించవచ్చు.
సుఖ దుఃఖాలలో సమాన భక్తి భావన చేయువాడే స్థితప్రజ్ఞుడు. భక్తికి పరాకాష్ఠ ఆర్తి. భగవంతుని సాక్షాత్కారం కోసం ఇహపరములు ఎరుగక మరణానుభవంతో చేసే ఆరాధనే ఆర్తి. సత్సంగము ద్వారా శ్రవణమును అనుభవించవచ్చు. భగవంతుని లీలలను శ్రవణము చేయుట భక్తి భావనలో మొదటి సోపానము. శ్రవణము సంతృప్తికరమై కీర్తనకు దారితీస్తుంది. ఈ కీర్తన, సంగీత, సాహిత్య కళారూపాలలో కొనసాగుతుంది. అన్నమయ్య, రామదాసు, కబీరు, తుకారామ్, త్యాగరాజు మొదలైన కారణజన్ములు సంకీర్తనా మార్గములో కైవల్యాన్ని పొందారు.
సంకల్పశుద్ధితో మొదలయ్యే శ్రవణము కీర్తనతో వేగవంతమవుతుంది. అసంకల్పితంగానే నామస్మరణ ఆవర్తనమవుతుంది. అంతరంగం దైవ నామస్మరణతో మమేకమగును. కర్మాచరణలో కూడా మనసు నామస్మరణలో మునిగి ఉంటుంది. అంతరంగం సగుణ రూపుడగు భగవంతుని పాదసేవతో తృప్తిపరచాలని భావిస్తుంది. పాదసేవలో అర్చన ఒక భాగము. వివిధ పవిత్ర వస్తుజాలముతో పూజించడానే్న అర్చన అనవచ్చును. ఈ అర్చనలో కీర్తన, స్మరణ, పాదసేవ మిళితమై ఉంటాయి. అంగాగములను పుష్పములతో పూజించడం, వివిధ మధుర పదార్థాలతో అభిషేకము చేయుట మొదలైన క్రియలను అర్చన అని నిర్వచించవచ్చు. తదుపరి వందనము. వందనమనగా నమస్కారము అని చెప్పవచ్చు. విస్తృతముగా పరిలోకిస్తే, వందనము నేను అనే అహంకారమును వదలి సాష్టాంగము చేయుట అని చెప్పవచ్చు. పరాత్పరుని అనంత విశ్వంలో తనను ఒక రేణువుగా భావించుటనే వందనమనవచ్చు.
అహంకారహితుడైన పిదప భగవంతుని దాస్యములో మునిగి ఉండుటకు తహతహ మొదలగును. దాస్యములో అహంకార రహితమైన అంతరంగము అసంకల్పితముగా భగవంతుని సఖ్యత కోరుకుంటుంది. దాస్యమనగా కష్టసుఖములో తాపమును పరిమార్చుట, సౌఖ్యమును కలిగించుట. ఇవి మానసిక, భౌతిక రూపములలో ఉండవచ్చు. సఖ్యత తర తమ భేదమును రూపుమాపి స్వచ్ఛమైన స్నేహమును పెంపొందింపజేయును. భగవంతుడే స్నేహితుడగును. ఇదొక అపూర్వమైన అనుభూతి. ఈ కలియుగంలో అందరికి అందుబాటులో ఉన్న ఏకైక భక్తిమార్గము. భగవంతుని కీర్తించడంలో ఆనందము సిద్ధిస్తుంది. సంకీర్తన, స్మరణ చివరకు బ్రహ్మానందమును చేరును. ఆయన కాళీమాతను నవవిధములుగా పూజించి, స్మరించి బ్రహ్మానందములో మునిగి తేలెడివారు. ఎందరో భక్తాగ్రేసురులు యుగయుగాలలో భగవంతుని సాక్షాత్కారమును పొంది తరించారు. మనకు ఈ కలియుగంలో నవ విధ భక్తి మార్గమును తరుణోపాయంగా సనాతనం మనకందించింది. మార్గమును సుగమం చేసుకోవడం మన చేతుల్లో వుంది.

-వారణాశి వెంకట సూర్య కామేశ్వరరావు