మంచి మాట

ఆదర్శమూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీమద్రామాయణం ఒక ఇతిహాసం. శ్రీరామ కథ నిజంగా జరిగిందని, శ్రీరాముడు దుష్ట సంహారము శిష్టరక్షణ చేయడానికి అవతరించిన మహాపురుషోత్తముడని హిందువుల దృఢ విశ్వాసం. అందుకే శ్రీరామునిపైన ప్రజలలో విశ్వాసం చెక్కు చెదరటంలేదు. శ్రీరామచండ్రిని దేశ ప్రజలు ఇప్పటికీ ఒక అవతార పురుషునిగా, మర్యాదా పురుషోత్తమునిగా భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. శ్రీరాముడు సాధించిన అద్భుతాల ద్వారా సమస్త మానవ జాతికి శ్రేయోదాయకమైన మహా కార్యాలు నిర్వహించేందుకు స్ఫూర్తినిచ్చేది శ్రీరామ చరితము.
శ్రీరామ రామ ... రామ నామ వరాననే!
ఈ శ్లోకం చాలా ప్రాచుర్యం కలది. మంత్రంతో సమానమైనది. దీనిని స్వయంగా ఈశ్వరుడు ఉచ్చరించాడు. శ్రీరామ రామ అనే తిరుమంత్రాన్ని మూడుసార్లు ఉచ్చరిస్తే వెయ్యి నామాలతో వెలుగుల వేల్పుని ధ్యానించినట్లు అవుతుందంటారు.
శ్రీమద్రామాయణం మానవ చరిత్రలో మొదటి కావ్యం. దానిని రచించిన వాల్మీకి ఆదికవి. రామాయణంలో ఉన్నదే లోకంలో అన్ని చోట్లా కనిపిస్తుంది. రామాయణంలో లేనిది లోకంలో లేనే లేదు. ఆధ్యాత్మిక అస్తిత్వపు మర్మాలలోనికి లోతుగా చొచ్చుకుపోయిన అరుదైన గ్రంథం శ్రీమద్రామాయణం.
ఏమిటి రామకథలోని మహత్తు? నాటికీ నేటికీ రామరాజ్యం కావాలని ప్రజలు కోరుకుంటారు. రామరాజ్యంలోనున్న మహత్తు ఏమిటి? ఈ విషయం స్వయంగా నారదుడు శ్రీవాల్మీకికి వివరిస్తాడు. రామరాజ్యంలో లోకం హర్షోల్లాసాలతో, సంతోషంతో, సంతృప్తితో, సమృద్ధితో, చక్కని ధర్మాచరణతో, ఏ బాధా పీడలు లేకుండా, ఆరోగ్యంతో, కరువు కాటకాల భయం లేకుండా ఉండేది. రామ కథను వ్రాయమని ఈశ్వరుడు మహర్షి వాల్మీకిని ఆదేశిస్తాడు. సర్వమానవులు పుట్టినది లగాయితు చనిపోయేవరకు రామనామ స్మరణ చేస్తూ అతని గుణగణాలను గుర్తుచేసుకుంటూ వుంటారు. రామనామం సత్యం అంటూ మృతదేహాన్ని కాటికి తరలిస్తారు. ధర్మరక్షణ కొరకు, జనులను ఉద్ధరించడానికి అతను అవతరించేడనేది ప్రజల ప్రగాఢ విశ్వాసం.రాముడు చేసి చూపితే శ్రీకృష్ణుడు చెపుతూ తాను దగ్గరే ఉంటూ ధర్మాచరణను అందరిచేత చేయంచాడు. ధర్మమునకు హాని కలిగినప్పుడును, అధర్మము పెచ్చుపెరిగిపోతున్నప్పుడును నన్ను నేను సృజించుకొందును. అనగా సాకార రూపంతో లోకమున అవతరింతును. సత్పురుషులను పరిరక్షించుటకును, దుష్టులను రూపుమాపుటకును, ధర్మమును సుస్థిరమొనర్చుటకును నేను ప్రతి యుగమునందును అవతరించుచుందును.అన్న భగవంతుడే త్రేతాయుగంలో రాముడులా అవతరించాడు.
మర్యాదాపురుషోత్తమునిగా జనులతనిని కీర్తిస్తారు. అతని ధర్మనీతి, సమాజ నీతి, రాజనీతులను శ్రేష్టతరమైన రీతిలో ఆచరించాడు. అతని కథలు విన్నా చదివినా, స్మరించినా జీవితం ధన్యమవుతుంది. అత్యంత ఆనందము సుఖము కలుగుతాయి. శ్రీరాముడు సద్గుణాల సాగరం. అతని ప్రతిచర్యా ఆదర్శవంతమైనదే కాక అనుకరణీయమైనది. అతని ఆదర్శాలను పరమ ధర్మంగా స్వీకరించి ఆచరించడం ద్వారా మన ఆత్మలు పునీతమవుతాయి. ఎవరైతే అతని ఆదర్శాలను పాటిస్తారో, అతడ్ని ఆదర్శంగా తీసుకుని తమ కర్తవ్యాలను నిర్వహిస్తారో వారికి సౌభాగ్య ప్రాప్తి కలుగుతుంది. అతని చరిత్రను అనునిత్యం స్మరించేవారికి కష్టాలు దూరమవుతాయి. మానసిక శాంతి లభిస్తుంది. సమాజ శ్రేయస్సుకి పాటుపడాలనే కోరిక ఉద్దీప్తవౌతుంది.
సత్యము, సౌహార్దము, దయ, క్షమ, మృదుత్వము, మానసిక స్థిరత్వము, ఓరిమి, వీరత్వము, శాంతము, అస్తశ్రస్తమ్రులను ప్రయోగించే నైపుణ్యము, పరాక్రమము, నిర్భయత్వము, నిస్పృహ, నీతిజ్ఞత, దృఢత్వము, వినయము, ఓర్పరితనము, ఉపకారబుద్ధి, సంయమనము, ప్రేమ-అనురాగము, త్యాగము, సదాచారము, సత్ప్రవర్తనమువంటి ఎన్నో గుణాల ప్రోగు అయన రాముణ్ణి మనందరమూ ఆదర్శంగా తీసుకోవలసిందే. అనుసరించవలసిందే.

-గుమ్మా ప్రసాదరావు