మంచి మాట

మంచిమాట యాజ్ఞవల్క్యుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాజ్ఞవల్క్యుని తండ్రి బ్రహ్మరాతి. తల్లి సునంద. ఇతడు మహా మేధావి. శాకల్యుడను గొప్ప పండితుని వద్ద శుక్ల యజుర్వేదం అభ్యసించేవాడు. సుప్రియుడను రాజుకు శాకల్యుడు పురోహితుడు. ఒక పర్యాయం సుప్రియునికి ఏదో అంతు చిక్కని వ్యాధి సోకింది. రాజ వైద్యులెంత ప్రయత్నించినా వ్యాధి తిరుగుముఖం పట్టలేదు. శాకల్యునికి ఈ విషయం తెలిసి రాజదర్శనం చేసి ‘‘ప్రభూ ఔషధాలకు లొంగని వ్యాధులను జప తప హోమాదుల ద్వారా నివారించవచ్చును. అందుకు తగిన ప్రక్రియలు చేసి మీ వ్యాధి తగ్గిస్తాను, అధైర్యపడవద్దు అని చెప్పి ఆశ్రమానికి వెళ్లి నిత్యం జపం చేసి మంత్రోదకం రాజుకి అందజేసేవాడు.
ఒక రోజు రాజు శాకల్యునితో ‘‘అయ్యా నిత్యం మీరు శ్రమపడి రావద్దు. మీకు చాలామంది శిష్యులున్నారు కనుక ఎవరితోనైనా మంత్ర జలం పంపించండి’’ అని కోరాడు. శాకల్యుడు ఆ విధంగా రోజుకి ఒక శిష్యునిచే మంత్ర తీర్థం పంపడం ప్రారంభించాడు. ఒక రోజు మంత్ర తీర్థం రాజుకు అందజేయడానికి యాజ్ఞవల్క్యుని వంతు వచ్చింది. అప్పుడు యాజ్ఞవల్క్యుడు గురువుని సమీపించి ‘‘అయ్యా ఈ దినం నేను రాజుకి మంత్రజలం అందజేయాలి. అక్కడ ఒకవేళ రాజు నన్ను పరాభవిస్తే ఏం చేయను’’ అని ప్రశ్నించాడు. అలా జరిగితే నీవు ఇక కోటలోకి వెళ్ళనవసరం లేదు అని చెప్పాడు గురువు.
యాజ్ఞవల్క్యుడు మిగిలిన శిష్యులకంటే ఏదో విలక్షణంగా ఉండేవాడు కాబోలు. రాజు యాజ్ఞవల్క్యుని చూసి ‘‘మంత్ర తీర్థము నా వ్యాధిని నివారింపలేకపోతుంది. అయినా మంత్రశోధన మాకెందుకు?’’ అన్నాడు. అప్పుడు యాజ్ఞవల్క్యుడు తమరన్న మాటలు సరి కావు అనగానే రాజు ‘‘అంగీకరించాను. కానీ నీ వేషము సరిగానున్నదని చెప్పగలవా?’’ అని ప్రశ్నించాడు. మంత్రశోధన తగదని మీరే ఇప్పుడు సెలవిచ్చారు. మంత్రశోధన తప్పు అయినప్పుడు మంత్రములు బ్రాహ్మణాధీనములు కదా. అట్టి బ్రాహ్మణ శోధన ఇంకా దోషము అన్నాడు యాజ్ఞవల్క్యుడు. నిజమే, మంత్రములు బ్రాహ్మణాధీనములు. కానీ నీకెట్లు అధీనములు? బ్రాహ్మణ బాహ్య వేషమైనా లేని నీవు బ్రాహ్మణుడవని ఎట్లు చెప్పుకొనగలవు? నీ కట్టు, బొట్టు, బొట్టు బ్రాహ్మణునికి తగినట్లుగా లేవు అన్నాడు రాజు.
యాజ్ఞవల్క్యుడు అప్పుడు ‘‘రాజా ఇన్ని మాటలేల గురువాజ్ఞననుసరించి మంత్ర జలం తెచ్చాను, దీనిని ఏమి చేయమన్నారు’’ అని అడుగగా రాజు దగ్గరగానున్న గుఱ్ఱపు కట్టు కొయ్యను చూపి దానిపై పోసి వెళ్లమన్నాడు. యాజ్ఞవల్క్యుడు మంత్రోచ్ఛారణ చేస్తూ పవిత్ర జలాన్ని ఆ కొయ్యపై చల్లి వెళ్లిపోయాడు. ఒక గడియ అనంతరం ఆ కొయ్య పత్రాలతోను పుష్పాలతోను కళకళలాడుతూ వృక్షంగా మారిపోయింది. రాజు అది చూచి ఆశ్చర్య చకితుడై తన తప్పిదాన్ని గ్రహించి యాజ్ఞవల్క్యుని తిరిగి తన వద్దకు పంపవలసిందిగా శాకల్యునికి వర్తమానం చేశాడు. యాజ్ఞవల్క్యుడు వెళ్ళలేదు. గురువు ఆగ్రహించి ‘అవిధేయుడా నేను నీకు నేర్పిన విద్య నాకు తిరిగి ఇచ్చేవేయి’’ అనగానే యాజ్ఞవల్క్యుడు ఆ విద్యను వమన రూపంలో విడుదల చేశాడు. దగ్గరగా వున్న తిత్తిరి పక్షులు దానిని తినుటవలన దానికి తైత్తరీయం అని పేరు వచ్చింది. యాజ్ఞవల్క్యుని జీవితంలో ఇంకా ఎన్నో రసవత్తర ఘట్టాలున్నాయి. జనక మహారాజు అంతటివానిని మెప్పించి మన్ననలు పొందిన మహాయోగీశ్వరుడు అతడు.
........................................................................

మంచిమాట శీర్షికకు ఆధ్యాత్మిక సంబంధమైన వ్యాసాలను సులభశైలిలో ఎవరైనా సొంతంగా రాసి పంపించవచ్చు. రచనలు పాఠకులకు ఆసక్తికరంగా వుండాలి.
మూడు అరఠావులకు తగ్గకుండా వుండాలి.
ప్రచురించిన రచనలకు పారితోషికం ఉంటుంది.

-వేదుల సత్యనారాయణ