మంచి మాట

శ్రీ పంచమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ పంచమి, వసంతపంచమిగా ఖ్యాతిగాంచిన పంచమి మాఘశుద్ధ పంచమినే. ఈ పంచమి విశేషాలను దేవీభాగతం, బ్రహ్మాండ పురాణాలు చెబుతున్నాయ. సర్వులకు అత్యంతావశ్యకమైన జ్ఞానాన్ని ప్రసాదించే తల్లిని సరస్వతీగా సంభావించి ఆ తల్లిని కొలవడానికి అనువైన కాలం మాఘశుద్ధ పంచమిగా పెద్దలు స్థిరీకరించారు. బ్రహ్మదేవుని ఇల్లాలుగా చేతిలో వీణను మరోచేతిలో కమలాన్ని పట్టుకుని చిరునవ్వు తన అనుగ్రహాన్ని ప్రసాదించే తల్లిని శే్వత పద్మాసనగా, శే్వతాంబరిగా సేవిస్తారు. సకలవిద్యలకు ఆదిదేవతగా పిలుస్తూ ఈ తల్లి జన్మదినం ఈ మాఘశుద్ధ పంచమిగా చెప్తారు.
ఈ మాఘమాసంలో పంచమి తిథిని విద్యారంభాన్ని చేసిన వారికి సర్వవిద్యలూ అతిసులభంగా కరతలామలకం అవుతాయని తల్లిదండ్రులు తమ పిల్లలకు అక్షరాభ్యాసాన్ని చేయస్తుంటారు. వంగదేశంలో రతీమన్మథులను సేవిస్తారు. పార్వతీ కల్యాణంకోసం తన శరీరాన్ని కూడా లెక్కచేయని మన్మథుడు జనులకు వసంతాన్ని తెస్తాడని విశ్వసిస్తారు. ప్రకృతి కూడా వసంతాగమనాన్ని తన మొక్కలలేచిగుళ్లద్వారా తెలుపుతుంది. అపుడప్పడే మొగ్గతొడిగే వసంతాగమనాన్ని ఆహ్వానిస్తూ వంగదేశంలో రతీమన్మథుల సేవ చేస్తారు.
బ్రహ్మవైవర్త పురాణం శ్రీపంచమి నాడు విద్యాదానం చేసినవారికి వచ్చే పుణ్యాన్ని లెక్కకట్టలేమంటుంది. విద్యవల్లనే అధికారము, ధనము సంప్రాప్తవౌతాయని వాటిని మరలా సక్రమమార్గంలో వినియోగించాలన్నా దానికీ కూడా విచక్షణాజ్ఞానం ఆ శార దాంబనే ఇవ్వాలని అందుకే సరస్వతీదేవి జ్ఞానభిక్ష ప్రసాదించమని వేడుకోమనేది పురాణ వచనం. ఎవరూ దొంగలించలేని ధనం జ్ఞానం కనుక దాన్ని దానం చేస్తున్న కొద్దీ అది పురోభివృద్ధే జరుగుతుంది కనుక జ్ఞానదానమే అన్ని దానాల్లోకి మకుటా యమానమైనది అంటారు.
మాటతోనే ఒకరొకరి మధ్యస్నేహవారథులు ఏర్పడుతాయని, మాటతోనే సద్భుద్ధి, సమబుద్ధి ప్రకటితవౌతాయని అంటారు. ఆ సరస్వతీదేవి సర్వప్రాణుల యెడ సమబుద్ధికలుగుండాలని కోరుకోవాలంటారు. అశ్వలాయనుడు సరస్వతీ కటాక్షాన్ని పొందడానికి విధివిధానాలను సరస్వతీ రహస్యోపనిషత్ చెబుతుంది. ‘సామాంపాతు సరస్వతి’ అని సరస్వతికి నమస్కారం చేస్తే చాలట ఆ తల్లి సర్వాన్ని అనుగ్రహిస్తుందని అంటారు.
ఈ శ్రీపంచమి రోజున తెల్లనిజాజిమల్లెలాంటి పూలతో పూజించి, అమ్మవారిని శే్వత వ స్త్రాలతో అలంకరించి, సరస్వతీ అష్టోత్తరశతనామావళిని పఠించి అమ్మ వారికి తెల్లని రంగులో ఉన్న క్షీరాన్నాన్ని , నేతి పిండివంటలను, చెరకును, అరటి పండ్లను, నారికేళాన్ని నివేదన చేస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని పెద్దలవాక్కు. వ్యాసవాల్మీకులు సైతం అమ్మ అనుగ్రహవీక్షణాలతోనే వేదవిభజన చేయడం, పురాణాలు, గ్రంథాలు, కావ్యాలు రచించడం జరిగిందంటారు. జ్ఞాన ప్రదాయినిగా, ధన ప్రదాయినిగా శారదాదేవిని వేదం కూడా ఉపాసించమని ఉద్బోధిస్తుంది.
సరస్వతి నన్ను పాలించుగాక ....అంటూ తల్లిని కాపాడమని రక్షించమని వేడుకుంటూ దశశ్లోకిని ఆరు నెలలు పఠిస్తే వాక్కు ప్రసన్నమయ్యి, సర్వత్రా విజయం చేకూరుతుంది. ఈ శ్లోకాలను మాఘశుద్ధ పంచమినాడు పఠించి ఏ విద్యను ప్రారంభించినా, ఆ విద్య దినదినాభివృద్ధి చెందుతుంది. నిత్యం ఈ శ్లోకములను ధ్యానం చేసేవారికి వాక్సుద్ధి కలుగుతుంది. సర్వసంపదలూ ఒనగూరుతాయ. ఈమాఘశుద్ధ పంచమిన సరస్వతిని స్తుతిద్దాం. అమ్మదయను పొందుదాం.

- ఎస్ లక్ష్మి