మంచి మాట

శుశ్రుతుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రకృతిలోనున్న ప్రతి అంశమునకు ఒక శాస్త్రం వెల్లివిరిసింది. ఈ శాస్త్రాలవలన విజ్ఞానం వికసిస్తుంది. ఆధునిక కాలంలో వైద్య శాస్త్రం ఎంతో విస్తృతమగుతున్నది. వైద్య శాస్తమ్రును ముఖ్యంగా రెండు భాగాలుగా విడదీశారు. ఔషధ చికిత్స, మరియు శస్తచ్రికిత్స. శరీరంలోని రోగాన్ని గుర్తించి తగిన ఔషధము నిచ్చుట ఔషధ చికిత్స. ఇక శరీరంలోపలనున్న రోగాన్ని గుర్తించి ఆ భాగాన్ని చికిత్సద్వారా తొలగించుటయే శస్త్ర చికిత్స. శస్త్ర చికిత్సకు ఆద్యుడు శుశ్రుతుడు. ఈయన శస్త్ర చికిత్సకు అత్యంత ప్రాధాన్యతనిచ్చాడు. శుశ్రుతుడు శవాలను ఖండించి ఎంతో ఓర్పు నేర్పులతో అధ్యయనం చేసి ప్రత్యక్ష జ్ఞానాన్ని పొంది లోకానికందించాడు. భారతీయ శస్త్ర చికిత్స విధానాన్ని రూపొందించిన మూలపురుషుడు మాత్రం కపిలుడు. వేదకాలం నుండి అమలులో వున్న శస్తచ్రికిత్సలను ఎందరో మహానుభావుల పరిశోధనలను ఆకళింపు చేసుకుని శస్తచ్రికిత్స శాస్త్రాన్ని రూపొందించిన వ్యక్తి శుశ్రుతుడు.
శుశ్రుతుడు క్రీ.శ.ఆరవ శతాబ్దంలో ఉత్తర హిందూ దేశంలో నివసించాడని పరిశోధకులు ధ్రువీకరించారు. ఆకాలంలో దివోదాసుడు అను కాశీరాజు అపర ధన్వంతరిగా పేరు గాంచాడు. ఈయన వద్ద సుశ్రుతుడు వైద్య విధానాలు నేర్చుకొని ‘శుశ్రుత సంహిత’ గ్రంథస్థం చేసి శిష్యులకు బోధించాడు. 101 శస్త్ర చికిత్స విధానాలను, 24 రకాల పరికరాలను రూపొందించాడు. వెంట్రుకను కూడా నిలువున చీల్చగలిగినంత వాడియైన పరికరాలను శ్రేష్ఠమైన ఉక్కుతో తయారుచేయాలని తెలియజేశాడు. శుశ్రుతుడు మానవ శరీరాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మన శరీరంలో 300 ఎముకలు, 210 కీళ్ళు, 900 నరాలు, నాడులు మరియు చర్మములో ఏడు పొరలున్నాయని ధ్రువీకరించాడు. పూర్వకాలంలో యుద్ధాలలో శస్తభ్రాగాలు శరీరములో ఇరుక్కుపోతే వాటిని తొలగించి చికిత్స చేసే విధానాన్ని శుశ్రుతుడు విడమరచాడు. శరీరములోని అంత్రమూలలోనున్న శల్యాన్ని, మెదడులో చిక్కుకున్న శల్యాన్ని తొలగించే చక్కని చికిత్సా విధానాన్ని విశదపరిచాడు.
విరిగిన ఎముకను అతికే విధానము, శరీరంపై చెడిన భాగాన్ని తీసివేసి వేరొక భాగం నుండి కత్తిరించి అతికే విధానాన్ని రూపొందించాడు. శస్తచ్రికిత్స చేయునపుడు రక్తం స్రవించకుండా నిరోధించే విధానం, మిగతా శరీర భాగాలకు నొప్పి కలగకుండా మత్తు ఇవ్వడం వంటి నైపుణ్యాలను ఎంతో చక్కగా తన గ్రంథంలో వివరించాడు. కంటికి కనిపించని సూక్ష్మజీవులు రక్తంలో పుట్టి, వివిధ రోగ కారకములౌతాయని తెలియజేశాడు శుశ్రుతుడు. దేహంలో జీవాత్మ చాలా సూక్ష్మమైనదిగా ఉంటుందని నిరూపించాడు. చర్మచక్షువునకు అది కనిపించదు. కేవలం జ్ఞాన చక్షువు గలవారికి మాత్రమే అది కనిపించుననే సందేశాన్ని శుశ్రుతుడు తెలియజేశాడు. ముఖ్యంగా నేటి అవయవ మార్పిడి గుండెను మార్చుట, కాలేయం మార్చుట, కన్ను, చెవి, ముక్కు మొదలగు వాటిని తొలగించి కొత్తవాటిని అమర్చే విధానము మరియు ప్లాస్టిక్ సర్జరీ విధానాన్ని ఆనాడే శుశ్రుతుడు తన గ్రంథంలో వివరించి నేటి ఆధునిక వైద్య విధానానికి మార్గదర్శకుడైనాడు.
ఔషధ సంప్రదాయంలో చరకుడు శ్రేష్ఠుడు. ఇతడు చరక సంహిత అను వైద్య గ్రంథాన్ని రూపొందించాడు. చరక సంహిత అరబ్బీ భాషలోనికి కూడా అనువదింపబడినది. దేశ విదేశాలలో ఆ కాలంలో చరకుడు కీర్తి ప్రతిష్ఠలు ఆర్జించాడు. ప్రపంచంలోని వైద్య విధానానికి భారతదేశం మార్గదర్శకం. పతంజలియోగ సూత్రాలు, చరకుని చరకసంహిత, శుశ్రుతుని శస్తచ్రికిత్స, ధన్వంతరి ఆయుర్వేదం ఎంతో గొప్పవి. ఇంకా అగ్నివేశుడు, వాగ్భటుడు, అత్రి భరద్వాజుడు, ఆత్రేయుడు, గౌతమ మహర్షి మొదలగు వారు ఆయుర్వేదంలో ప్రావీణ్యులుగా వాసిగాంచారు. వీరు ఆయుర్వేద వ్యాప్తికి ఎంతగానో పాటుపడి ప్రజలకెంతో సేవ చేసినారు. వారి వైద్య విధానాలే నేడు ప్రపంచంలో మూడు పూలు ఆరు కాయలై అద్భుత ఫలితాలను అందిస్తున్నాయి. వైద్యుడు భగవంతునితో సమానము. రోగి భగవంతుణ్ణి వైద్యులలో దర్శించుకుంటాడు. వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనది, ఉత్తమమైనది.

- పెండెం శ్రీధర్