మంచి మాట

ఆత్మ పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇలలో మనిషిగా జన్మించడం మహోన్నతం. బాల్యం నుండీ తల్లిదండ్రుల పెంపకంతో గుణగణాలు, మంచీ చెడుల విచక్షణలు అలవడి, వాటి ప్రభావంతో, నిత్య జీవితాన్ని సుఖశాంతిమయం చేసుకోవడం మన చేతుల్లోనే వుంటుంది. అభిరుచులకనుగుణంగా, విద్య, వివాహం, జీవితంలో ఎదుగుదల ఇలాంటివన్నీ మానవుల కృషి ఫలితాలే. ఎంతో విలువైన కాలాన్ని వృధా చేసుకోకుండా ప్రతి క్షణం శ్రమించేవారికి, కష్టాలే సుఖాలుగా కనిపిస్తాయి. అదృష్టం అనుకుంటూ సోమరులుగా మారడం, అన్ని పనులను ఇతరులకు వదిలివేయడం బాధ్యతారహితమే. ఉపకారాన్ని మించిన ఉత్తమ గుణం ఉండదు.
సాటి మానవులకు సమయానుకూలంగా తోడ్పడటానికే సమాజం ఏర్పడింది. కుటుంబం వృద్ధిలోకి రావాలంటే ప్రేమానురాగాలు, ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండాలేగాని అర్థంలేని అసూయలు, పోటీలు అనర్థదాయకాలే. ఇరుగుపొరుగువారితో సఖ్యత, బంధువుల ఆదరాభిమానాలు కొండంత అండగా ఉండాలేకాని, వారేదో చేస్తేనే మనం వారితో బంధాలు పెంచుకోవాలని అనుకోకూడదు. ఎదుటివారిని ఏ విషయంలోనైనా తప్పుపట్టేముందు మనం వారిపట్ల ఎలా ప్రవర్తిస్తున్నాము? అని ప్రశ్నించుకోవడమే ఆత్మ పరిశీలనగా అనుకోవాలి.
భగవంతుడి కృపను కూడా అంకితభావంతో పొందాలే కాని గొంతెమ్మ కోరికలతో కాకూడదు. మనిషికి కర్మ ఫలితంగా, ఏది ఒనగూడాలో అది తప్పకుండా జరుగుతుంది.
నేడు సంఘంలో విచిత్ర ప్రవర్తనలు చోటుచేసుకుని, ఒకరినొకరు అకారణంగా బాధించడం, తోటివారి అభివృద్ధికి తాము కారకులు కాకపోయినా, అకారణ ద్వేషాలతో, హాని తలపెట్టడం లాంటివి నిత్య కృత్యాలు అవుతున్నాయ. అలాంటివాటిన్నింటికీ కూడా కారణం ఆత్మ పరిశీలనా రాహిత్యమే. అపరిమితమైన స్వార్థం గూడుకట్టుకున్న వారు తామే అన్నింటా వెలుగొందాలనే అహంకారంతో, ఇతరులను బాధపెట్టేవారిగా మారి, తమ మనశ్శాంతిని తామే కోల్పోతూ ఉంటారు. భగవంతుని సృష్టిలో ప్రతి ప్రాణి పుట్టుక విలువైనదే. కలుషిత వాతావరణం ఏర్పడేది వ్యక్తుల మధ్య అంతరాలే.
సంతోషాన్ని పంచడం పోయి విషాదాల్ని మనసులలో నింపేవారు తమను తాము ఎప్పటికీ తెలుసుకోలేరు. చెరపకురా చెడేవు, ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు అనే చెడు మార్గాల సామెతలు, దుష్టుల దుశ్చర్యలవల్ల పుట్టినవే. అందరి బాగుకోరేవారికి ప్రశాంతత దొరుకుతుంది. దేవుడి దయ దక్కుతుంది. విజయాలు స్వంతం కాగలవు. దేశం మనకు ఏమిచ్చింది? కన్నా మనం పౌరులుగా దేశభక్తిని ప్రకటిస్తున్నామా? అని అనకుంటే, ఇంటా బయటా ప్రగతి, సంపద, సౌకర్యాలు లభించి అందరికీ ఆనందం అందుతుంది. పరస్పర కలహాలు ఆత్మ పరిశీలనతో అంతం అవుతాయనడంలో సందేహం లేదు.
మానవుల్లో మంచితనం మానవత్వం వృద్ధి పొందాలంటే ముందుగా మన పురాణేతిహాసాలను చదువుకోవాలి. పురాణ పురుషుల జీవితాలను పరిశీలించాలి. వివేక విచక్షణాలనే గొప్ప సంపదను సొంతం చేసుకొన్న మానవుడు ఏది మంచిది ఏది చెడ్డదో తెలుసుకున్న తర్వాతనే అనుకొన్న పనిని చేపట్టి పూర్తిచేయాలి. అంతేకాక స్వార్థంతో ఇతరులకు నష్టం జరుగుకుండాను చూడాలి. తనకొక్కరికే లాభం రావాలని కాక నలుగురికీ చేపట్టిన పని వల్ల లాభం జరగాలని కోరుకోవాలి. సొంత లాభం కొంతమానుకుని పొరుగువారికి తోడు పడమని చెప్పిన పెద్దల మాటను నిరంతరం జ్ఞప్తిలో ఉంచుకోవాలి. పరోపకారం ఇదం శరీరం అన్నట్టు త్యాగమే జీవన లక్షణంగా మార్చుకోవాలి. ప్రకృతిని చూచి పరోపకార గుణాన్ని వృద్ధిపొందించుకోవాలి. నిరంతరం భగవంతుని నామాన్ని జఫిస్తూ ఇతరుల్లో భగవదంశను చూచే నేర్పును అలవర్చుకోవాలి. ఎప్పటికప్పుడు ఆత్మ పరిశీలన చేసుకొంటూ జీవనయానాన్ని క్రమబద్ధం చేసుకోవాలి.

-ఎం.వి.రమణకుమారి