మంచి మాట

మంచి చెడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి మనిషిలోను మంచిచెడు ఉంటాయ. మానవుడు త్రిగుణుడు కనుక మంచి చెడు అనే సంస్కారాలు రెండూ ఉంటాయ. సత్వగుణం ఎక్కువగా ఉంటే వారు సత్వగుణులుగాను, మంచివారిగాను కీర్తింపబడుతారు. రాజస, తమోగుణాలు వల లలోభాది దుష్టచింతనలు కలుగుతాయ. స్వార్థం పెచ్చుమీరుతుంది. దానితో పరుల సొమ్మును తీసుకోవాలనే బుద్ధి ఏర్పడుతుంది. మరికొంతమందికి పరులు సంతోషిస్తుంటే ఓర్వలేకపోవడం అన్న నీచబుద్ధి ఏర్పడుతుంది. ఇలా రకరకాలైన అసూయలు మాత్సర్యాలకు తావు ఏర్పడుతుంది. వీటిన్నింటిని పక్కనబెట్టి మనిషి సత్వగుణానే్న పైకి ప్రదర్శిస్తేవారు సజ్జనులుగా కీర్తింపబడుతారు.
ఈ సజ్జనులుగా మారాలంటే సత్సాంగత్యం చేయాలి. మంచి సాంగత్యంతో ఈ పూర్వజన్మ సంస్కారము, పరిసరాల ప్రభావము, జన్యుసంస్కారము, ఇతర సంపర్క సాంగత్య ప్రభావము మంచి చెడుల మధ్యవస్తున్న ఈ డోలాయమాన స్థితినిదూరం చేసి సత్వగుణాన్ని ప్రకాశమానం చేస్తుంది. దీనికి మనసున ఉండే భక్త్భివం మరింత చేదోడు వాదోడుగా మారుతుంది.
భక్తిని కూడా మనసులో సుస్థిరం చేసుకోవాలంటే సాధన చేయాలి. ఎంత సాధన చేసినా ఒక్కోసారి చిన్న ప్రకంపనలకే సాధన ఆగిపోతుంది. మనసు బలహీనంగా ఉండడం వల్లకాని, భయాందోళనవల్ల కాని నిరంతరాభ్యాసం చేసినప్పటికీ సాధన ఆగిపోతుంటుంది. కనుక సుస్థిరమైన బుద్ధి కావాలంటే మనసులో ఏమి ఆలోచిస్తుంటామో దానే్న ఆచరణలో కూడా పెట్టాలి. మనసులో చెడుఆలోచనలు పెట్టుకుని పైకి మంచిగా ప్రవర్తిస్తూ ఉంటే అది ఎక్కువకాలం ఆ నటన సాగదు. లోన చెడు పైకి విజృంభిస్తుంది. కనుక మనసులోను, ఆచరణలోను ఒక్కటిగా ఉండాలి.
మానవుడు దివ్యశక్తులను పొందగలశక్తి సంపన్నుడు. కనుక సత్వమార్గంలో సత్యధర్మాలను ఆసరా చేసుకొని జీవితయానాన్ని గడిపితే అనుకొన్న గమ్యాన్ని చేరగలడు. సత్వగుణోపేతునిగా పేరు తెచ్చుకోగలడు.
ఒకసారి అర్జునుడు శ్రీకృష్ణునితో ‘‘నా మనస్సు గాలిలోని దీపంవలె చరించుచున్నది. దీనిని అదుపులో ఉంచుకొనేది ఎలాగ?’ అని అడిగాడు. అందుకు సమాధానంగా శ్రీకృష్ణపరమాత్మ ‘‘అర్జునా! మనస్సుని నిగ్రహించుకొనుట కష్టమైన మాట అనడంలో సంశయమేమీ లేదు. అయితే అభ్యాసమువలన, వైరాగ్యమువలన అది సాధ్యపడుతుంది’’ అన్నాడు. ఎప్పటికీ మన మనస్సులోని దైవశక్తి దాని ప్రతికూల శక్తిని అణగద్రొక్కి, మేలైన దారిలోకి తీసుకువెళ్లేందుకు ఈ రెండు ముఖ్యమైన ఆయుధాలు మాత్రమే సాయపడేవి. ఒకటి నిరంతరం అభ్యాసము, రెండవది వైరాగ్యము.
వైరాగ్యం వలన తన అనుకొన్నది దానిపైనే ఆశ ఉండదు. అపుడు పరుల సొమ్ము కాజేయాలనే బుద్ధి అసలే పుట్టదు. దానివల్ల చెడు కోరికలు జనించవు. ఎపుడైతే కోరిక కలుగుతుందో దాన్ని తీర్చుకోవాలనిపిస్తుంది. ఒకవేళ కోరిక సన్మార్గంలో తీరకపోతే దుర్మార్గం వైపు మళ్లుతుంది. దుశ్చింతనలకు దారి తీస్తుంది. దుష్టచేష్టలు చేస్తారు. వైరాగ్యం కన్నా కూడా సమత్వబుద్ధిని సమకూర్చుకుంటే అన్నింటా సర్వాంతర్యామి ఉన్నాడని అనుకొంటే మనం ఎదుటివారిని బాధపెట్టినా అది సర్వేశ్వరుడిని బాధ పెట్టినట్టు అవుతుందనే నిశ్చయభావం ఉంటే కూడా ఇతరులకు కీడు చేయాలనే ఆలోచన పుట్టదు.
అందుకే మనసు నియంత్రణ చేయాలంటే సత్వగుణం కావాలి. వైర్యాగంఉండాలి. నిరంతర సాధన వల్ల మనసు ఆధీనంలోకి వస్తుంది. ఏదైనా ఒక ఇష్టమైన నామాన్ని సదా జపిస్తూ ఏకాగ్రతను సాధిస్తే మనసు నియత్రణలోకి వస్తుంది. మనసు ఆధీనంలో నోటినుంచివెలువడే మాట సున్నితంగాను, ఇతరులను బాధపెట్టనివిధంగాను వస్తుంది.ఒకవేళ మనసు సాధన క్రమం తప్పినా తిరిగి సాధన కొనసాగించాలి. కాని దాన్ని క్రమం తప్పింది కదాఅని వదిలివేయకూడదు. గొప్ప మునులకు ఏకాగ్రత సడలుతుందని పురాణాలు చెప్తున్నాయ. కనుక సాధన కోసం నిరంతరంశ్రమించాలి.

- ఎస్. నాగలక్ష్మి