మంచి మాట

స్నేహధనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామాయణం రసరమ్యకావ్యం. క్షితిజపై తరులు, గిరులు, నదులు ఉన్నంతకాలం రామాయణం, రామనామం నిరంతరం జపించడబడుతూనే ఉంటుంది. ప్రతి ఆధ్యాత్మ హృదయాన్ని పులకింపచేస్తుంది. సమస్త మానవాళికి ఆచరణీయమై నిలుస్తుంది. ఆదర్శ జీవితానికి దిశానిర్దేశం చేయదగిన మహిమకల మహాకావ్యం ఒక్క రామాయణమే!
సకల రాజ్యభోగాలను తృణప్రాయంగా త్యజించి, పితృవాక్య పరిపాలనాదక్షుడై, సీతాలక్ష్మణ సమేతుడై పదునాలుగు సంవత్సరాలు అరణ్యవాసానికి బయలుదేరాడు శ్రీరామచంద్రుడు. చారుల ద్వారా శ్రీరాముని ఆగమనం తెలుసుకున్న గుహుడు తన మంత్రులు, బంధు గణాలతో స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉండడం చూసి రాముడు ఆనందపరవశుడైనాడు.
నిషాద రాజైన గుహుడు శ్రీరాముని అనుంగు మిత్రుడు. గొప్ప భగవత్ భక్తుడు. నిషాదుడైనా అత్యంత సౌమ్యుడు, వినయశీలి, దానశీలి. సర్వశ్య శరణాగతి చేసిన సంపూర్ణ భక్తుడు. ద్విజుని కంటే గొప్ప గుణం కలవాడు.
రామాయణంలోని ప్రతి ఒక్కరూ గొప్ప ఔచిత్యం కలవారు కావడం విశేషం. రామాయణం సర్వం కారణజన్ముల పర్వం.
నిషాద రాజు గుహుడు రాముణ్ణి ఎంతో ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు. రామాయణంలో ఇద్దరికే శ్రీరామ ఆలింగనా భాగ్యం కలిగింది. తనకు తానుగా ఆలింగనం చేసకున్న భాగ్యశాలి గుహడు కాగా, సీతామాత జాడ తెలుసుకుని ఆ శుభవార్తను తీసుకువచ్చిన హనుమకు ఆలింగనా సౌభాగ్యం కలిగించాడు శ్రీరామచంద్రుడు.
ఆటవిక దుస్తులలో ఉన్న సీతారామలక్ష్మణులను చూసిన గుహుడు అత్యంత వ్యథ చెంది తన రాజ్యాన్ని అయోధ్యగా భావించి రాజ్యం చేయాలని కోరాడు. ఒక త్యాగధనునికి మరొక స్నేహధనుడు తోడు. గుహుణ్ణి సున్నితంగా తిరస్కరిస్తూ అతను చేకూర్చిన షడ్రసోపేతమైన విందును తన మనసుతో ఆమోదించి, కందమూలాలు భుజిస్తూ, నారబట్టలు మాత్రమే ధరిస్తానని ప్రతిజ్ఞ చేసానని వివరిస్తూ ఆ విందును తన అశ్వములకు సమర్పించమన్నాడు.
ఆ రాత్రి గుహుడు సీతారాములకు ఒక పెద్ద వటవృక్షం క్రింద సౌకర్యవంతమైన శయ్యను ఏర్పాటుచేసి లక్ష్మణ సమేతుడై గుహుడు కావలి బాధ్యత స్వీకరించాడు. మరునాడు ఉదయం గంగను దాటడానికి ఒక అందమైన నావను గుహుడు సిద్ధం చేశాడు. సీతారాముల పాదాలు కడిగి తలపై జల్లుకున్నాడు. సుమంత్రుని అయోధ్యకు పోయి కైకేయి మాతకు నేను అడవిలో ప్రవేశించానని చెప్పి నమ్మకం కలిగించమని వీడ్కోలు చెప్పాడు శ్రీరామచంద్రుడు.
అటు పిమ్మట వటవృక్షంనుండి పాలను తీసుకురమ్మని గుహుని కోరాడు. ఆ పాలలో రామలక్ష్మణులు తమ శిరోజాలను ఆసాంతం తడుపుకొని జడలుగా మార్చుకుని అరణ్యవాస యోగ్యులైన ఋషిపుంగవులుగా మారారు. గుహుని దగ్గర వీడ్కోలు తీసుకొని అందమైన నావలో గంగా యమునా పవిత్ర సంగమ ప్రదేశంలోని భరద్వాజ ఆశ్రమం చేరుకున్నారు సీతారామలక్ష్మణులు. అరణ్యవాస యాత్రలో సహాయపడిన గుహుడు ధన్యుడైనాడు. జంబూద్వీపమంతా శ్రీరామ పాద ధూళిలో పవిత్రమై అలరారుతోంది. రామనామంతో మన మనసులు పులకితమవుతున్నాయి.

-వారణాసి వెంకట సూర్య కామేశ్వరరావు