మంచి మాట

ప్రకృతి ఆరాధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గురుదేవులు దక్షిణామూర్తి సృష్టిలోని ప్రతిదానినుంచి పాఠం నేర్చుకోవచ్చు అని చెప్పారు. దక్షిణామూర్తి 24మంది గురువుల నుంచి పాఠాలను నేర్చుకున్నట్లు , బోధతీసుకొన్నట్టు చెప్తారు. సద్గురువుగా భాసిస్తున్న శిరిడీ సాయిబాబా తాను ఏ గురువు దగ్గర ఉపదేశం తీసుకోలేదనే విషయాన్ని చెప్తూ అసలు జీవిత అనుభవాలే ఉపదేశాలు అందులో నుంచి పాఠాలను గ్రహించాలని పరోక్షంగా చెప్పారు. రమణ మహర్షి ముందు నీవెవరో నీవు తెలుసుకొంటే చాలు, ఆ అనే్వషణ అన్ని ఉపదేశాలను ఇస్తుందన్నట్టుగా చెప్తారు. జిడ్డు కృష్ణమూర్తి - నీ చుట్టూ ఉన్న దాన్ని ఏమిటి అని పరిశీలించు కాని దానికి నీవేదైనా సిద్ధాంతాలను చేసి ఆ సిద్ధాంతంలో ఇరుక్కుపోకూడదు. దేనినైనా సాక్షిమాత్రంగా చూస్తే చాలు అనేవారు. భగవాన్ సత్యసాయిబాబా కూడా జనులకు సేవ చేస్తే జనార్దనుని సేవ చేసినట్లు అవుతుంది. ఉపదేశాలో బోధలో తీసుకొని ముక్కు మూసుకు ని తపస్సు చేయడం మనిషి లక్షణం కాదు, పరులకు ఉపయోగపడేలా జీవితాన్ని తీర్చి దిద్దుకుంటే చాలు అని అంటుండేవారు. ఇలా ఎవరికి తోచినట్లు వారు సామాన్యులను ధర్మాచరణలో పాలు పంచుకునేలా చేయడానికి కృషి చేశారు.
మొట్ట మొదట మనిషికి ప్రకృతే పరమ గురువు అనేవారూ ఉన్నారు. దాన్ని తెలుసుకొన్న ఆదిమ మానవుడు ప్రకృతిని తన జ్ఞానంతో ఆరాధించాడు. ఇక్కడ ఆరాధన అంటే అర్థం చేసుకోవడమే. ప్రకృతి ని పరిశీలించి దేని వల్ల ఏమి సంభవిస్తుందో తెలుసుకుంటే మనిషి తన జీవితాన్ని కూడా తీర్చిదిద్దుకోవచ్చు అంటారు. ప్రకృతి అంటేనే చెట్లు పుట్టలు, కొండలు, పర్వతాలు నదీనదాలు ఇలా ప్రాణులు ఇవన్నీ కలిస్తేనే ప్రకృతి.
త్రిగుణాలతో సమ్మిళితమైన ప్రకృతి మనిషికి ప్రేమను, సేవాభావాన్ని, త్యాగగుణాన్ని పెంచుకోవాలని నిర్దేశిస్తోంది. ప్రకృతిలోని ప్రతి పదార్థమూ త్యాగమయ జీవనంలోని ఔన్నత్యాన్ని ప్రతిబింబిస్తుంది.
నీరు లేనిదే బతకలేని మనిషికి జలాశయాలు కేవలం దప్పిక తీర్చుకోవడానికి కాదు జీవితంలో వెలుగు రేఖలను పంచే విద్యుత్తు ఉత్పాదనకు కూడా తోడ్పడుతాయి. గాలి లేనిదే క్షణమైనా జీవించలేని మనిషికి చెట్లు తమ ఆహారోత్పాదన ద్వారా ప్రాణవాయువును ఉత్పత్తి చేయడమే కాదు మనిషి కావాల్సిన అనేక రకాల తిండి పదార్థాలను అందులో పుష్టిగా ఎదగడానికి అవసరమైన అన్ని రకాల విటమిన్లను అందిస్తున్నాయి. మనిషిప్రకృతి లో ఏర్పడే శీతోష్ణస్థితులను తట్టుకోవడమెలాగో కూడా చెట్ల ద్వారా జంతువుల ద్వారా, పర్వతగుహల ద్వారా చూపించిన ప్రకృతి ని చూచే కాంక్రీటు భవన నిర్మాణానికి పునాదులు వేసాడు.ఇన్ని విధాల సహాయం చేసే ప్రకృతి గురించి ఉపనిషత్తులు వివరిస్తున్నాయి. ప్రకృతి ప్రాముఖ్యాన్ని సాంఖ్య శాస్త్రం బోధిస్తుంది.
పరస్పర పూరకాలుగా పరస్పర ఆధారాలు ఉన్న ప్రకృతి మనిషి ఒకే మూలశక్తి రూపాలంటుంది సనాతన హైందవ ధర్మం. అందుకే ప్రకృతికి నమస్కారం చేయమని ప్రకృతిని ఆరాధించమని చెప్పడంలోని ఆంత ర్యం. కొంతమంది ప్రకృతిని పరమాత్మ స్వరూపంగా భావిస్తారు. పరమాత్మను ఆరాధించడం అంటే ప్రకృతిని పూజించడమే. ప్రకృతి నేర్పే పాఠాలను మనిషి నేర్చుకుని ఆచరిస్తే ప్రకృతి వైపరీత్యాలను వైషమ్యాలను దూరం చేసుకోవచ్చు. మనిషి జీవితంలోని ఒడిదొడుకలు రాకుండా చూసుకోవచ్చు. అట్లాకాక ప్రకృతిలోని ఏ చెట్లనైనా, పుట్టలనైనా నాశనం చేస్తే అంటే వాటి ఉనికిని భంగం కలిగిస్తే ఏవౌతుంది? ఇది అందరికీ తెలిసిన విషయమే. చెట్లు నరుకుతూ పోతున్న మనిషి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటూనే ఉన్నాడు. చీమలు దూరని చిట్టడవి, కాకులు దూరని కారడవి అని వినే కథల్లో అడవులు అరణ్యాలు ఇంతకుముందు కాలంలోఎలా ఉండేవో చెప్తాయ. చిక్కని చెట్లు జలాశయాలున్న అడవులను నరికి జనారణ్యాలు చేసే ప్రయత్నం లో కాంక్రీటు మయం చేస్తున్న మనిషిని ప్రకృతి ఎండాకాలం అగ్ని గోళాలను విరజిమ్ము తున్నట్టుగా భావింపచేస్తోంది. వర్షాలు రావడం అంటే సునామీలను సృష్టించి ఎడారులను, మైదానాలను సృష్టించడమే కాక ప్రాణి నష్టాన్ని కూడా చేస్తోంది. ఇవన్నీ గ్రహించి మానవుడు తాను ఏమి చేయాలో ఏమి చేయకూడదో ఇప్పటికైనా గ్రహించి చెట్లను పెంచడం జలాశయాలను కలుషితం కాకుండా చేసేందుకు ఉపక్రమిస్తే అటు ప్రకృతి ఇటు మనిషి కూడా ప్రమాదం బారి నుంచి రక్షించ బడుతారు.

- ఆర్. నిర్మల