మంచి మాట

భగవంతుని అనుగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వ్యాస భగవానుడు వేదవిభజన చేశాడు. ఎనె్నన్నో రచనలుచేశాడు ఆఖరికి సర్వధర్మాలను వివరించే మహాభారతాన్ని కూడా రచించినప్పటికీ, మనశ్శాంతి లేక బాధపడుతుండేవాడు. అలాంటి సమయంలో ఓ రోజున నారదుడు వ్యాసుని దగ్గరకు వచ్చి ఆయన వ్యాకులత తెలుసుకొన్నాడు. వ్యాసుని దుఃఖందూరం చేద్దామనుకొని ఓ వ్యాసా! నీవు ఇన్ని రచనలు చేశావు కాని శ్రీహరి లీలావిశేషాలను తెలిపే కథలను పట్టించుకోలేదు. ఇక నీవు ఇపుడు శ్రీహరి గుణగానాన్ని కథారూపంలో వ్యక్తం చేస్తూ రచన సాగించు నీకు మనస్తాపం నశిస్తుంది అని చెప్పాడు.
పూర్వంలో తాను ఎలా మనఃశాంతిని పొందిందో వివరించాడు. పూర్వజన్మలో వేదాధ్యయన సంపన్నుడైన ఓ గొప్పవారి ఇంట పనులు చేసే దాసికి పుత్రుడుగా జన్మించాను. ఓసారి ఆ ఇంటి యజమాని చాతుర్మాస్య దీక్షలో ఉన్న ఋషులకు సేవ చేయటం కోసం నన్నుపంపాడు.ఋషుల దగ్గరనేను చేసి వారి ఆదరాన్ని చూర గొన్నాను. నా సేవకు ఆ ఋషులు ఎంతగానో సంతోషించారు. ఋషులతో పాటుగా నేను నిరంతరం ఆ హరినామసంకీర్తన చేస్తుండేవాడిని. చాతుర్మాస్య దీక్ష తర్వాత ఋషులంతా తీర్థయాత్రలకు బయలుదేరుతూ నాకు నారాయణ మంత్రాన్ని ఉపదేశించారు. నిరంతరం ఆ మంత్రాన్ని జపిస్తూ ఉంటే మంచి జరుగుతుందని చెప్పారు. త్వరలోనే భగవంతుని అనుగ్రహం పొందవచ్చుని కూడా వారు చెప్పారు. కొన్నాళ్ల తరువాత పాము కాటు వల్ల నా తల్లి చనిపోయంది. ఆ దుఃఖాన్ని నేను భరించలేకపోయాను. ఇక అక్కడ నాకు పనేమీలేదని అక్కడ్నుంచి వెళ్లిపోయాను. పోతూ కూడా హరినామకీర్తన మాత్రం నేను ఆపలేదు. అలా నేను నడిచి నడిచి చాలా దూరం నడచి అలసిపోయ ఓ చెట్టు కింద కూర్చుని కళ్లు మూసుకొన్నాను. అంతలో నా దృష్టికి ఆ మాధవుడు కనిపించి అంతలోనే కల చెదిరింది. జనార్దనుడు కనిపించకుండా పోయాడు. నేను ఊహించనదని జరిగి వెనువెంటనే శ్రీహరి కనిపించనందున నేను బాగా డస్సిపోయాను. కాని మరలా పనికట్టుకుని ముందుకు వెళ్లి దారిలో తటాకం కనిపిస్తే స్నానపానాదులు చేసి మళ్లీ హరినామసంకీర్తన చేస్తూ నాకు దైవదర్శనం కలుగాలని వేడున్నాను.
కాని ఆ దైవం నన్ను కరుణించలేదు. మళ్లీ ఆ హరి రూపం నాకు కనిపించలేదు. నేను పదేపదే కోరుకుని అలసిపోయాను. భగవంతుని దర్శనం కలుగలేదని నా శరీరాన్ని శుష్కింపచేసుకొన్నాను. కాని భగవంతుని అనుగ్రహాన్ని పొందలేక పోయాను. అపుడు అశరీరవాణి నాతో ఓయ భగవంతుని అనుగ్రహాన్ని పొందడానికి దగ్గర దారి ఉంది. అదేంటంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలనే అరిషడ్వర్గాలను జయించి, కర్మలన్నింటినీ నిర్మూలన చేసి, పరిశుద్ధుడైన యోగిగా మారితే భగవంతుడు తనకుతానై వచ్చి నిన్ను అనుగ్రహిస్తాడు. అట్లా నీకు చేసే శక్తి లేకపోతేకేవలం భగవంతుడినే నిశ్చలంగా నమ్మి భగవంతుడిపై భారం వేసి నేను చేసే ప్రతి పనీ భగవంతుని ప్రేరణతోనే చేస్తున్నాను. కర్త కర్మ క్రియ కూడా భగవంతుడు తప్ప నేను అనేది కేవలం పరికరమే. దాన్ని భగవంతుడే ఉపయోగించుకుంటున్నాడు. ఫలితమూ భగవంతునిదే కార్యమూ భగవంతుడే అని నమ్మి జీవనయానం సాగించు భగవంతుడి నామాన్ని, చరిత్రను నిత్యం పఠించు... భగవంతుని నిస్సంగత్వాన్ని భక్తునికోసం ఆయన చేసే సంగత్వాన్ని గుణాతీతుడెట్లానో అట్లానే భక్తునికోసం ఎట్లా గుణవంతుడౌతాడో, ఎట్లా రూపవంతుడు అవుతాడో ఇవన్నీ అంటే భగవంతుని లీలావిశేషాలను నిరంతరం స్మరించు అని చెప్పింది. నేను ఆవిధంగా చేశాను. నాకు భగవంతుని అనుగ్రహం దొరికింది. కనుక నీవు కూడా భవగంతుని లీలావిశేషాలకర అక్షరరూపం ఇవ్వు తప్పక భగవంతుని అనుగ్రహం దొరుకుతుంది అనిచెప్పాడు. వెంటనే నారదోపదేశంతో వ్యాసుని భాగవత రచన చేశాడు. మనఃశాంతినిపొందాడు. మనమూ భగవంతుని గుణగానాన్నిఆలపిద్దాం. భగవంతుని అనుగ్రహానికి పాత్రు లవుదాం

- ఎస్. నాగలక్ష్మి