Others

మంగళం మనోహరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివశబ్దం శుభకరం, మంగళకరం. శివతత్వం సులభంగా అర్థంకానిది. శివుని శరీరానికి మైపూత బూడిద, పులిచర్మ ధారణం, వృషభ వాహనం, కాని పరమశివునిలో అంతుపట్టని పరమార్థం. అది తెలుసుకొన్నవాడే శివుడు. అమృతసాధనలో క్షీరసాగరమధనంలో పుట్టిన హాలాహలానికి లోకాలన్నీ తల్లడిల్లిపోయాయి. అగ్ని కణాలు విస్ఫోటనానికి వారువీరనే తేడాలేకుండా సర్వులూ హాహాకారాలు చేశారు. పరమేశ్వరా రక్ష రక్ష అంటున్న వారికి ఉపశమనంగా బెంబేలెత్తించే హాలాహాలాన్ని తన గరళాన పట్టుంచి అందరికీ క్షేమాన్ని కలిగించి నీలకంఠునిగా ప్రసిద్ధి పొందాడు.
భువినుంచి ఉరకలెత్తే ఉత్సాహంతో తన్ను మించిన వారెవరూ లేరని విర్రవీగుతున్న గంగమ్మకు వెర్రెలెత్తించి తన జటాజూటం నుంచి బయల్వెడనీయక తానెవరో తెలుసుకొనేట్లుచేసి గంగకు అహంకార నాశనంచేసి గంగాధరుడయ్యాడు.
ముక్కంటి మూడోనేత్రం శాస్తవ్రిజ్ఞాన ప్రతీక. ఆ మూడోకన్ను తెరిస్తే ప్రళయమే. అదుపుతప్పి ఇంద్రియాలకు లోబడి విర్రవీగే మదోమన్మత్తులకు, ఉన్నత్తులకు తమోగుణులకు మూడోకన్నుతో కనిపించే రుద్రుడు అతి భయంకరుడు. త్రిపురాసురుల్లాంటి మహారాక్షసులను తుదముట్టించి త్రిపురాసురుడుగా కీర్తినొందాడు పరమశివుడు
అరుదైన మానవ జన్మనొంది జన్మసార్థక్యం కలగాలంటే చివరకు మిగిలే బూడిదను ధరించే విభూది ధారణుని తత్వం తెలుసుకోవాల్సిందే.

- ఎం.సి. శివశంకరశాస్ర్తీ