అక్షర

మారుతున్న మనిషి తనానికి మంచి కతల వెక్కిరింత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషి ‘కతలు’
(కథా సంకలనం)
-డా.దేవరాజు మహారాజు;
పుటలు: 84; వెల: రూ.60/-;
ప్రచురణకర్తలు: ‘జీవన ప్రచురణలు’; హైదరాబాద్, ఫోన్ నెం.8008807676; ప్రతులకు: అన్ని ప్రముఖ
పుస్తక విక్రయశాలలు

‘‘బుద్ధికి హృదయం లేక/ హృదయానికి బుద్ధేరాక/ నరుడే ఈ నరలోకం/ నరకం చేశాడు’’ అన్నాడు ఆచార్య ఆత్రేయ. ఈ నిష్ఠుర సత్యపు చురకకు లక్ష్యప్రాయంగా డా.దేవరాజు మహారాజు ఇటీవల కథా ప్రపంచంలో వెలిగించిన ఒక మంచి కథాసంపుటపు కాగడా ‘‘మనిషి కతలు’’. ఈ కథల కాగడాల సెగలు సామాజిక స్పృహ ఉన్న ప్రతి సగటు పాఠకునిలో మంచి మంచి ఆలోచనల ప్రతిస్పందనల వేడిని ‘రగిలిస్తాయి’. మనిషిని కవ్విస్తాయి. నవ్విస్తూ కొక్కిరిస్తాయి.
ఇందులో మొత్తం పందొమ్మిది కథానికలున్నాయి. కథానికలంటే అక్షరాలా కథానికలే. అంటే చాలా చాలా చిన్న కథలు. కానీ ప్రతి చిట్టికథ గోరంత దీపం- కొండంత వెలుగు అన్నట్టుగా ప్రతిభా భాస్వంతం.
మనిషిలోంచి మనిషి ఏనాడో తప్పిపోయాడు. అయినా ఇంకా మిగిలి ఉన్నాడు మరో మనిషి- మని (్యశళక) షీ (డ్హఉ) లకోసం - సున్నలోంచి సున్న తీసివేసినా సున్న మిగిలేట్టు.
‘జీవితంలో దేనినో అనే్వషిస్తూ, దేనికోసమో బతుకుతూనే ఉన్నాడు’ అనే ఒక గొప్ప భావగర్భిత వాక్యంతోనే ఇందులోని ప్రతి కథా సమాప్తమవుతుంది- సోప పత్తికంగా.
రచయిత సాగించిన కథా కథన శైలిలో ఒక వినూత్న విలక్షణ శిల్పం ఉంది.
ఆధునిక స్వార్థపూరిత, సంకుచిత, అల్పస్వభావ శీలుల జీవన విధానాల నుంచి తాను పిండుతున్న ‘నీతి’ సందేశ సారానికి ప్రతి కథా ఉపబలకంగా మంచి ఊతమిచ్చింది.
‘మిస్ వళ్‌డ్’ కథ చాలా బాగుంది. అందాల పోటీలో నిండుగా గుడ్డలు కట్టుకుని పెద్దమనిషి తరహాలో స్ర్తి సహజ సౌందర్య సౌభాగ్యాన్ని చూపినమ్మాయికి తృతీయ బహుమతి, అర్థనగ్నంగా ఉన్న అమ్మాయికి ద్వితీయ బహుమతి, పూర్తి నగ్నంగా ఉన్న అమ్మాయికి ప్రథమ స్థానం ప్రకటిస్తారు న్యాయ నిర్ణేతలు. ‘‘స్వచ్ఛత్వం, నిజాయితీలకు నా నగ్నత్వం ప్రతీక. నాలోని నిబ్బరానికీ, నిర్భయానికీ ఈ గౌరవం లభించింది అంటుంది ఆ ప్రథమ బహుమతి పొందిన అంగన. అది విని ‘మనిషి’ ఆలోచనలో పడ్డాడు’’.- ఇలా ముగుస్తుంది ఆ కథ.
‘నిరంతర సాధన’ కథ సభాప్రసంగాల కండూతి మీద, కీర్తి కక్కుర్తిమీద కమనీయ హాస్య కథ.
అచ్చమైన కవి పడే అగచాట్లు, పోజుల ‘కవిరాజు’లు దొరకబుచ్చుకునే అవకాశాలు, ‘ఆనర్లు’బాగా చిత్రీకరించాడు కథకుడు ‘ఎండని చేప’కథలో. కథ పండింది.
విత్తం లభిస్తోంది అంటే మనిషి ‘ఉత్తమ వ్యక్తి’- ‘మహానీచుడు’- ‘గొప్ప జోకర్’అనే మూడు రకాల బిరుద ప్రదానాలలో దేనికైనా సిద్ధపడతాడు అని చెప్పే ‘బిరుదులున్నాయి జాగ్రత్త’ కథ నేటి సమాజంలోని చాలామంది మీద ఒక నీటైన సెటైర్.
నేటి యాంత్రిక జీవితంలో వెలితి పడిపోతున్న మనస్సు అనే ఒక ఉదాత్త వస్తువుమీద అల్లిన అందమైన కథ ‘శుభోదయం.’
‘‘డబ్బు తగలేద్దామని బార్లోకెళ్ళి ‘గుర్ర’మెక్కాడు. రేసుకోర్సులో తేలాడు. డబ్బు కాసిన గుర్రాలన్నీ డబ్బులై సకిలించాయి’’ (‘కింగ్ మేకర్’ కథలో) అనటంలోని అభివ్యక్తి, వ్యంగ్య వైభవం;
‘‘మనిషి పుట్టగానే పరిమళిస్తాడు. ఆ పరిమళం పక్కవాడిది తస్కరించాడు అన్న విషయం తరువాత తెలుస్తుంది (‘కిస్సా కాపీకా’ కథ) అన్న భావ గంభీర వాక్యాలు;
మనిషిని చూచి వెటకారంగా నవ్వే పరిస్థితేనా పూర్తిగా ఉన్నది నేడు? సమాజంలో మైలురాళ్ళలాగా ‘మంచులు’ జరగటం లేదా? ఆశా దీపాల్లాగా ఆదర్శమనస్కులు లేరా? ఆ కోణంలో కూడా- కతలే కాదు- సుతిమెత్తని మనసుల వెతలు, ఆరాటాలు, జీవన పోరాటాలు కూడా ఈ సంపుటిలో కొన్నిటిని కూరిస్తే బాగుండేదేమో చెయి తిరిగిన ఈ రచయిత!

- శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం