కడప

మంజూనాథ్ కమిటీని అడ్డుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, మార్చి 6: కాపులను బిసిల్లో చేర్చేందుకు ఏర్పాటైన మంజునాధ కమిటీని బిసిలంతా ఐక్యమత్యంతో అడ్డుకుంటామని బిసి మేధావుల సదస్సు స్పష్టం చేసింది. బిసిల జనాభా ప్రాతిపదికపై రిజర్వేషన్లు కల్పించి అనంతరమే కాపుల స్థితిగతులపై సర్వే నిర్వహించాలని, బిసిలు కోరేది భిక్షకాదని రాజ్యాంగపరమైన హక్కులేనని బిసి కులాల మేధావుల నేతలు పేర్కొన్నారు. ఆదివారం జిల్లా పరిషత్ సభాభవన్‌లో బిసి మేధావుల సదస్సు బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు చిదానంద, మేధావుల ఐక్యవేదిక కన్వీనర్ సుబ్బాచారిల అధ్యక్షతన జరిగింది. ఈసమావేశంలో యాదవ సంఘం రాష్ట్ర, కార్యదర్శులు గంగయ్యయాదవ్, సగిలి సుబ్బరాయుడు, బంగారు వెంకటరమణ యాదవ్‌లు మాట్లాడుతూ తరతరాలుగా తమ సామాజికవర్గీయులు రోడ్లపక్కన, అడవుల్లో గొర్రెల కాపరులుగానే మిగిలిపోయారని, ఆది నుంచి తమ జీవితాలు వర్ణణాతీతమని అన్నారు. కాపులకు తీసుకొచ్చి బిసిల జాబితాలో చేర్చితే తమకు ఆత్మహత్యలే మిగులుతాయని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నూర్‌బాష సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సుభాని, జిల్లా అధ్యక్షుడు రాజేష్ మాట్లాడుతూ తాము సంచార జాతుల మాదిరిగానే ఊరూరా తిరిగి చిన్నచిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని అన్నారు. వడ్డెర సంఘ జాతీయ , రాష్ట్ర నేతలు నంద్యాల సుబ్బరాయుడు, బత్తల జానకీరామ్‌లు మాట్లాడుతూ నేటికీ తమ కులస్తులకు ఒంటిమీద బట్టలేదని, కొండలు, గుట్టలే తమకు స్థిర నివాసాలని అన్నారు. ఈ పరిస్థితుల్లో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, ఉద్యోగపరంగా అగ్రస్థాయిలో ఉన్న కాపులను బిసిల్లో చేర్చడం ప్రభుత్వ అవివేకానికి నిదర్శనమన్నారు. బిసిలంటే తెలుగుదేశం పార్టీ అని భావించిన వారికి ఇక తిరుగుబాటే శరణ్యమని ఘాటుగా హెచ్చరించారు. నారుూ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, జిల్లా కార్యదర్శి పి.గురుస్వామి, కొల్లం ఉమాపతి మాట్లాడుతూ తాము కులవృత్తులపై ఆధారపడి జీవిస్తూ నేటికి ఇల్లిళ్లు తిరిగి అడుక్కునే స్థితిలో దుర్భర జీవితాన్ని గడుపుతున్నామని, కాపులను బిసిల్లో చేర్చితే ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. శాలివాహన సంఘం రాష్టన్రేత జికె మునెయ్య మాట్లాడుతూ తాము మట్టిని పిండి చేసి గృహోపకరాల తయారుచేసి తమ కులవృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నామని, కాపులను బిసిల్లో చేరిస్తే తమ జీవనప్రమాణాలు దెబ్బతింటాయని అన్నారు. తమకు న్యాయంచేసిన తర్వాతనే కాపుల గురించి మాట్లాడాలని ఆయన పేర్కొన్నారు. ముదిరాజ్ సంఘం రాష్టన్రేత నరసింహులు ప్రసంగిస్తూ ముదిరాజ్ , ముత్తరాసు, వాల్మీకి తెగలకు చెందిన తాము అనాగరిక జీవనంలో ఉన్నామని, తమను ఎస్టీల్లో చేర్చాలని గోడువిన్పిస్తుంటే గాలికి వదిలి కాపులను బిసిల్లో చేర్చడం ఎంతవరకు సమంజసమని ధ్వజమెత్తారు. వివిధ కులసంఘాల నేతలు అడహక్ కమిటీ అధ్యక్షుడు వెంకటేసు పాల్గొన్నారు.