రాష్ట్రీయం

మావోల విధ్వంసకాండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, నవంబర్ 23: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు సోమవారం ఒక బస్సును తగులబెట్టారు. కటేకల్యాణ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ సేవా కేంద్రం వద్ద కటేకల్యాణ్ నుంచి దంతెవాడ వెళ్తున్న బస్సును 40 మంది సాయుధ మావోయిస్టులు అటకాయించారు. బస్సులోని ప్రయాణికులను కిందికి దించారు. ప్రయాణికులు, బస్సు సిబ్బంది వద్ద ఉన్న మొబైల్ ఫోన్లను లాక్కున్నారు. సమీపంలో వాల్‌పోస్టర్లు అంటించి, కరపత్రాలను విడిచి బస్సుకు నిప్పంటించి వెళ్లిపోయారు. ఆపరేషన్ గ్రీన్‌హంట్‌ను నిలిపివేయాలని, మావోయిస్టుల పట్టివేతకని వైమానిక దాడులను నిర్వహించవద్దని, ద్రోన్ కెమెరాలను వినియోగించవద్దని, ఈ నెల 25న దండకారణ్యం బంద్‌ను విజయవంతం చేయాలనే నినాదాలతో కూడిన వాల్‌పోస్టర్లు విడుదల చేశారు. ఇదిలావుంటే, బస్తర్ ప్రాంతంలోని సుక్మా జిల్లా కంకేర్‌లంక అటవీ ప్రాంతంలో శక్తిమంతమైన మూడు మందుపాతరలను భద్రతా బలగాలు వెలికితీశాయి. ఇవి ఒక్కోటి 10 కిలోల బరువు ఉన్నాయి. 223 సిఆర్‌పిఎఫ్ బెటాలియన్‌కు చెందిన జవాన్లు కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఇవి లభ్యమయ్యాయి. కాగా, ఒడిషా రాష్ట్రంలోని మల్కన్‌గిరి జిల్లా కలిమెల పోలీస్ స్టేషన్ పరిధిలోని కుర్బు గ్రామంలో నలుగురు మిలీషియా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే ప్రాంతంలో వెజంగివాడ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఎస్వోజీ, డీవీఎఫ్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా 825 జిలెటిన్ స్టిక్స్ లభించాయి. ఒక్కోటి 125 గ్రాముల బరువున్నట్లు మల్కన్‌గిరి జిల్లా ఎస్పీ వెల్లడించారు. బస్తర్ దండకారణ్యంలోని అబూజ్‌మడ్ ప్రాంతంలోని ముగ్గురు కీలక నక్సలైట్లు లొంగిపోయినట్లు దంతెవాడ ఎస్పీ కమలోచన్ కశ్యప్ వెల్లడించారు.

ఇద్దరు మావోయిస్టులు లొంగుబాటు
విశాఖపట్నం, నవంబర్ 23: విశాఖ ఏజెన్సీలోని గాలికొండ, కోరుకొండ మావోయిస్టు దళాలకు చెందిన ఇద్దరు సభ్యులు, పది మంది మిలీషియా సభ్యులు లొంగిపోయినట్టు జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ చెప్పారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వంతల రమేష్ అలియాస్ బాలరేవుల రమేష్ అలియాస్ డుంబ్రి అలియాస్ రంగారావు, అలియాస్ దివాకర్ జిల్లాలోని కొయ్యూరు మండలం బాలరేవుల గ్రామానికి చెందిన వాడని చెప్పారు. ఈయన 2008 నుంచి గాలికొండ దళం అన్నవరం మిలీషియా ప్రాంతానికి అధ్యక్షునిగా, దళ సభ్యునిగా కొనసాగుతున్నాడని చెప్పారు. అలాగే శీండ్రి సీత అలియాస్ లలిత అలియాస్ రమణ పెదబయలు మండలం పిట్టల బొర్ర గ్రామానికి చెందినదని తెలిపారు. ఈమె కోరుకొండ దళ సభ్యురాలుగాను, జెఎన్‌ఎం సభ్యురాలిగాను కొనసాగుతుందని చెప్పారు. వీరిద్దరికి ఒకొక్కరిపై లక్ష రూపాయల రివార్డు ఉందన్నారు. లొంగిపోయిన మిలీషియా సభ్యుల్లో ఒకొక్కరిపై రూ.10వేలు రివార్డు ఉందని ఎస్పీ తెలిపారు.