హైదరాబాద్

ఇదిగో మ్యాప్ అదిగో మరమ్మతు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త పద్ధతులతో రోడ్ల పనులు
అందుబాటులోకి జియోమ్యాపింగ్ విధానం
రెండురోజుల్లో ప్రత్యేక యాప్ సిద్ధం

హైదరాబాద్, డిసెంబర్ 8: జంటనగర వాసులకు ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో పలు పౌరసేవలను అందుబాటులోకి తెచ్చిన మహానగర పాలక సంస్థ ఇపుడు రోడ్ల మరమ్మతులకు సైతం ఆధునిక విధానాలను అవలంబిస్తోంది. ఇదివరకు కమిషనర్‌గా వ్యవహరించిన సోమేశ్‌కుమార్ రోడ్ల మరమ్మతుల కోసం ఇన్‌స్టెంట్ రోడ్డు రిపేర్ టీంలను అందుబాటులోకి తేగా, కొత్త కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి జియోమ్యాపింగ్ ఆధునిక పద్ధతిలో రోడ్ల మరమ్మతులకు శ్రీకారం చుట్టారు. ఎక్కడైనా రోడ్డు గుంతలమయంగా తయారైనా, ప్రజలు, సిబ్బంది నుంచి వచ్చిన ఫిర్యాదును ఆధారం చేసుకుని సంబంధిత ఏరియా ఇంజనీర్‌కు జియో మ్యాపింగ్ ద్వారా ఫొటోలను పంపి, వెంటనే మరమ్మతులు జరిగేలా సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఇందుకు సంబంధించి నగర ప్రజలు ఎప్పటికపుడు ఫిర్యాదులు అందించేందుకు, ఇచ్చిన ఫిర్యాదు పరిష్కార పురోగతిని తెల్సుకునేందుకు ప్రత్యేక యాప్‌ను రూపకల్పన చేస్తున్నారు. ఇది మరో రెండురోజుల్లో అందుబాటులోకి తేనున్నట్లు కమిషనర్ జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించి కమిషనర్ మంగళవారం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెస్ ప్రతినిధులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రస్తుతం నగరంలో ప్రధాన రోడ్లను బీటీ కార్పొరేటింగ్ చేసే పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, ఈ పనులను జనవరి నెలాఖరు కల్లా ముగించాలని డెడ్‌లైన్ విధించినట్లు ఆయన తెలిపారు. రోడ్లకు మరమ్మతులు చేపట్టిన తర్వాత, చేపట్టినట్టు ఫిర్యాదుదారుడికి అర్థమయ్యేలా ఫొటోలను కూడా పంపించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. అంతేగాక, క్షేత్ర స్థాయిలో పారిశుద్ధ్య పనులు నిర్వర్తించే సిబ్బంది, పనులను పర్యవేక్షించే శానిటరీ ఫీల్డు అసిస్టెంట్లు సైతం రోడ్లపై ఏర్పడిన గుంతల సమాచారాన్ని అధికారులకు అందజేస్తున్నారు.
ఈ రకంగా గుర్తించిన గుంతలకు మరమ్మతులు చేసేందుకు వెళ్లే సిబ్బంది పనిలో పనిగా, అక్కడి స్థానికులను కల్సుకుని, మరిన్ని ఫిర్యాదులను స్వీకరించి మరమ్మతులు చేపడుతున్నారు.
1800 కి.మీ.ల రోడ్డు రీ కార్పెటింగ్
ఇప్పటి వరకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 1800 కి.మీ.ల పొడువున్న బిటి రోడ్ల రీ కార్పెటింగ్ పనులు పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు.
ఇందుకు గాను మొత్తం రూ. 337 కోట్లతో చేపట్టిన పనుల పూర్తయినట్లు తెలిపారు. నగరంలో వంద శాతం గుంతల పూడ్చివేతకు జిహెచ్‌ఎంసి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా నగరంలో ఏ ఏ రోడ్డులో ఎన్ని గుంతలున్నాయో తెల్సుకుని తక్షణ మరమ్మతులు చేపట్టే ప్రక్రియ వేగవంతం అయిందని వివరించారు. ఇప్పటి వరకు ఇంజనీరింగ్ విభాగం 6795 గుంతలను గుర్తించగా, శానిటరీ ఫీల్డు అసిస్టెంట్లు 4382 గుంతలు గుర్తించటంతో మొత్తం 11వేల 177 గుంతలకు మరమ్మతులు చేపట్టే పనులను ప్రారంభించిన అధికారులు ఇప్పటి వరకు 8300 గుంతలను పూడ్చినట్లు తెలిపారు. ఇందుకు గాను ఇన్‌స్టెంట్ రోడ్డు రీపేర్ బృందాలు, రోడ్ డాక్టర్ వాహనాలను వినియోగించనున్నట్లు, మిగిలిన మరో 2850 గుంతలను కూడా త్వరగా పూడ్చాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.