బిజినెస్

రెండు వారాల కనిష్టానికి సెన్సెక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

248 పాయింట్లు పతనం * 7,800 దిగువకు నిఫ్టీ
ముంబయి, డిసెంబర్ 4: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెన్సెక్స్ 248.11 పాయింట్లు కోల్పోయి రెండు వారాల కనిష్టానికి దిగజారుతూ 25,638.11 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 7,800 స్థాయికి దిగువన 82.25 పాయింట్లు పడిపోయి 7,781.90 వద్ద నిలిచింది.
ఈ వారం మొత్తంగా సెనె్సక్స్ 490.09 పాయింట్లు, నిఫ్టీ 160.80 పాయింట్లు పతనమయ్యాయి. అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లు, ఐరోపా మార్కె ట్లు నష్టపోయాయి. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ఉద్దీపన నిర్ణయంపై మదుపరులు అసంతృప్తికి గురై పెట్టుబడుల ఉపసంహరణ వైపు నడిచారు. ఇకపోతే శుక్రవారం ట్రేడింగ్‌లో పవర్, రియల్టీ, ఎఫ్‌ఎమ్‌సిజి, ఆటో, బ్యాంకింగ్ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.