బిజినెస్

సెన్సెక్స్ కు ఐటిసి సెగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

108 పాయింట్లు పతనం
వరుసగా నాలుగోరోజూ నష్టాలకే పరిమితం
పొగాకు ఉత్పత్తులపై జిఎస్‌టి కమిటీ ప్రతిపాదనలతో దెబ్బ
6.5 శాతం దిగజారిన ఐటిసి షేర్ విలువ

ముంబయి, డిసెంబర్ 7: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు లాభాలను అందుకున్నప్పటికీ ఆ ప్రభావం దేశీయ సూచీలపై అంతగా పడలేకపోయింది. దీంతో వరుసగా నాలుగు రోజులపాటు భారతీయ స్టాక్ మార్కెట్లు నష్టాలపాలైనట్లైంది.
పొగాకు ఉత్పత్తులపై అధిక పన్నుల సిఫార్సుపై నెలకొన్న ఆందోళనలతో బహుళ వ్యాపార దిగ్గజం ఐటిసి షేర్ విలువ 6.5 శాతం దిగజారింది. ఇది బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ నష్టాలను పెంచింది. సెనె్సక్స్ 108 పాయింట్లు కోల్పోయి 25,530.11 వద్ద నిలిచింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 16.50 పాయింట్లు పడిపోయి 7,765.40 వద్ద స్థిరపడింది. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)పై ఏర్పాటైన కమిటీ.. పాన్ మసాలా, పొగాకు, పొగాకు సంబంధిత ఉత్పత్తులపై పన్నును దాదాపు 40 శాతం పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఇది ఐటిసి షేర్లను అమ్మకాల ఒత్తిడికి గురి చేయగా, సెనె్సక్స్ నష్టాల్లో అత్యధిక శాతం దీని ఫలితమే. కాగా, ఆయా రంగాల వారీగా ఎఫ్‌ఎమ్‌సిజి, విద్యుత్, మెటల్, చమురు, గ్యాస్, ఆటో రంగాల షేర్ల విలువ 2.45 శాతం నుంచి 0.20 శాతం వరకు క్షీణించింది. హెల్త్‌కేర్ షేర్ల విలువ మాత్రం 0.77 శాతం పెరిగింది. అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో చైనా, జపాన్, సింగపూర్, తైవాన్ సూచీలు 0.34 శాతం నుంచి 0.99 శాతం వరకు ఎగబాకితే, హాంకాంగ్, దక్షిణ కొరియా సూచీలు మాత్రం 0.15 శాతం, 0.54 శాతం చొప్పున నష్టపోయాయి. ఐరోపా మార్కెట్లలో ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సూచీలు 0.61 శాతం నుంచి 1.77 శాతం మేర పుంజుకున్నాయి.