బిజినెస్

స్టాక్ మార్కెట్లపై కానరాని ‘ఫెడ్’ ప్రభావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెన్‌సెక్స్ 309, నిఫ్టీ 93 పాయింట్లు వృద్ధి

ముంబయి, డిసెంబర్ 17: అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్ల పెంపును పట్టించుకోకుండా దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాల్లో పరుగులు పెట్టాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెన్‌సెక్స్ 309.41 పాయింట్లు లాభపడి 25,803.78 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 93.45 పాయింట్లు ఎగిసి 7,800 మార్కును అధిగమించి, 7,844.35 వద్ద స్థిరపడింది.
డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 23 పైసలు పెరిగి 66.50 వద్దకు చేరడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచింది. బుధవారం రాత్రి ఫెడ్ రిజర్వ్ సుధీర్ఘకాలం అనంతరం వడ్డీరేటును 0.25 శాతం పెంచింది. 2006 తర్వాత పెంచడం మళ్లీ ఇదే. ఈ క్రమంలో దేశీయ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతాయనుకున్నప్పటికీ లాభాల్లో పయనించడం ఒకింత ఆశ్చర్యానికే గురిచేస్తోంది.
ఇక ఆయా రంగాలవారీగా మెటల్, విద్యుత్, హెల్త్‌కేర్, ఆటో రంగాల షేర్ల విలువ 2.46 శాతం నుంచి 1.33 శాతం పెరిగింది. స్మాల్-క్యాప్ 1.72 శాతం, మిడ్-క్యాప్ 1.56 శాతం చొప్పున పుంజుకున్నాయి.