బిజినెస్

మార్కెట్లకు స్వల్ప నష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మకాల ఒత్తిడే కారణం * సెనె్సక్స్ 11 పాయంట్లు పతనం

ముంబయి, డిసెంబర్ 24: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఆటుపోట్ల మధ్య స్వల్ప నష్టాలతోముగిసాయి. మొదట్లో లాభాల బాటలో సాగిన మార్కెట్లు ఆ తర్వాత దేశీయ బ్యాంకింగ్ రంగంలో రుణ వితరణ తీరు, మొండిబకాయిలు పెరిగిపోవడం పట్ల రిజర్వ్ బ్యాంక్ నివేదిక ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో బ్యాంకింగ్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురికావడంతో నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. ఒక దశలో మూడు వారాల గరిష్ఠస్థాయికి చేరిన బిఎస్‌ఇ సెనె్సక్స్ ఆ తర్వాత నష్టాల్లోకి జారుకుని చివరికి 11.59 పాయింట్ల నష్టంతో 25,838.71 పాయింట్ల వద్ద ముగిసింది. గత వారంతో పోలిస్తే ఈ వారం సెనె్సక్స్ మొత్తంమీద 319.49 పాయింట్లు లాభపడింది.
ఆసియా మార్కెట్ల సానుకూల సంకేతాలతో సెనె్సక్స్ ప్రారంభ లావాదేవీలలో 25,922.47 పాయింట్ల గరిష్ఠస్థాయిని తాకింది. అయితే శుక్రవారం సెలవు కావడంతో మదుపరులు అమ్మకాలకు దిగడంతో సెనె్సక్స్ నెగెటివ్ జోన్‌లోకి జారుకుని చివరికి 11.59 పాయింట్ల నష్టంతో ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం 4.90 పాయింట్లు నష్టపోయి 7,861.05 పాయింట్ల వద్ద ముగిసింది. ఐసిఐసిఐ బ్యాంక్ షేరు గరిష్ఠంగా 1.53 శాతం పడిపోగా, మారుతి సుజుకి, ఒఎన్‌జిసి, ఎస్‌బిఐ, హెచ్‌డిఎఫ్‌సి, డాక్టర్ రెడ్డీస్, యాక్సిస్ బ్యాంక్, రిల్, ఇన్ఫోసిస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హెచ్‌యుఎల్, లుపిన్, టాటా స్టీల్ నష్టపోయిన వాటిలో ఉన్నాయి. అయితే భారతీ ఎయిర్‌టెల్, గెయిల్, టాటా మోటార్స్, బజాజ్ ఆటో, టిసిఎస్, ఐటిసి, అదానీ పోర్ట్స్ షేర్లు లాభాల్లో ముగిసాయి. సెనె్సక్స్‌లోని 30 కంపెనీల్లో 13 కంపెనీల షేర్లు నష్టపోగా, ఎన్‌టిపిసి మార్పులేకుండా నిలిచింది. అంతర్జాతీయంగా చూస్తే ఆసియా మార్కెట్లలో మిశ్రమ ధోరణి కదిపించగా, ఐరోపా మార్కెట్లు ప్రారంభంలో లాభాల్లో సాగాయి. కాగా, వి-మార్ట్ రిటైల్ కంపెనీలో 49 శాతం వాటాను విదేశీ సంస్థాగత ఇనె్వస్టర్లు కొనుగోలు చేయడానికి ఆర్‌బిఐ అనుమతించడంతో గురువారం అటు బిఎస్‌ఇ, ఇటు ఎన్‌ఎస్‌ఇలో ఆ కంపెనీ షేరు దాదాపు 20 శాతం పెరిగింది. అలాగే బయోకాన్ షేరు సైతం 5 శాతానికి పైగా పెరిగింది. క్రిస్మస్ కారణంగా శుక్రవారం మార్కెట్లకు సెలవు.