బిజినెస్

పెట్టుబడుల ఉత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మళ్లీ 26వేల స్థాయికి సెన్‌సెక్స్
వరుసగా మూడో వారం లాభాల్లో సూచీలు
వారాంతపు సమీక్ష
ముంబయి, జనవరి 2: దేశీయ స్టాక్ మార్కెట్లు గడచిన వారం లాభాల్లో ముగిశాయి. దీంతో వరుసగా మూడో వారం లాభాలను అందుకున్నట్లైంది. ఫలితంగా అంతకుముందు నష్టాలతో కోల్పోయిన స్థానాలను సూచీలు తిరిగి చేరుకోగలిగాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెన్‌సెక్స్ 26వేల స్థాయిని తాకగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 7,900 స్థాయిని అధిగమించింది. మొండి బకాయిలను ఈ ఏడాది తగ్గించుకోవడంపై బ్యాంకులు దృష్టి పెట్టాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గడువు నిర్దేశించడంతోపాటు వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)ను అమలు చేసి వ్యాపార నిర్వహణను మరింత సులభతరం చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ నూతన సంవత్సరం సందర్భంగా ఇచ్చిన హామీ మార్కెట్ సెంటిమెంట్‌ను పెంచాయి. అలాగే హేతుబద్ధీకరిస్తున్న ప్రత్యక్ష పన్నులు.. మదుపరులలో విశ్వాసాన్ని నింపాయి. ఈ క్రమంలోనే సెన్‌సెక్స్ 322.19 పాయింట్లు పుంజుకుని 26,160.90 వద్ద ముగియగా, నిఫ్టీ 102.15 పాయింట్లు పెరిగి 7,963.20 వద్ద స్థిరపడింది. ఇక గడచిన మూడు వారాల్లో సెన్‌సెక్స్ 1,116.47 పాయింట్లు, నిఫ్టీ 352.75 పాయింట్లు వృద్ధి చెందాయి. రియల్టీ, పవర్, ఆటో, పిఎస్‌యు, చమురు, గ్యాస్, హెల్త్‌కేర్, బ్యాంకింగ్ రంగాల షేర్ల విలువ 2.92 శాతం నుంచి 1.26 శాతం పెరిగింది. రిటైల్ మదుపరుల నుంచి కొనుగోళ్లు చెప్పుకోదగ్గ స్థాయిలో జరగడంతో స్మాల్-క్యాప్ 1.79 శాతం, మిడ్-క్యాప్ 2.06 శాతం చొప్పున పెరిగాయి. టర్నోవర్ విషయానికొస్తే గడచిన వారం బిఎస్‌ఇ 13,281.81 కోట్ల రూపాయలుగా, ఎన్‌ఎస్‌ఇ 75,637.11 కోట్ల రూపాయలుగా ఉంది. అంతకుముందు వారం బిఎస్‌ఇ టర్నోవర్ 10,972.22 కోట్ల రూపాయలుగా, ఎన్‌ఎస్‌ఇ టర్నోవర్ 55,905.22 కోట్ల రూపాయలుగా ఉంది. గడచిన వారం విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్‌పిఐ) 1,967.01 కోట్ల రూపాయల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. ఈ మేరకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.