బిజినెస్

కీలక సంస్కరణలపై విశ్వాసంతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుసగా రెండో వారం లాభాల్లో స్టాక్ మార్కెట్లు
పెట్టుబడుల దిశగా విదేశీ మదుపరులు
వారాంతపు సమీక్ష
=================
ముంబయి, డిసెంబర్ 26: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో వారం లాభాల్లో ముగిశాయి. కీలక సంస్కరణలపై విశ్వాసంతో మదుపరులు పెట్టుబడుల దిశగా నడిచారు. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 319.49 పాయింట్లు పుంజుకుని 25,838.71 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 99.10 పాయింట్లు అందుకుని 7,861.05 వద్ద స్థిరపడింది. అంతకుముందు వారం కూడా సెనె్సక్స్, నిఫ్టీలు లాభాల్లో కదలాడగా, ఈ రెండు వారాల్లో సెనె్సక్స్ 794.28 పాయింట్లు, నిఫ్టీ 250.60 పాయింట్లు కోలుకున్నాయి. స్మాల్-క్యాప్ 1.72 శాతం, మిడ్-క్యాప్ 0.91 శాతం పెరిగాయి. పార్లమెంట్‌లో కీలక బిల్లులు ఆమోదం పొందుతాయన్న ఆశతో మదుపరులు పెట్టుబడులకు ఆసక్తి కనబరిచారని హెమ్ సెక్యూరిటీస్ డైరెక్టర్ గౌరవ్ జైన్ అన్నారు. ఇక విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్‌పిఐ) గడచిన వారం 788.63 కోట్ల రూపాయల పెట్టుబడులను తెచ్చారు. మెటల్, పవర్, చమురు, గ్యాస్ రంగాల షేర్ల విలువ 3.10 శాతం నుంచి 2.57 శాతం మేర పెరిగింది. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ షేర్ల విలువ 1.01 శాతం తగ్గింది. టర్నోవర్ విషయానికొస్తే గడచిన వారం బిఎస్‌ఇ 10,972.22 కోట్ల రూపాయలుగా ఉంటే, ఎన్‌ఎస్‌ఇ 14,007.51 కోట్ల రూపాయలుగా ఉంది. అంతకుముందు వారం బిఎస్‌ఇ టర్నోవర్ 55,905.22 కోట్ల రూపాయలుగా ఉండగా, ఎన్‌ఎస్‌ఇ టర్నోవర్ 77,988.20 కోట్ల రూపాయలుగా ఉంది.