బిజినెస్

ఆటుపోట్ల మధ్య అరకొర లాభాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెనె్సక్స్ 72, నిఫ్టీ 25 పాయింట్లు వృద్ధి

వారాంతపు సమీక్ష

ముంబయి, మార్చి 12: దేశీయ స్టాక్ మార్కెట్లు గడచిన వారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. అంతకుముందు వారం భారీ లాభాలు నమోదైన నేపథ్యంలో గడచిన వారం సూచీలు ఆటుపోట్లకు గురయ్యాయి. అయినప్పటికీ వరుసగా రెండో వారం లాభాలను అందుకుంటూ బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 71.51 పాయింట్లు పెరిగి 24,717.99 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 24.85 పాయింట్లు అందుకుని 7,510.20 వద్ద నిలిచింది. కాగా, గడచిన రెండు వారాల్లో సెనె్సక్స్ 1,563.69 పాయింట్లు, నిఫ్టీ 480.45 పాయింట్లు పుంజుకున్నాయి. ఇకపోతే వచ్చే ఆర్థిక సంవత్సరం (2016-17)లో ద్రవ్యలోటును 3.5 శాతానికి కట్టడి చేస్తామని బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) కీలక వడ్డీరేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు మదుపరులను కొనుగోళ్ళ వైపు నడిపించాయి. ఆటో, రియల్టీ, హెల్త్‌కేర్, రిఫైనరీ, మెటల్ రంగాల షేర్లు మదుపరులను ఆకట్టుకున్నాయి. సోమవారం శివరాత్రి సందర్భంగా మార్కెట్లు మూతపడగా, మంగళవారం సెనె్సక్స్ స్వల్ప లాభంతో, నిఫ్టీ యథాతథంగా ముగిసింది. బుధ, శుక్రవారాలు ఫర్వాలేదనిపించగా, గురువారం నష్టాల పాలయ్యాయి. ఇకపోతే బిఎస్‌ఇ మిడ్-క్యాప్ 45.86 పాయింట్లు పెరిగితే, స్మాల్-క్యాప్ 7.76 పాయింట్లు పడిపోయింది. ఆటో, రియల్టీ, హెల్త్‌కేర్, చమురు, గ్యాస్, ఎఫ్‌ఎమ్‌సిజి, మెటల్ రంగాల షేర్ల విలువలు 1.55 శాతం నుంచి 0.56 శాతం పెరిగాయి. అయితే ఐటి, బ్యాంకింగ్, టెక్నాలజీ, పవర్, కన్జ్యూమర్ డ్యూరబుల్, క్యాపిటల్ గూడ్స్ రంగాల షేర్ల విలువలు 1.36 శాతం నుంచి 0.15 శాతం తగ్గాయి. విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్‌పిఐ) 3,227.81 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులను తెచ్చారు. ఈ మేరకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ తెలిపింది. టర్నోవర్ విషయానికొస్తే గడచిన వారం బిఎస్‌ఇ 12,518.02 కోట్ల రూపాయలుగా ఉంటే, ఎన్‌ఎస్‌ఇ 68,942.97 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. అంతకుముందు వారం బిఎస్‌ఇ టర్నోవర్ 18,854.23 కోట్ల రూపాయలుగా, ఎన్‌ఎస్‌ఇ 1,01,906.30 కోట్ల రూపాయలుగా ఉంది.