క్రీడాభూమి

మార్టిన్ క్రోకు అభిమానుల ఘన నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆక్లాండ్, మార్చి 11: క్యాన్సర్‌తో ఇటీవల మరణించిన న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, ప్రపంచ క్రికెట్ దిగ్గజాల్లో ఒకరైన మార్టిన్ క్రోకు శుక్రవారం పలువురు ప్రముఖులు కన్నీటి వీడ్కోలు పలికారు. ఆయన అంత్యక్రియల సందర్భంగా ఆక్లాండ్‌లోని హోలీ ట్రినిటీ కేథడ్రెల్‌లో జరిగిన ప్రత్యేక సంతాప కార్యక్రమానికి దాదాపు వెయ్యి మంది హాజరై మార్టిన్ క్రోతో తమకున్న అనుబంధాలను గుర్తు చేసుకున్నారు. ప్రపంచం నలుమూలలనుంచి కుప్పలుగా వచ్చిపడుతున్న సంతాప సందేశాలతో తమ కుటుంబం చలించి పోయిందని మార్టిన్ క్రో సోదరుడు, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ అయిన జెఫ్ క్రో చెప్పాడు. మార్టిన్ చనిపోయినప్పుడు తాను అంపైరింగ్ డ్యూటీలో బంగ్లాదేశ్‌లో ఉన్నానని చెప్పిన ఆయన భారత జట్టులోని యువ ఆటగాళ్లతో పాటుగా క్రికెట్‌తో సంబంధం ఉన్న ఎంతో మంది హృదయపూర్వకంగా మార్టిన్‌కు నివాళులర్పించారని చెప్పాడు. తాను బౌల్ చేసిన అందరిలోకి మార్టిన్ గొప్ప బ్యాట్స్‌మన్ అని వాసిమ్ అక్రమ్ తనతో అన్నాడని, అంతకన్నా గొప్ప ప్రశంస మరోటి ఉండదని కూడా జెఫ్ చెప్పాడు. మార్టిన్ మాజీ సహచరులు పలువురు ఆయనతో తమ జ్ఞాపకాలను ఈ సందర్భంగా పాలు పంచుకున్నారు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అలెన్ బోర్డర్ నుంచి వచ్చిన సందేశాన్ని న్యూజిలాండ్ మాజీ వికెట్ కీపర్ ఇయాన్ స్మిత్ చదివి వినిపించారు. క్రికెట్ ఒక గొప్ప ఆటగాడిని కోల్పోయిందని, తాము ఆయనను ఎప్పటికీ మరిచిపోలేమని బోర్డర్ ఆ సందేశంలో పేర్కొన్నారు. మార్టిన్ క్రో సన్నిహిత బంధువు హాలీవుడ్ స్టార్ రస్సెల్ క్రో కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు.
(చిత్రం) మార్టిన్ క్రోకు అంతిమ వీడ్కోలు పలుకుతున్న హాలీవుడ్ నటుడు రసెల్ క్రో, ఇతర బంధు మిత్రులు