క్రీడాభూమి

చేజారిన రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కైస్ట్‌చర్చి, డిసెంబర్ 28: మార్టిన్ గుప్టిల్ 17 బంతుల్లో అర్ధ శతకాన్ని సాధించాడు. న్యూజిలాండ్ తరఫున అత్యంత వేగంగా యాభై పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా బ్రెండన్ మెక్‌కలమ్ (వరల్డ్ కప్ చాంపియన్‌షిప్‌లో ఇంగ్లాండ్‌పై 18 బంతుల్లో హాఫ్ సెంచరీ) నెలకొల్పిన రికార్డును గుప్టిల్ అధిగమించాడు. మరో ఇద్దరు బ్యాట్స్‌మెన్ సనత్ జయసూర్య (పాకిస్తాన్‌పై సింగపూర్‌లో/ 1996), కుశాల్ పెరెరా (పాకిస్తాన్‌పై పల్లేకర్‌లో/ 2015) ఇప్పటికే 17 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించగా వారి సరనస స్థానం సంపాదించాడు. ఎబి డివిలియర్స్ ఇదే ఏడాది జనవరిలో వెస్టిండీస్‌తో జొహానె్నస్‌బర్గ్‌లో జరిగిన మ్యాచ్‌లో 16 బంతుల్లోనే అర్ధ శతకం సాధించి రికార్డును నమోదు చేశాడు. కులశేఖర రెండుమూడు యార్కర్లతో గుప్టిల్‌ను ఇబ్బంది పెట్టాడు. లేకపోతే, అతను డివిలియర్స్ రికార్డును బద్దలు చేసి ఉండేవాడు.
36 ఓవర్లే: మొత్తం వంద ఓవర్లు జరగాల్సిన మ్యాచ్ కేవలం 36 ఓవర్లలోనే ముగిసింది. శ్రీలంక 27.4 ఓవర్లు ఆడగా, న్యూజిలాండ్ 8.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరింది. మరో 250 బంతులు మిగిలి ఉండగానే విజయభేరి మోగించింది. వనే్డ చరిత్రలో మిగిలిన బాల్స్ పరంగా ఇది ఏడో భారీ విజయం. కివీస్‌కు రెండోది. 2007 డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌పై క్వీన్స్‌టౌన్‌లో 264 బంతులు మిగిలి ఉండగానే ఈ జట్టు లక్ష్యాన్ని ఛేదించింది. కాగా, బంతుల రూపంలో చూస్తే లంకకు ఇదే అత్యంత భారీ పరాజయం. ఈ జట్టు పది వికెట్ల తేడాతో ఓటమిపాలుకావడం ఇది నాలుగోసారి. కివీస్ చేతిలో మొదటిసారి.