జాతీయ వార్తలు

ప్రసూతి సెలవు 26వారాలకు పెంపు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ముసాయిదా బిల్లుకు మెరుగులు
న్యూఢిల్లీ, డిసెంబర్ 29: ప్రసూతి సెలవును ప్రస్తుత 12వారాల నుంచి 26వారాలకు పెంచేందుకు ఉద్దేశించిన ముసాయిదా బిల్లు దిశగా కేంద్ర కార్మిక శాఖ తుది అడుగులు వేస్తోంది. దీన్ని అంతర్ మంత్రిత్వ శాఖ సంప్రదింపులకు త్వరలోనే నివేదించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అనంతరం న్యాయ మంత్రిత్వ శాఖకు ఆ తర్వాత కేబినెట్ ఆమోదానికి ఈ ముసాయిదా సవరణ బిల్లును పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రసూతి సెలవును 26వారాలకు పెంచాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం గత కొంత కాలంగా పరిశీలిస్తోంది. దీనిపై గత నెల్లో కార్మిక సంఘాలు, యాజమాన్యాలతో కూడా కార్మిక శాఖ త్రైపాక్షిక చర్చలు జరిపింది. సరోగసీ ద్వారా పిల్లల్ని కనే తల్లులకు అలాగే పిల్లల్ని దత్తత తీసుకునే ఉద్యోగినులకు 12వారాల ప్రసూతి సెలవును ఇచ్చే ఆలోచన కూడా కార్మిక శాఖ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.