మాతో - మీరు

భగత్‌సింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగత్‌సింగ్
జీవితంలో విజయం సాధించేందుకు లక్ష్యం యొక్క ప్రాముఖ్యం గురించి ‘సండే గీత’లో అద్భుతంగా వివరించారు. మనసు నియంత్రణ ఆవశ్యకతను ఓ చిన్న మాట ద్వారా తెలుసుకొన్నాం. ‘్భగత్‌సింగ్’ జీవిత గాథను చదువుతుంటే ఆపాదమస్తకం విప్లవ స్ఫూర్తితో, దేశభక్తితో పరవశించి పోతున్నాం. భారతమాత గర్వించదగ్గ బిడ్డలలో ఒకరైన భగత్‌సింగ్ జీవిత చరిత్రను అందిస్తున్న శాస్ర్తీగార్కి కృతజ్ఞతలు. అలాగే దిల్లీలో వాతావరణ కాలుష్యం నియంత్రించేందుకు కార్‌ఫ్రీ జోన్ ప్రయోగం చేపట్టడం ముదావహం. ఈ దిశగా కాలుష్య కోరలలో చిక్కుకున్న ఇతర రాష్ట్రాలలో కూడా నియంత్రణ చర్యలు తక్షణమే జరగాలి. ప్రజలు సొంత వాహనాలపై కాక పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌పై ఆధారపడటం అవసరం.
-ఎం.కనకదుర్గ (తెనాలి)
తమాషా
నట్‌కాని కోకోనట్‌లను కోతులతో చెట్టు నుంచి తీయించటం తమాషాగా ఉంది. బీట్‌రూట్ విషయాలు ఆకట్టుకొన్నాయి. చెరకు, బీట్‌రూట్‌లలో ఒకే స్థాయి షుగర్ ఉండటం ఆశ్చర్యమే. ప్రతి విషయాన్నీ నెగెటివ్‌గా ఆలోచించి నిరుత్సాహపరిచే నిత్యశంకితులు మన చుట్టూ ఉంటారు. అలాంటి వారిని లక్ష్యపెట్టకుండా ముందుకు దూసుకుపోవాలని ‘సండే గీత’లో చక్కగా చెప్పారు. పాత ఆర్టీసీ బస్సు సీట్లపై ఎమ్మెల్యే, ఎంపి అని రాసేవారు. ఇప్పుడు లేవు. ఖాళీ ఫస్ట్‌ఎయిడ్ బాక్స్, ఆచూకీ లేని కంప్లైంట్ బుక్ లాగానే ఈ సీట్లూ ఒక లాంఛనమే. ఎవరూ పట్టించుకోని లాంఛనం! ఉన్నా లేనట్టే.
-కె.ప్రవీణ్ (కాకినాడ)
ముఖాముఖి
అసహనంపై అడిగిన ప్రశ్నకు ఆ సీజన్ అయిపోందన్న మీ జవాబు భలేగా ఉంది. వంద మందికి పైగా అవార్డులు తిరస్కరించినట్టు ప్రచారం సాగింది కాని కేవలం 39 మంది ఆ రాగి రేకులు పంపినా అందులో కొందరు చెక్కులు పంపలేదట. ఆ తామ్రపత్రాలు తీసుకోం. చెక్కులు నగదీకరణ చేసుకోం అని అకాడెమీ ప్రకటించింది. సీజన్ అయిపోయిందన్నమాటే. అసహనం కోసం కాక ప్రచారం కోసమే వారు పాకులాడినట్టుంది. ‘సెంట్ ఆఫ్ ఎ ఉమన్’ సినిమా కథ చెప్పనంటూనే సినిమా మొత్తం చూసిన అనుభూతి కలిగించారు గోపాలంగారు. గతంలో మిర్చి విషయంలోనూ అంతే. అందరూ ప్రతి వారం మిస్ అవకుండా తప్పక చదవాల్సిన పేజీ ‘లోకాభిరామమ్’. ‘క్లాప్ కొట్టు గురూ’లో అంజలి గొప్పలు చెప్పనవసరం లేదు. ఆమె స్వరంలో మార్దవం, మాధుర్యం లేవు. నటనలో గొప్పదనమూ లేదు. ఆమె ఇంతవరకు రావడం కేవలం లక్.
-బి.స్నేహమాధురి (పెద్దాపురం, తూ.గో.జిల్లా)
వినదగు
‘వినదగు...’ అంటూ కురుక్షేత్ర పరిస్థితిని షాలో సెంటిమెంట్, సెల్ఫ్ రియలైజేషన్ లాంటి పదాలతో వివరించడం సరికాదేమో. అస్త్రాలు వదిలేసి నన్ను చంపినా సరే అంటూ శత్రువుని ప్రేమించడం ఉన్నతత్వం అన్నారు. ఈనాడు అది కుదురుతుందా? ఉగ్రవాదులు బాంబులు వేసి చంపుతుంటే ప్రేమతో ఇంకా చంపండి అందర్నీ చంపండి అనడమే ఉన్నతత్వం అయితే ఏ దేశంలోనూ ఎవరూ అలాంటి ఉన్నతత్వం కోరుకోకూడదు. చిన్న పగ.. కథలో లోగానే పగతీర్చుకున్నా డబ్బు బ్యాంక్‌కి పంపేసి జెంటిల్మన్ అనిపించుకోవడం బావుంది. నాలుగు పదుల శిల్పాశెట్టి హీరోయిన్‌గా నటిస్తానన్నా అంత రిస్క్ ఎవరు తీసుకుంటారు? తనే స్వయంగా నిర్మాతగా మారాలి.
-సుభాష్ (శ్రీనగర్)
కార్బన్ మేఘాలు
వాయు కాలుష్యానికి ప్రధాన కారణమైన వాహనాలు వెదజిమ్మే కార్బన్ ఉద్గారాలే అని తెలుపుతూ, అవి గాలిలో ఎంత మేర సమ్మిళితమై మన ఆరోగ్యాన్ని హరిస్తున్నాయో అంకెల్తో నిరూపించిన ‘కారుమేఘాలు’ స్పెషల్ వ్యాసం చాలా ఉపయుక్తంగా ఉంది. ప్రయోజనం ఆశించతగినది. దేశంలో టాప్ పొల్యూషన్ సిటీగా దిల్లీ నమోదుకి, అక్కడ ఒక్కరోజున 85 లక్షలు వాహనాలు నడుస్తుండగా, దీనికి అదనంగా మరో 4500 కార్లు కొత్తవి రోడ్డెక్కడం కారణం అని తెలుస్తున్నది. ఈ వాహనాలు పరుగు పందెం ప్రతి చిన్న పెద్ద నగరాలకు వర్తింపజేసుకున్నా, వీటి ఎగ్జాస్టుల ద్వారా కాలుష్యం ఎన్ని టన్నులకి పెరుగుతున్నదో లెక్కించుకుంటే ఊపిరి ఆడదు. ప్రపంచం అంతా ఈ వాతావరణ కాలుష్యాన్ని కొంతైనా తగ్గించుకోడానికి కార్ ఫ్రీ జోన్‌లుగా విభజించుకొని, వందల నగరాల్లో అమలుపరచుకుంటున్నారు. వారి నుంచి స్ఫూర్తి పొంది మన దేశంలోనూ ఆ ప్రణాళికలు ప్రవేశపెట్టడం సంతోషదాయకం.
-తాళాబత్తుల సత్యనారాయణ మూర్తి (మల్కాపురం)
కాలుష్య మేఘాలు
వాతావరణ కాలుష్యం వందేళ్లు బతికే మనిషి ఆయుష్షును అరవై ఏళ్ల వయసుకే పరిమితం చేస్తుందన్నది అక్షర సత్యం. కారుమేఘాలు కాలుష్య మేఘాలై సిటీ లైఫ్‌లో అతి ఘోరం, కోరి మృత్యువును పిలిచి చావుకు బకరాలమై పోతున్నాం అంటే ఆశ్చర్యం ఏమీ లేదు. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ రోజుల్లో కారొద్దు.. సైకిళ్లే ముద్దు అంటున్నాయి. టాప్ టెన్ దేశాలైతే సైకిల్‌కే ఓటు వేస్తున్నాయి. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించుకోవడం మానవుడి బాధ్యతగా స్వీకరించాలి. ‘కారుమేఘాలు’ ద్వారా చక్కటి సమాచారాన్ని అందించారు. ఆలోచింపజేసేదిగా ఉందీ వ్యాసం.
-బి.విజయలక్ష్మి (తిరుపతి)
రణక్షేత్రం
ఈ సీరియల్ అనేకానేక మలుపులతో సాగుతోంది. రచయిత కథని చెప్పే తీరు మాకెంతో నచ్చింది. రాయలసీమ ఫ్యాక్షన్ గురించి చక్కగా వివరించారు.
-బి.చంద్రశేఖర్ (శ్రీకాకుళం)