మాతో - మీరు

బాహుబలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిగినింగ్ ఒక ప్రశ్న. కన్‌క్లూజన్ ఒక సమాధానం. ‘కట్టప్ప’ ఊసెత్తితే బాహుబలి అడియన్సూ నవ్వుతారు. ఎందుకంటే బాహుబలిని ఎందుకు చంపాడో? ఎలా చంపాడో? ప్రేక్షకులు చూసేశారు. కాదు. ఊరించి ఊరించి రాజవౌళి చూపించేశాడు. ఇప్పుడు ఆడియన్స్ మైండ్‌లో వున్న ప్రశ్న ‘కట్టప్ప’ గురించి కాదు. బాహుబలిని ఆవిష్కరించిన రాజవౌళి గురించి. తెలుగు సినిమాను ‘కాకలు తీరిన’ స్థాయికి తీసుకెళ్లిన జక్కన్న - కొత్తగా చెక్కిన శిల్పం గురించి. ఆ శిల్పం ఎలా ఉండబోతుందో ఊహించుకోవాలంటే ‘మొదలు’ నుంచి ‘ముగింపు’ వరకూ బాహుబలిపై దృష్టి పెట్టాల్సిందే. చక్కటి కథనాన్ని అందించినందుకు ధన్యవాదాలు.
-ఎం.సుగుణ (రాజమండ్రి)
ప్రణవనాదం
తాళం చెవి లేకుండా తలుపులు తీయడం ఎలా సాధ్యం కాదో గురువు లేకుండా విద్యార్జన చేయడం అంతే. దయ ఆయనది. దీనులం మనం. త్యాగం ఆయనది. ప్రయోజనం మనది. గురువనే జ్ఞాన కల్పతరువు తప్పుకుంటే మనకు జీవితమే లేదు అనుకున్నవాడే యోగ్యుడిగా పరిగణింపబడతాడు. తన శిష్యుడు పది మందిలో పేరు ప్రతిష్టలు సంపాదించి గౌరవించబడితే సంతోషించేది ముందుగా గురువే -ఇలాంటి ఎన్నో అద్భుత విషయాలను రాగ మేళవింపుతో మాకు అందజేస్తున్నందుకు సూరిబాబు గారికి కృతజ్ఞతలు.
-ఎన్.రామం (విజయవాడ)
లోకాభిరామమ్
హిందీ సినిమా ‘గైడ్’ను మరల చూసినంత విశదంగా వర్ణించిన ‘లోకాభిరామమ్’ బాగుంది. భాష రాకపోయినా సినిమా చూసి భావాన్ని అర్థం చేసుకున్న ఆంధ్రులెంతో మంది ఉన్నారు. ముఖ్యంగా ఈ సినిమా సంగీత దర్శకుడైన సచిన్‌దేవ్ బర్మ గొప్ప గాయకుడు. ఏ నటుడికీ ఈయన గళం అతకదు. లతామంగేష్కర్ అంతటి మహా గొప్ప గాయనే బర్మన్ సమకూర్చిన స్వరంతో పాడలేనని చెప్పడం ఎంత ఆశ్చర్యం. అందుకే ఆ పాటను తానే పాడాడు. ఇలాంటి విలక్షణ సంగీత సరస్వతి మన సాలూరి రాజేశ్వరరావు. ఈయన కూడా కొన్ని సినిమాలలో బ్యాక్‌గ్రౌండ్ పాటలు పాడారు. బొబ్బిలియుద్ధం సినిమాలో నాగయ్యకు పాడారు. మంచి మంచి విషయాలను మాకు తెలియపరుస్తూన్న ఆదివారం అనుబంధం అంటే మాకెంతో అభిమానం. సండే గీత నుంచి చివరి పేజీ వరకూ అన్ని శీర్షికలు మమ్మల్ని ఎంతగానో అలరిస్తున్నాయి.
-ఎన్.రామలక్ష్మి (సికిందరాబాద్)
తర్కం
తర్కంలోనే శాస్త్రం ఉంది. శాస్త్ర పురోగతిలోనే మానవ మనుగడ ఉంది. శాస్త్రం, టెక్నాలజీ గురించి చెప్పిన కవర్‌స్టోరీ ‘శోధించు, సాధించు, రాణించు’ అన్న ఉద్బోధ స్ఫూర్తిదాయకంగా ఉంది. సేవ, సహృదయతలే నాయకత్వం నిలదొక్కుకునేలాగ చేస్తాయని చెప్పిన ‘వినదగు’ వాక్యాలు ఆలోచింపజేశాయి. ‘మీకు మీరే డాక్టర్’ చాలా ఉపయుక్తంగా ఉంటోంది. పళ్ల రసాలతో కేన్సర్‌కి ఎలా చెక్ పెట్టగలం అనే విషయాన్ని బాగా వివరించారు. కానీ రసాయనాలు సోకని స్వచ్ఛమైన పళ్లు దొరకడం లేదే. ఇక బాగా వెనుకబడిన ప్రాంతం బస్తర్‌లో 44 వేల మంది విద్యార్థులు 35 వేల ప్రయోగాలు చేసి రికార్డు సాధించడం శ్లాఘనీయం.
-బి.సోనాలి (సూర్యారావుపేట)
టెలీపతి
కొన్ని వస్తువుల్ని తాకితే అవి వాటి యజమానుల మనసులోని ఆలోచనల్ని టెలీపతి ద్వారా ప్రసారం చేయగలవనడం నిజంగా నమ్మలేని నిజమే. అలాగే కొత్త ప్రదేశంలో ముఖ్యంగా పర్యాటక ప్రదేశాల్లో మోసానికి గురి అయినప్పుడు అక్కడి వారంతా మోసగాళ్లే అనుకోవడం తగదని చెప్పిన సండే గీత బాగుంది. అక్షరాలోచనల్లో ‘కవి దేశం’ కవితలో చివరి పదాలు ‘ఈ మట్టిలో పుట్టిన పుణ్యమే కవిత్వం నదిలా ప్రవహిస్తుంది’ అనడం బాగుంది. రాజకీయం, తన చుట్టూ తిరుగుతూ ఓట్ల చుట్టూ తిరుగుతుందన్న మీ సమాధానం భలేగా ఉంది. అన్నట్లు జగన్ మీది కేసులన్నీ పోయి ఆయనే సిఎం అవతుడని పంచాంగకర్త ఉగాదినాడు చెప్పాడు! రాబోయే ఎలక్షన్లలో ఏం జరుగుతుందో?
-బి.స్నేహమాధురి (పెద్దాపురం)
కథాసాగరం
వణికించే చలి రాత్రి ఆతిథ్యం ఇవ్వని గ్రామస్తుల్ని నిందించకుండా ఊరి చివర చెట్టు కింద కూచుని నిండు చంద్రుడు, నిర్మలాకాశం, తళతళ మెరిసే నక్షత్రాలు చూస్తూ ఆకలి, చలి మరిచిపోయి పరమానందం పొందిన జెన్ సన్యాసిని కథ బాగుంది. ఫ్రాంక్‌ని చంపడానికి గ్రిఫ్‌తో బేరం కుదుర్చుకుంటాడు మలాకీ. కాని ఒక సందర్భంలో గ్రిఫ్‌ని బెదిరిస్తాడు. దాంతో గ్రిఫ్, ఫ్రాంక్‌తో చేయి కలిపి బేరం కుదుర్చుకున్న మలాకీనే చంపేస్తాడు. క్రైం కథ మంచి సస్పెన్స్‌తో సాగి ఊహించని విధంగా ముగిసింది.
-హెచ్.పవన్‌పుత్ర (రామారావుపేట)
జ్ఞాపకాలు
మనిషి జీవితం రెండింటితో ముడిపడి ఉంది. అవి జ్ఞాపకాలు, సెంటిమెంట్లు అంటూ ‘ఓ చిన్న మాట’గా చెప్పిన విషయాలు అలరించాయి. లోకాభిరామమ్‌లో గోపాలంగారు గైడ్ చిత్రం, బర్మన్ పాట గురించి గొప్పగా చెప్పారు. మమ్మల్ని ఆ కాలానికి లాక్కుపోయారు. గైడ్ గురించి మరో రెండు విషయాలు. ప్రఖ్యాత రచయిత్రి పెర్ల్‌బక్ ఆ చిత్రాన్ని ఆంగ్లంలో తీసి నష్టపోయింది. దేవానంద్ నడక, ఆ కదలికలు మాట తీరు ఒక హాలీవుడ్ నటునికి అనుకరణ అంటారు. తక్కువేమి మనకు రాముండొక్కడుండే వరకు అంటూ మల్లాది వారు చెప్పిన విషయాలు మమ్మల్ని భక్తి ప్రపూర్ణులను చేశాయి.
-కె.సుధీర్ (శ్రీనగర్)
‘దగ్గర-దూరాలు’
‘సండే గీత’ శీర్షికన అందించిన ‘దగ్గర - దూరాలు’ సాంకేతికత వలన మనుషుల మధ్య దూరాలు అనంతంగా పెరిగిపోతున్నాయి అంటూ ప్రస్తుత పరిస్థితులను చక్కగా తెలిపారు. ఓ చిన్న మాటలో ‘శక్తి సామర్థ్యాలు’ మనిషి ఈ సృష్టిలోని అన్ని జీవాలను చూసి, తన శక్తి సామర్థ్యాలను సంపూర్ణంగా వినియోగించడం నేర్చుకోవాలని చక్కగా తెలియజేశారు.
-పి.ఆదిత్యమూర్తి (గొల్లలమామిడాడ)