మెయిన్ ఫీచర్

మహిళలకు ప్రత్యేక హోదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఇల్లంతా చిందరవందరగా ఉంది, ముందు అన్నీ సర్దిపెట్టి అప్పుడు చదువుకో అవని’’ అని గట్టిగా చెప్పింది హేమ. ‘‘నే కూడా సాయం చేస్తా, పద చెల్లీ’’ అని పుస్తకం మూసి లేచాడు రవి. ‘‘నీకెందుకు నాన్న ఈ పన్లు’’ అంది హేమ. ‘‘అమ్మా! పొద్దున్నించీ చూస్తున్నాను, నేను ఏ పని చేసినా, వద్దు చదువుకోమని చెప్తున్నావ్. చెల్లి చదువుకుంటుంటే, ఆపి మరీ పనులు చేయమంటున్నావ్. ఎందుకమ్మా? చెల్లి ఆడపిల్ల కనుకనా? ఏం నేను ఇంటి పని నేర్చుకోకూడదా? చెల్లి బాగా చదివి డాక్టర్ అవకూడదా? ఎందుకమ్మా ఈ తేడా? నాకేం నచ్చలేదు. ఈ శతాబ్దంలో కూడా ఇంకా ఇలా ఆడ, మగ అని తేడాగా మాట్లాడటం, చూడటం. ఆడపిల్లలు, మగ పిల్లలతో సమానంగా అన్నిట్లోను ముందుంటున్నారు. ఇంకెప్పుడూ ఇలా మాట్లాడకమ్మా, ప్లీజ్’’అని రూంలోకి వెళ్ళిపోయాడు. ఇంట్లో అసలున్నాడా లేడా అనేలా ఉండే రవేనా ఇలా ఆవేశంగా మాట్లాడిందని ముగ్గురూ షాకయి మిన్నకుండిపోయేరు.

‘ప్రత్యేక హోదా’ విషయం ఏమయిందా అని ఆసక్తిగా పేపర్ తిరగేస్తుంటే ఓ మూలన కనపడిందోయ్. ఇవాళ ‘‘ఉమెన్స్‌డే’’ట కదా’’ అన్నాడు సుబ్బారావు. ‘‘అవునటండీ, లేస్తూనే అవని, హ్యాపీ ఉమెన్స్ డే అమ్మా!’’అని వాటేసుకుంది. రవి కూడా లేవగానే విష్ చేసాడు’’ అంది హేమ. ‘‘ఆహా! బావుంది. సరే తొమ్మిదయింది, టిఫిన్ రెడీ అయిందా? త్వరగా పెట్టు మరి, తిని క్లబ్బు దాకా వెళ్ళొస్తా. మెదడుకి పదును పెట్టి చాలా రోజులయింది. ఫ్రెండ్స్‌తో చెస్ ఆడొస్తా’’ అన్నాడు. ‘‘అన్నీ ఎప్పుడో సిద్ధం చేసుంచేను, పిల్లలు కూడా మీకోసమే చూస్తున్నారు. క్లబ్ నించి త్వరగా వచ్చేయండి. మీ తమ్ముడు, మరదలు, పిల్లలు వస్తున్నారు భోజనానికి, గుర్తుందికదా’’ అంది హేమ. ‘‘నాన్న! అమ్మకు విషెస్ చెప్పేవా, ఈరోజు ఉమెన్స్‌డే కదా’’ అడిగాడు రవి.
‘‘ఆ! ఏముందిలేరా రోజూ ఏదో ఒక డే అని వేలంవెర్రంతే. నువ్వు టిఫిన్ కానిచ్చి క్లాసుకి వెళ్ళిరా’’అని తిన్న కంచంలో చేయి కడుక్కుని క్లబ్‌కు వెళ్ళిపోయేడు సుబ్బారావు. రవి టిఫిన్ తిని ప్లేట్ తీయబోతుంటే హేమ ఆపింది’’ నీకు టైం అవుతోంది నువ్వు వెళ్ళు నాన్న! ఇంట్లో ఉండి చదువుకోడమే కదా, అవని శుభ్రం చేస్తుందిలే, పెళ్ళిచేసుకుని అత్తారింటికి వెళ్ళబోయే పిల్ల, సెలవు రోజునయినా కాస్త పనిచేయడం నేర్చుకుంటుంది’’ అంది.
ఓ గంటన్నరకి ఇంటికొచ్చేడు సుబ్బారావ్.‘‘అదేమండీ, ఇవాళ త్వరగా వచ్చేసారు? ఒంట్లో బాగోలేదా ఏం?’’ అని కంగారుగా అడిగింది హేమ. ‘‘అదేం లేదోయ్! ఇవాళ మూర్తి రాలేదు. వాళ్ళన్న కొడుక్కి సైకిలు మీంచి పడి బాగా దెబ్బలు తగిలి, జ్వరం కూడా జతయిందట, నాలుగురోజులు పైనే అయిందట. పిల్లాడికి నర దృష్టి అని, మగ పిల్లాడు కదా జాగ్రత్తగా ఉండాలని వాళ్ళ ఫ్యామిలీ పంతులు ఏవో నాలుగైదు దేవాలయాలకెళ్ళి దర్శనం చేసుకు రమ్మన్నాడట. అందుకని రాలేదు. క్లబ్‌లో ఎక్కువ ఆడేది మేమిద్దరమే కదా, అందుకే ఊసుపోక వచ్చేసా. ఇదీ విషయం’’ అని ముగించేడు సుబ్బారావు. ‘‘పోనీలెండి! ఆ దేవుడి దయవల్ల పిల్లాడికి తగ్గితే అంతే చాలు’’ తనవంతు వంత పాడింది హేమ.
మధ్యాహ్నం ఒంటిగంటకు సుబ్బారావ్ తమ్ముడు శివ కుటుంబమంతా వచ్చేరు భోజనానిలకి. ‘లంచ్‌కి ఓ అరగంట టైం ఉంది, పిల్లలు ఈలోగా ఆడుకోండి’’అని వస్తూనే, తన పిల్లల్ని రవి వాళ్ళ రూంలోకి పంపేడు శివ. అవని, రవి, తమ్ముళ్ళని చూడగానే పుస్తకాలు పక్కన పెట్టి ఆటలు మొదలెట్టేరు.
అక్కా! నే చేయందిస్తానంటూ, రాగానే తోడికోడలు హిమజ వంటింట్లోకెళ్ళింది. కాసేపు లోకాభిరామాయణం చెప్పుకున్నాక హిమజ సిగ్గుపడుతూ మెల్లగా చెప్పింది ‘‘అక్కా! పిల్లల దగ్గర, బావగారి దగ్గర అనకండి, మీకో చిన్న విషయం చెప్తాను’’అంది. ‘‘ఏమిటి హిమాజా విషయం’’ నుదురు చిట్లించింది హేమ.
‘‘మరేం లేదక్కా! ఇవాళ ఉమెన్స్‌డే కదా, పొద్దున నే లేచేసరికే మీ మరిది కాఫీ, టిఫిన్లు తయారుచేసి పెట్టేరు. నే భయపడుతూ అడిగా ‘‘ఏంటండీ ఇదంతా’’అని, ‘‘కంగారుపడతావెందుకోయ్! ఇవాళ స్పెషల్ డే మీకు. ఈ ఒక్కరోజయినా ఇంటి పని నన్ను చేయనీ. మధ్యాహ్నం అన్నయ్య ఇంట్లో లంచ్ చేసి సరదాగా అలా సినిమా, బయట డిన్నర్ చేసి ఇంటికొద్దాం’’ అన్నారక్కా, ఓ క్షణం నాకేమర్ధంకాలేదు, అవాక్కయి అలా నిలబడిపోయా’’అంది. ‘‘మీరు సాయంత్రం ఎటైనా వెళుతున్నారా అక్కా?’’ అడిగింది హిమజ.
‘‘లేదమ్మా! మీ బావగారు తీసుకెళతానన్నారు కానీ నేనే వద్దన్నానే. ఒకవేళ వెళ్ళినా ఆయన అలాంటివి ఎంజాయ్ చేయలేరని నీకు తెలుసు కదా, బయట తింటే నాకు, పిల్లలకు ఆరోగ్యం ఏమవుతుందో అని ఆయనకు బెంగ అంతే’’ అని నవ్వుతూ సమాధానమిచ్చింది హేమ.
ఈ మాటలన్నీ పక్కన బెడ్రూంలో పుస్తకం కోసమని వచ్చిన సుబ్బారావ్ చెవినపడ్డాయి. వౌనంగా వెళ్ళిపోయేడు. ఇంతలో హేమ అవనిని కేకేసింది. ‘‘ఏమిటే మగ పిల్లలతో సమానంగా ఆ ఆటలు, ఇక్కడుండి నాకు, పిన్నికి సాయం చేయి. డైనింగ్ టేబుల్ శుభ్రంచేసి సర్దిపెట్టు’’అని. ‘‘సరేనమ్మా’’ అని కాస్త కోపంగా కాస్త విచారంగా హాల్లోకి వెళ్ళిపోయింది అవని. అందరూ కూచున్నారు భోజనాలకి. ‘‘ఏం అవని! బాగా చదువుతున్నావా? ఏమవుతావ్ పెద్దయితే? అడిగాడు శివ. ‘‘నే డాక్టర్ అవుతా బాబాయి’’అంది మెరుస్తున్న కళ్ళతో, ‘‘వెరీ గూడ్’’ అన్నాడు శివ.
‘‘అన్నయ్య డాక్టర్ అవుతాడులే! అవని, నువ్వు ఇంజనీరువవుదూగాని, సరేనా’’అన్నాడు సుబ్బారావ్. ‘‘అవును తల్లీ, నాన్నగారి మాట విను’’ భర్త మాటందుకుంది హేమ. భోజనాలు ముగిశాయి. శివ వాళ్ళు తామిక బయలుదేరుతామన్నారు. గేటువరకు సాగనంపడానికెళ్ళేడు సుబ్బారావ్.
‘‘అన్నయ్యా! ఇలా చెప్తున్నానని మరోలా అనుకోకు. అవని గురించి ఇందాకా నువ్వలా అనడం నాకెందుకో మంచిగా అనిపించలేదు. పిల్లల ఆలోచనలని, ఆశయాలని ప్రోత్సహిస్తే వారి భవిష్యత్తు బావుంటుందని నా ఉద్దేశం. నీకు తెలీదని కాదు, నాకు చెప్పాలనిపించిందంతే, తప్పుగా అనుకోకు, ఆలోచించు’’అని చెప్పి వెళ్ళిపోయాడు.

‘‘ఇల్లంతా చిందరవందరగా ఉంది, ముందు అన్నీ సర్దిపెట్టి అప్పుడు చదువుకో అవని’’ అని గట్టిగా చెప్పింది హేమ. ‘‘నే కూడా సాయం చేస్తా, పద చెల్లీ’’ అని పుస్తకం మూసి లేచాడు రవి. ‘‘నీకెందుకు నాన్న ఈ పన్లు’’ అంది హేమ. ‘‘అమ్మా! పొద్దున్నించీ చూస్తున్నాను, నేను ఏ పని చేసినా, వద్దు చదువుకోమని చెప్తున్నావ్. చెల్లి చదువుకుంటుంటే, ఆపి మరీ పనులు చేయమంటున్నావ్. ఎందుకమ్మా? చెల్లి ఆడపిల్ల కనుకనా? ఏం నేను ఇంటి పని నేర్చుకోకూడదా? చెల్లి బాగా చదివి డాక్టర్ అవకూడదా? ఎందుకమ్మా ఈ తేడా? నాకేం నచ్చలేదు. ఈ శతాబ్దంలో కూడా ఇంకా ఇలా ఆడ, మగ అని తేడాగా మాట్లాడటం, చూడటం. ఆడపిల్లలు, మగ పిల్లలతో సమానంగా అన్నిట్లోను ముందుంటున్నారు. ఇంకెప్పుడూ ఇలా మాట్లాడకమ్మా, ప్లీజ్’’అని రూంలోకి వెళ్ళిపోయాడు. ఇంట్లో అసలున్నాడా లేడా అనేలా ఉండే రవేనా ఇలా ఆవేశంగా మాట్లాడిందని ముగ్గురూ షాకయి మిన్నకుండిపోయేరు.
ఆ రాత్రి పనంతా ముగించుకుని వచ్చి సోఫాలో కూర్చుంది హేమ, పక్కనే ‘‘హోదా న్యూస్’’చూస్తున్న సుబ్బారావ్ టి.వి. కట్టేసి ‘‘మంచి ఉద్యోగం, ఎక్కువ డబ్బు సంపాదించి, నీ చేతిలో పెడుతూ నిన్ను సంతోష పెడుతున్నాను అనుకున్నానే కానీ, నీ చిన్నచిన్న ఆనందాలు విస్మరిస్తున్నాను అని ఎప్పుడూ ఆలోచించలేదు హేమ. నీకివ్వాల్సిన ప్రత్యేక హోదాను ఇవ్వలేకపోయాను. నన్ను క్షమించు’’ అన్నాడు. ‘‘అవేం మాటలు, ఊరుకోండి’’ అని ఏదో చెప్పబోతుంటే హేమ చేతిని తన చేతిలోకి తీసుకుని‘‘మధ్యాహ్నం నువ్వు, హిమజ మాట్లాడుకున్నదంతా నేవిన్నాను. నువ్వు ననె్నంత బాగా సమర్ధించేవో కూడా విన్నాను, సిగ్గుపడ్డాను నా పద్ధతికి. ఆడ దానివి కనుక వంటింటి కంటే నీకు కావలసిన ప్రపంచం ఏముంటుందిలే అనుకునేవాడిని, ఇకమీదట అలా జరగదు. నువ్వు, పిల్లలు కూడా నాలో మార్పు చూస్తారు. రవి చిన్నవాడయినా వాడన్న ప్రతీ మాటలోనూ పెద్ద అర్ధం ఉంది. పెళ్ళిచేసుకుని అత్తారింటికి వెళ్ళిపోయే పిల్లే కదా ఎంత చదివితే ఏముందిలే అన్న మన అభిప్రాయాన్ని తప్పుఅని చక్కగా చెప్పాడు రవి, అవనిని తన ఇష్టప్రకారమే డాక్టర్‌ని చేస్తాను.
నిజమే! ఆడ, మగ సమానమని టి.వి.లో వచ్చే స్పెషల్ ప్రోగ్రాములు చూసినప్పుడో, లేక ఇరుగుపొరుగులు మాట్లాడుకుంటున్నప్పుడో విని ‘‘ఔను!నిజమే సుమా’’అనుకోడం కాదు. మార్పు మన ఇంటినించే మొదలవాలి. కడుపులో బిడ్డ లింగ నిర్ధారణ ఎంత తప్పో, మన వంశాన్ని ఉద్ధరించాలి కనుక, తల కొరివిపెట్టే హక్కు కొడుక్కో లేక మనవడికో మాత్రమే ఉంటుంది కనుక కొడుకే పుట్టాలని కోరుకోవడం కూడా అంతే తప్పు. మగపిల్లాడు పుట్టాలనుకోడం తప్పుకాదు. మగ పిల్లాడే కావాలనుకోవడం తప్పు. బతికున్నప్పుడు, చనిపోయాక కూడా మన పేరును నిలబెట్టే వాళ్ళే అసలయిన వారసులు. వారివల్లే మనకు మోక్షమొచ్చినా, ఏమొచ్చినా, పెళ్ళయ్యాక కూడా తల్లిదండ్రులను కనిపెట్టుకున్న కూతుర్లు లేకపోలేదు, ఉద్యోగం సంపాదించగానే తల్లిదండ్రులను విస్మరించిన కొడుకులూ లేకపోలేదు. ఆడ పిల్లనిచ్చేం కదా అని అల్లుడికి, అతని కుటుంబానికి జన్మంతా అడుగులకు, మడుగులొత్తక్కరలేదు. చదువు, సంధ్యలు, పని పట్లు నేర్పి, అవసరమయితే తన కుటుంబాన్ని పోషించుకోగలిగే సత్తా ఉన్న మహాలక్ష్మిని కన్యాదానం చేసినందుకు గర్వపడాలి. అత్తవారింటికెళ్ళేక ఏ అసమానతలకు గురవుతుందో అని భయపడేముందు పుట్టింట్లోనే ఆమెకు ఆడ, మగ సమానమని చూపించాలి. ఆత్మగౌరవాన్ని పెంచాలి. మారుతున్న కాలంతో ఆడ, మగ అసమానత మెల్లగా మాయమవుతోంది. నేటి యువత చాలావరకు ఈ విషయాన్ని నిరూపిస్తోంది, కానీ ఇంకా కొన్ని ప్రదేశాల్లో ఆడబిడ్డను పుట్టగానే పారవేయడం లాంటి ఆటవిక నాగరికత కొనసాగుతోంది. ఓ పక్క ప్రేమోన్మాదుల ఆమ్ల దాడులని సవాలుచేస్తూ ఆడవారు తమ జాతకాలను తామే రాసుకుంటుంటే, ఇంకా ఈ సమాజంలో పిల్ల, పెద్ద తేడా లేకుండా బలాత్కారాలు చేసేమానవ మృగాలు సంచరిస్తూనే ఉన్నాయి. ఇవన్నీ ముగిసిపోయే రోజు రావాలి. ఆడవారి ‘‘ప్రత్యేక హోదా’’ వారికి దక్కాలి.

-కౌముది ఎం.ఎన్.కె