Others

వలపుల వసంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గండు తుమ్మెదలకు గాలంవేసే
విరితీగెల పూలచూపులు

మకరందానికి అంత తియ్యదనమెందుకో?
ఊరింది వలపు కోరికలైనందుకేమో!

మొగ్గవిచ్చిన మందారం
ఒలకబోసిన వనె్నలకు
ఆత్రంగా పరుగుపెట్టే ఆశపడిన తుమ్మెద

కోయిల గొంతులో మరుడు
కొలువుండునేమో -అది
కూస్తుంటే కోరికలేస్తుంది

విరిచేడె పంపెను నెత్తావుల ప్రేమలేఖ
మరుని తూపులకు శరవేగంతో
ఝమ్మని వాలెను తుమ్మెద
కుసుమం ఒసగెను తేనెల కానుక
భ్రమరం పొందెను కమ్మని వేడుక

ఇది చైత్రుడు రాసిన ప్రేమాయణం
జగమంతా ఒక బృందావనం.

-చిరమన వెంకటరమణయ్య 9441380336