సబ్ ఫీచర్

ఎండల్ల్లో చర్మ సౌందర్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేసవిలో వాతావరణమంతా వేడి సెగలతో నిండిపోతుంది. దాంతో శరీరంలోని నీరు ఆవిరై చర్మం ఎండిపోయినట్లుగా, నల్లగా మారుతుంది. ముఖం కాంతివిహీనమవుతుంది. శరీరం శుష్కిస్తుంది. ఇలా కాకుండా శరీరం ఆరోగ్యంగా ఉంటూ చర్మం నిగనిగలాడాలంటే వంటింట్లోని వస్తువులతో చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే సరి!
* రోజుకు కనీసం పది గ్లాసుల నీటిని తాగాలి.
* ఒక గ్లాసు నీటిలో అరచెక్క నిమ్మకాయ పిండుకుని, రెండు చెంచాల పంచదార, చిటికెడు ఉప్పు కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజుకో గ్లాసు చొప్పున తీసుకోవడం వల్ల నిర్జలీకరణ నుంచి తప్పించుకోవచ్చు.
* రెండు స్పూన్ల బొప్పాయి గుజ్జులో ఒక స్పూను నిమ్మరసం కలిపి శరీరానికి పూసుకుని ఆరిన తర్వాత చల్లటి నీటితో స్నానం చేస్తే చర్మంలోని తేమ ఆవిరవకుండా ఉంటుంది.
* ప్రతిరోజూ క మం తప్పకుండా గులాబీ నీళ్లను ముఖ చర్మానికి ఉపయోగించడం వల్ల ఎండకు కమిలినట్లుగా అయిన చర్మం కాంతులీనుతుంది.
* కీరదోసను మెత్తగా పేస్ట్ చేసుకుని దానికి రెండు చెంచాల పెరుగును కలిపి శరీరానికి పూసుకోవాలి. పదిహేను నిముషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయడం వల్ల శరీరంలోని వేడి తగ్గి, తేమ అందుతుంది.
* అరటిపండు, పాలను పేస్ట్‌లా చేసి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పదిహేను, ఇరవై నిముషాల తర్వాత కడిగేయడం వల్ల ముఖానికి మెరుపు వస్తుంది.
* రెండు చెంచాల బొప్పాయి గుజ్జులో ఒక చెంచా తేనె, రెండు చెంచాల కోడిగుడ్డు తెల్ల సొనను తీసుకుని బాగా కలిపి ముఖానికి పట్టించాలి. పదిహేను నిముషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయడం వల్ల చర్మం మెత్తగా, నునుపుగా మారుతుంది.
* నిమ్మరసం సహజ బ్లీచింగ్‌గా పనిచేస్తుంది. అందుకని నిమ్మరసంలో దూదిని ముంచి నెమ్మదిగా ముఖానికి, మెడకు రుద్ది పది నిముషాల తర్వాత కడిగేయాలి.
* కొబ్బరినీళ్లలో దూదిని ముంచి ముఖానికి పట్టించాలి. కాసేపటి తర్వాత చల్లటి నీళ్ళతో కడిగేయాలి. ముఖంలో వచ్చే తేడాను మీరే గమనిస్తారు.
* నాలుగైదు బాదంపప్పులను రాత్రి పూట నీళ్ళలో నానబెట్టాలి. ఉదయం వాటిని మెత్తగా పేస్ట్ చేసి దానిలో కొద్దిగా తేనె కలిపి ముఖానికి పట్టించాలి. ఆరిన తర్వాత నెమ్మదిగా రుద్దుతూ చల్లని నీటితో ముఖాన్ని కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉన్న మృత కణాలు పోయి ముఖం నునుపుగా మారుతుంది. నిమ్మరసంలో తేనె కలిపి పూయడం వల్ల చర్మం మెత్తగా మారి కాంతులీనుతుంది.
* ముఖంపై ఉన్న మృతకణాలను తొలగించాలంటే నాలుగుస్పూన్ల శనగపిండిలో కొద్దిగా పసుపు, నాలుగు చెంచాల పాలు, గులాబీ నీళ్లు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా వారానికి ఒకసారి చేయడం వల్ల ముఖంపైన ఉన్న మురికి, మృతకణాలు తొలగిపోతాయి. ఎండ వేడిమికి ముఖంపై ఏర్పడిన టాన్ కూడా పోతుంది.
ఇలా ఇంట్లోనే దొరికే వస్తువులతో చిన్న చిన్న చిట్కాలను పాటించడం వల్ల వేసవీ ఆహ్లాదంగా మారుతుంది.

- విశ్వ