ఆంధ్రప్రదేశ్‌

పోలీసులకు చిక్కిన మరో నిందితుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు మేయర్ దంపతుల హత్యకేసు

చిత్తూరు, డిసెంబర్ 3: చిత్తూరు నగర మేయర్ కఠారి అనురాధ, ఆమె భర్త మోహన్ హత్యలో పరోక్షంగా పాల్గొన్నాడని భావిస్తున్న మరో నిందితుడు వెంకటేష్‌ను ఎట్టకేలకు చిత్తూరు పోలీసులు గురువారం పట్టుకున్నారు. గత నెల 17న చిత్తూరు నగర మేయర్, ఆమె భర్త కార్పొరేషన్ కార్యాలయంలో హత్యకు గురైన విషయం పాఠకులకు విదితమే. ఈ హత్యలో మేయర్ దంపతుల సమీప బంధువు చంద్రశేఖర్ అలియాస్ చింటూతో పాటు, మరో 10 మందిని నిందితులుగా పేర్కొంటూ చిత్తూరు పోలీసులు పలు సెక్షన్లపై కేసులు నమోదు చేశారు. వెంకటేష్ కూడా చింటూ తరహాలోనే ఉదయం 9.50 గంటలకు కోర్టులో లొంగిపోయేందుకు గురువారం కోర్టు ప్రాంగణానికి రాగానే అప్పటికే మాటువేసి ఉన్న పోలీసులు అతన్ని పట్టుకొని అరెస్ట్ చేశారు. కోర్టు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తుందన్న విషయం తెలియని వెంకటేష్ పది నిమిషాలు ముందుగానే కోర్టు ప్రాంగణానికి చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో పోలీసులతో పాటు అక్కడ ఉన్న కఠారి మోహన్ అనుచరులు వెంకటేష్ వస్తున్న విషయాన్ని పసిగట్టారు. వెంకటేష్ నాల్గవ అదనపు కోర్టువైపు పరుగెడుతుండగా పోలీసులు వెంబడించి పట్టుకొని రహస్య ప్రదేశానికి తరలించారు.
ఇదిలావుండగా చింటూ అనుచరుల వద్ద నుంచి గురువారం పోలీసులు మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఐదుగుర్ని అరెస్టుచేశారు. తమ ఇళ్లు సోదా చేసే అవకాశం ఉన్నందున తమ వద్ద ఉన్న మారణాయుధాలు కాలువల్లో పడేయడానికి వెళ్తున్నట్టు వారు ప్రాథమిక విచారణలో పేర్కొన్నట్టు పోలీసులు చెప్పారు.