జాతీయ వార్తలు

భారత పర్యటనలో బ్రిటన్ యువరాజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 10: బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియమ్ భార్య కాటే మిడిల్‌టన్‌తో కలిసి ఆదివారం ఇక్కడికి వచ్చారు. తొలిసారి భారత పర్యటనకు వచ్చిన విలియమ్ దంపతులు మధ్యాహ్నం ముంబయిలో అడుగుపెట్టారు. ముంబయిపై ఉగ్రవాదులు జరిపిన 26/11 దాడిలో మృతిచెందిన వారి స్మారకార్థం ఇక్కడి తాజ్ ప్యాలెస్ వద్ద ఏర్పాటు చేసిన మెమోరియల్‌ను వారు సందర్శించారు. మెమోరియల్ వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి ఉగ్రవాద దాడిలో మృతిచెందిన వారికి నివాళులు అర్పించారు. 2008 నవంబర్‌లో తాజ్ ప్యాలెస్ హోటల్‌పై ఉగ్రవాదులు దాడికి తెగబడిన సమయంలో అక్కడున్న సిబ్బందితో విలియమ్ దంపతులు ముచ్చటించారు. బ్రిటన్ రాజు జార్జ్-5, రాణి మేరి ముంబయిని సందర్శించిన సందర్భాన్ని పురస్కరించుకొని వారి పర్యటన జ్ఞాపకార్థం 1911లో ఈ హోటల్‌ను నిర్మించారు. ఏడు రోజులపాటు భారత్, భూటాన్‌లలో పర్యటించేందుకు విలియమ్ దంపతులు ఇక్కడికి వచ్చారు. భారత్, భూటాన్‌లతో బంధాన్ని బలోపేతం చేసుకునే ఉద్దేశంతో వారు ఈ పర్యటనకు వచ్చారు. తాజ్ ప్యాలెస్ హోటల్ నుంచి వారు ఓవల్ మైదాన్‌కు వెళ్లారు. లబ్ధిదారులకు, ముంబయిలోని మూడు చారిటీలు మాజిక్ బస్, డోర్‌స్టెప్, ఇండియాస్ చైల్డ్‌లైన్ ప్రతినిధులకు మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌ను తిలకించారు.

ముంబయి దాడి సంఘటన గురించి తాజ్ ప్యాలెస్ హోటల్ సిబ్బంది నుంచి వివరాలు తెలుసుకుంటున్న బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియమ్ దంపతులు

శ్రీనగర్ నిట్ ప్రశాంతం

శ్రీనగర్, ఏప్రిల్ 10: పది రోజులుగా స్థానిక, స్థానికేతర విద్యార్థుల ఆందోళనలతో అట్టుడికిన శ్రీనగర్ ఎన్‌ఐటి ఆదివారం ప్రశాంత పరిస్థితికి చేరుకుందని నిట్ అధికారులు తెలిపారు. పండుగలు రావటంతో విద్యార్థుల ఆందోళనకు విరామం ప్రకటించినట్లుందని నిట్ రిజిస్ట్రార్ ఫయాజ్ అహ్మద్ మీర్ ఆదివారం తెలిపారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ బృందం విద్యార్థులతో జరిపిన చర్చల్లో అంగీకరించిన డిమాండ్లపై ఉత్తర్వులు జారీ చేశామని ఆయన అన్నారు. నిట్‌ను శ్రీనగర్ నుంచి బదిలీ చేయాలన్న డిమాండ్‌ను మాత్రం తిరస్కరించినట్లు ఆయన స్పష్టం చేశారు.
ఖేర్‌ను అడ్డుకున్న పోలీసులు
నిట్‌లో విదార్థులను పరామర్శించేందుకు, సంఘీభావం తెలిపేందుకు శ్రీనగర్ వచ్చిన బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్‌ను విమానాశ్రయంలోనే పోలీసులు అడ్డుకున్నారు. శాంతిభద్రతల దృష్ట్యా ఖేర్‌ను నిట్‌ను సందర్శించేందుకు అనుమతించలేదని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ‘శ్రీనగర్ నిట్‌లో విద్యార్థులను కలిసి ఆలింగనం చేసుకుని వారికి ప్రత్యేక బహుమతినివ్వాలని భావించాను. కానీ, నిట్‌లో ప్రవేశించటానికి నాకు అనుమతి లేదని జమ్ము కాశ్మీర్ పోలీసులు తెలిపారు. ఉత్తర్వులు చూపించమని అడిగినా వారు నాకు ఎలాంటి ఉత్తర్వులు చూపలేదు’ అని ఖేర్ ట్వీట్ చేశారు.

శ్రీనగర్ ఎయర్ పోర్టులో అనుపమ్ ఖేర్‌ను అడ్డుకున్న పోలీసులు