మహబూబ్‌నగర్

ఎవరి పునాదులు కదిలాయో ప్రజలే తేలుస్తారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, అక్టోబర్ 1: ఎవరి పునాదులు కదిలాయే ప్రజలు తేలుస్తారని పైకి మాత్రం గాంభీర్యాన్ని ప్రదర్ళిస్తూ ప్రగల్భాలు చేబుతున్నారని మంత్రి జూపల్లికి కూడా టిఆర్‌ఎస్ పార్టీ పునాదులు గద్వాలలో కదిలాయని తెలుసని ఎదో మంత్రిగా ఉన్నాను కాబట్టి మాట్లాడ కుంటే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశ్యంతో తన రాజీనామాపై వాఖ్యలు చేస్తున్నారని గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ అన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వాఖ్యలపై ప్రతి స్పదించిన ఎమ్మెల్యే డికె అరుణ శనివారం ఆంధ్రనూమి ప్రతినిధితో పోన్‌లో మాట్లాడుతూ తెలంగాణ కోసం తాము ఎక్కడ రాజీనామాలు చేయాలో అక్కడ చేశామని తాము చిత్తశుద్ధ్దితో తెలంగాణ ఎవరిస్తే వస్తుందో తెలుసుకుని రాజీనామాలు సోనియాగాంధీకి ఇచ్చామని
అందుకే తెలంగాణ వచ్చిందన్నారు. తన రాజీనామా పట్ట మంత్రి జూపల్లి కృష్ణారావు డ్రామా అంటూ మాట్లాడటం తగదన్నారు. అయితే అప్పట్లో వారు కూడా చేసిన రాజీనామాలు స్వార్థప్రయోజనాల కోసమే చేశారని ఆమే ప్రశ్నించారు. రాజకీయ పునాదులు నడిగడ్డలో కదలిపోయాయని తెలుసుకుని తనపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. రాజకీయ పునాదులు కదిలించేందు మంత్రులు కాదని ప్రజలని అది ప్రజలు తేల్చే అంశం అని అన్నారు. ప్రజలు ఎవరి పునాదులు కదిలించారో మున్ముందు తెలుస్తుందన్నారు. గద్వాల జిల్లా కోసం తాను ముఖ్యమంత్రి ద్వారా స్పీకర్‌కు రాజీనామా లేఖ పంపానని వెల్లడించారు. ప్రజల అభిష్టం మేరకు జిల్లాలు చేయాలని తాను మొదటి నుండి చెబుతున్నానని ప్రజల ఆక్షాంక్షలను పక్కన పెట్టి తన భజన పరుల కోసం జిల్లాలు ఏర్పాటు చేస్తే మాత్రం సహించబోమని ఆయమే హెచ్చరించారు. తన ఎమ్మెల్యే పదవియే గద్వాల జిల్లాకు అడ్డంకి అని అనుకుంటే తన పదవికి రాజీనామా చేస్తున్నానని ఆమే వెల్లడించారు. జిల్లా సాధన కోసం ఏ త్యాగానికైనా సిద్ద్ద్ధమని ఆమె తెలిపారు.

అరుణ రాజీనామాపై గద్వాలలో ఉత్కంఠ
గద్వాల, అక్టోబర్ 1: గద్వాలను జిల్లా చేయాలన్న నడిగడ్డ ప్రజల ఆకాంక్షను ప్రభుత్వం ఆమోదించకపోవడంతో నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ ప్రకటించారు. దీంతో గద్వాల జిల్లా ఉద్యమానికి కొత్త ఊపు రాగా, పట్టణంలో ఉత్కంఠత నెలకొంది. గత కొంత కాలంగా టిఆర్‌ఎస్‌తో పాటు కులసంఘాలు, ఉద్యమ సంఘాల నేతలు ప్రజాప్రతినిధుల రాజీనామాలతోనే జిల్లా సాధించవచ్చునని, గద్వాల జిల్లా ఏర్పాటుకు ఎమ్మెల్యే అరుణ అడ్డు అన్న ఆరోపణల మేరకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పట్టణంతో పాటు నియోజకవర్గంలో అరుణ అభిమానులు, గద్వాల జిల్లా సాధన సమితి, జెఎసి నేతలు ఆమె చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి అభినందించారు. పట్టణంలోని వైఎస్సార్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్ పద్మావతి హాజరై ప్రసంగించారు. ప్రజల ఆకాంక్షల ముందు ఎమ్మెల్యే పదవి పెద్దది కాదని, గద్వాల జిల్లా సాధనే ఏకైక లక్ష్యంగా అరుణ రాజీనామాకు సిద్ధపడ్డారని పద్మావతి అరుణను అభినందించారు. కార్యక్రమంలో నాయకులు సలాం, వైస్ చైర్మన్ శంకర్, కృష్ణవేణి రామాంజనేయులు, నాగేందర్‌యాదవ్, ఇసాక్, అన్వర్, డిటిడిసి నర్సింహా, చందు, బంగి సుదర్శన్, రజక జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.