మహబూబ్‌నగర్

బహిరంగ చర్చకు ఎప్పుడొస్తారో చెప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మక్తల్, అక్టోబర్ 2: నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులపై బహిరంగ చర్చకు ఎప్పుడు వస్తారో టిఆర్‌ఎస్ నేతలు చెప్పాలని, చీటికి మాటికి ప్రతిపక్షాలపై బురద చల్లడం మానుకోవాలని పిసిసి అధికార ప్రతినిధి శ్రీనివాస్‌గుప్త అన్నారు. ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో గుప్త మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్ధి జరుగాలంటే సర్పంచ్, ఎంపిపి, ఎమ్మెల్యేలు ముగ్గురు కలిస్తే అభివృద్ధి జరుగుతుందని, ఎవరికి వారే యమునా తీరేలా ఉంటే ఎలా అభివృద్ధి జరుగుతుందన్నారు. నియజకవర్గానికి చేసిన సేవలపై స్వేత పత్రం విడుదల చేయాలని గుప్త డిమాండ్ చేశారు. డిసిఎంఎస్ చైర్మన్ నిజాంపాష మాట్లాడుతూ తనపై ఇష్టానుసారంగా మాట్లాడటం టిఆర్‌ఎస్ శ్రేణులకు తగదన్నారు. చిట్యాలలో తాగునీటికి అడ్డుపడుతున్నట్లు తమరు చేస్తున్న ఆరోపణలకు బహిరంగ చర్చకు టిఆర్‌ఎస్ శ్రేణులు సిద్ద్ధం కావాలని ఆయన సవాల్ విసిరారు. జడ్పీటిసి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ తానకు వచ్చిన జెడ్పీ నిధులు రూ.10లక్షలు కాదని, రూ.11లక్షలు వాచ్చాయని తాను చేసిన పనులపై స్వేతపత్రం విడుదల చేయాలని అంటున్న టిఆర్‌ఎస్ శ్రేణులు నాకు వచ్చిన నిధులనీ మీ అధికార పార్టీ ఎంపిటిసిలు, ముఖ్యనాయకులకు ఇవ్వడం జరిగిందన్నారు. మండలంలో ఒక్క బోరుకూడా వేయలేదని అన్నారు. ఒకటికాదు 12 బోర్లు వేయడం జరిగిందని అన్నారు. అంతేకాదు మక్తల్ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్లు, ఈద్గ ప్రార్థన స్థలంలో 800 ట్రిప్పుల మొరం, మండలంలోని టేకులపల్లి, గోలపల్లి, కాట్రేవ్‌పల్లి, పంచదేవ్‌పాడ్ గ్రామాలలో రోడ్లు వేయించడం జరిగిందన్నారు. మార్కెట్ చైర్మన్ అయ్యాక ప్రతిపక్షాలపై బురద చల్లడం మానుకుంటే బాగుంటుందన్నారు. మార్కెట్ అభివృద్ధి చేయవలసిన నిధులు ఇతర మార్కెట్లకు తరలించిన మీరు వెంటనే ఆనిధులను వెనుకకు రప్పించి మార్కెట్ అభివృద్ధికి ఉపయోగిస్తే రైతులు, ప్రజలు హర్షిస్తారని అన్నారు. నన్ను బహిరంగ చర్చకు రమ్మన్న చైర్మన్ అంబేద్కర్ చౌరస్తా వద్దకు రావడానికి నేను సిద్దంగా ఉన్నానని, మీరెప్పుడు వస్తారో చెప్పాలని జెడ్పీటిసి శ్రీహరి అన్నారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు అక్కల సత్యనారాయణ, కట్ట సురేష్, వెంకటేష్, బోయరవికుమార్ తదితరులు పాల్గొన్నారు.