మహబూబ్‌నగర్

అన్నీ నాగర్‌కర్నూల్ ఎంపి పరిధిలోనే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, అక్టోబర్ 3: రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు అంకానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లాలో ముం దుగా వనపర్తి, నాగర్‌కర్నూల్ ప్రతిపాదిత రెండు జిల్లాలుగా ప్రభుత్వం వెలువరించిన ముసాయిదాలో ఉన్నాయి. అయితే గద్వాలను కూడా జోగులాంబ పేరిట మరో జిల్లా ఏర్పాటు చేయాలంటూ ప్రజలు, నాయకులు, గద్వాల ఎమ్మెల్యే డికె అరుణతో పాటు వివిధ రాజకీయ పార్టీల నేతల ఆందోళనలు మిన్నంటాయి. అయితే ఈ నెల 2వ తేదీన ముఖ్యమంత్రి కెసిఆర్ జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై సొంత పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలతో బేటీ అయ్యారు. అందు లో ముఖ్యమంత్రి కెసిఆర్ గద్వాల జిల్లాపై కూడా సానుకూలం గా నిర్ణయం తీసుకోవడంతో ఇక గద్వాల జిల్లా దాదాపు ఖరారు అయినట్లేనని ఆ ప్రాంతవాసులు సంబురాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలో మరో చర్చ మొదలైంది. ప్రభుత్వం జిల్లాల ఏర్పాటుపై మహబూబ్‌నగర్ ఎంపి నియోజకవర్గ పరిధిలోని పలు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు అన్యాయం చేస్తుందనే కొత్తవాదన మొదలైంది. నాగర్‌కర్నూల్ ఎంపి నియోజకవర్గం పరిధిలోనే కొత్తగా మూడు జిల్లాలు ఏర్పాటు చేస్తుందంటూ ప్రజల్లో చర్చ ప్రారంభమైంది. ఈ చర్చ మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రజల్లో జోరుగా ప్రారంభమైంది. అయితే మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని షాద్‌నగర్‌ను మొత్తంగా తీసి ఈ నియోజకవర్గాన్ని శంషాబాద్ జిల్లాలో కలుపుతున్నారు. గద్వాల జిల్లా ఏర్పాటు అయితే మక్తల్ నియోజకవర్గాన్ని మొత్తాన్ని అందు లో కలిపే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరగడమే కాకుండా అధికారులు సైతం ఇదే ప్రతిపాదిక ఉండొచ్చని బహిరంగంగా అంటున్నారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలలో రెండు పూర్తిగా ఇతర జిల్లాలోకి వెళ్లనుండడంతో మిగతా ఐదు నియోజకవర్గాలు ఉంటాయి. అందులో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంగా ఉంది. జడ్చర్ల, మహబూబ్‌నగర్, నారాయణపేట నియోజకర్గాలు పూర్తిగా ఉంటున్నాయి. అయితే దేవరకద్ర నియోజకర్గంలో ఉన్న మండలాలను ఆత్మకూరు, సిసికుంట, కొత్తకోట మండలాలు వనపర్తి జిల్లాలో కలుపనున్నారు. వీటినిపై కూడా అభ్యంతరాలు ఉన్నాయి. అయితే కోడంగల్ నియోజకర్గాన్ని సైతం చీల్చుతున్నారు. ఇందులోని కొడంగల్, బొంరాస్‌పేట మండలాలను వికారాబాద్ జిల్లాలో కలిపేందుకు రంగం సిద్దమైంది. ఇలా మహబూబ్‌నగర్ ఎంపి నియోజకవర్గం పరిధిలో గల పలు అసెంబ్లీ నియోజకవర్గాలను, వాటి పరిధిలోని మండలాలు తీస్తూ ఇతర జిల్లాల్లో కలిపే ప్రకియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం చెబుతున్న జనాభా లెక్కల ప్రకారం మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో అధికంగానే జనాభా ఉంది. జనాభా లేలా ఉన్నప్పటికిని మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మాత్రం నారాయణపేట జిల్లా కావాలంటూ ఆందోళనలు చేశారు. కానీ ప్రభుత్వం వీరి ఆందోళనలు పట్టించుకోలేదని, అసలు పరిగణంలోకి రాలేదనే వాదన వినిపిస్తుంది. మొత్తం మీద నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో మూడు జిల్లాలు చేస్తే మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానం పరిధిలో మాత్రం కొత్త జిల్లాకు మోక్షం లబించకపోవడంతో ప్రజలు ఈ అంశంపై జోరుగా చర్చించుకుంటున్నారు. అయితే ఇప్పటికే మహబూబ్‌నగర్ జిల్లాకు అన్యాయం జరుగుతుందంటూ ఇక్కడి ప్రజా ప్రతినిధులు గొంతెత్తుతున్నారు. ఇంతలోనే మరో పిడుగువార్త బయటకు పొక్కడంతో ఇక మహబూబ్‌నగర్ జిల్లాలో కృష్ణానది అంటూ పారదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మక్తల్ నియోజకవర్గం గద్వాల జిల్లాలో కలిపితే మొత్తం కృష్ణానది పారే ప్రాంతం మహబూబ్‌నగర్ జిల్లాలో ఉండబోదు. ఇదే జరిగితే మహబూబ్‌నగర్ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదం ఉందంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల ఏర్పాటులో మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు నష్టం జరుగుతుందనే వాదన బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో మక్తల్ నియోజకవర్గం పోతే ఇక మహబూబ్‌నగర్ జిల్లాకు మిగిలింది ఏమిటనే వాదన కూడా బలంగా చేకూరింది. ఈ విషయంపై కూడా అధికార పార్టీకి చెందిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు తమ ఆవేదనను వెలిబుచ్చుతున్నారు.

ఖరీఫ్‌కు సాగనీరు
మక్తల్, అక్టోబర్ 3: జిల్లాలో ఇం కా అసంపూర్తిగా మిగిలిన భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులకను త్వరితగతిన పూర్తిచేసి వచ్చే ఖరీఫ్ నాటికి జిల్లాలో 8లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడం జరుగుతుందని మహబూబ్‌నగర్ ఎంపి జితేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మక్తల్‌లోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి, మార్కెట్ కమిటి చైర్మన్ పి.నర్సింహగౌడ్‌లతో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఈఖరీఫ్‌లో జిల్లాలోని అనుబంధ రిజర్వాయర్లు నింపడంతో రిజర్వాయర్లకన్ని జలకళ సంతరించుకుందని అన్నారు. దాదాపు 100 చెరువులలో నీటిని నింపడంతో రైతన్న కళ్లల్లో జలకళ సంతరించుకుందని తెలిపారు. తమ అధినేత ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం వచ్చే మూడు సంవత్సరాలలో ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాల చొప్పున సాగునీరు అందించడమే లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇప్పటికే పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భూసేకరణ పూర్తి అయ్యిందని తెలిపారు. కర్వెన, ఉద్దండపూర్ పనులు చురుకుగా సాగుతున్నాయని అన్నారు. నారాయణపేట జాయమ్మ చెరువు పనులను సైతం త్వరలో చేపట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రజల పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన చేయడం జరుగుతుందని, ఇందులో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లాను నాలుగు జిల్లాలుగా చేయుటకు కసరత్తు చేస్తున్నట్లు ఎంపి తెలిపారు. ఇందుకుగాను తమ సీనియర్ నాయకుడు రాజసభ సభ్యుడు కె.కేశవరావు ఆధ్యక్షతన కమిటి వేయడం జరిగిందని, వారం రోజులలోపు కమిటికి అందిన అభిప్రాయాల మేరకు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. ఆత్మకూర్, అమరచింత మండలాలను ఇంటలిజెన్సీ రిపోర్టు ఆదారంగా ఏ నియోజకవర్గంలో, ఏజిల్లాలో ఉంచాలన్నదానిపై ప్రజల అభిష్టం మేరకు ఆస్థానాల్లోకి మార్చడం జరుగుతుందని చెప్పారు. విలేఖరుల గోపాల్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, అమరేందర్‌రెడ్డి, రహీంపటేల్, రాజేశ్వర్‌గౌడ్, సరేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మత్య్సకారుల
సంక్షేమానికి పెద్దపీట
ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్‌టౌన్, అక్టోబర్ 3: గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణం గా పూర్తిగా వెనుకబాటుతనానికి గురైన మత్య్సకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీఠ వేస్తుందని స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మినీట్యాంక్‌బండ్‌లో 70 వేల చేప పిల్లలను వదిలారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మత్య్సకారులకు ఇచ్చే రుణాలపై వందశాతం సబ్సిడీ ఉంటుందని ఈ అవకాశాన్ని మత్య్సకారులందరు వినియోగించుకునేలా ఆ సంఘం ప్రతినిధులు కోరారు. మత్య్సకారుల అభివృద్దికి ప్రభు త్వం అనేక చర్యలు తీసుకుంటుందని ఆయన పెర్కోన్నారు. రుణసదుపాయం కల్పించడమే కాకుండా మత్య్సకారుల పిల్లలకు విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో చదివించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మత్య్సకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, టిఆర్‌ఎస్ నాయకులు రాజేశ్వర్‌గౌడ్, బెక్కెం జనార్థన్, సురేందర్‌రెడ్డి, పిల్లి సురేష్, మత్య్సకారులు తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించిన ఎస్పీ
వనపర్తి, అక్టోబర్ 3: వనపర్తి మ్సుఫల్ కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ రెమారాజేశ్వరి సోమవారం రాత్రి సందర్శించారు. కొత్తగా ఏర్పడిన వనపర్తి జిల్లాలో ఎస్పీ కార్యాలయం కోసం మున్సిఫల్ కార్యాలయాన్ని ఎంపిక చేసుకున్నందున ఆమె కార్యాలయాన్ని సందర్శించి మున్సిపల్ చైర్మెన్ రమేష్‌గౌడ్‌తో మాట్లాడారు. దసరా నుండే కొత్తజిల్లాల్లో కార్యకలాపాలు ప్రారంభించ నున్నందున ఎస్పీ తమ కార్యాలయాలను పరివీలించడానికి వచ్చినట్లు తెలిపారు. అనంతరం సమీపంలో ఉన్న ఐబి అతిథిగృహాన్ని సందర్శించారు. ఎస్పీ క్యాంపుకార్యాలయాన్ని ఐబి అతిథిగృహంలో ఏర్పాటు చేయనున్నందున ఐబి అతిథిగృహాన్ని ఆమె పరిశీలించారు. ఎస్పీ వెంట డిఎస్పీ జోగుల చెన్నయ్య, ఎస్సైలు పాల్గొన్నారు.

జాతీయ స్థాయి నెట్‌బాల్ టోర్నీ ప్రారంభం
ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, అక్టోబర్ 3: జాతీయ నెట్‌బాల్ టోర్నమెంట్ సోమవారం అట్టహాస్సంగా ప్రారంభమయ్యాయి. మహబూబ్‌నగర్‌లోని జిల్లా పరిషత్ గ్రౌండ్‌లో, జాతీయ, రాష్ట్ర సాప్ట్‌బాల్ అసోసియోషన్, జిల్లా అసోసియోషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలు ఎంపి జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌లు ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా దాదాపు 11 రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపి జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ పాలమూరు పట్టణం జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడలకు వేదిక అవుతుండడం ఇక్కడి క్రీడాకారులకుభవిష్కత్ ఉండబోతుందని అన్నారు.