మహబూబ్‌నగర్

నారాయణపేట జిల్లా ఏర్పాటు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకద్ర, అక్టోబర్ 9: నారాయణపేటను జిల్లాగా ప్రకటించి ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం దేవరకద్రలోని శ్రీనివాస్‌గార్డెన్ ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన టిడిపి మండల కార్యకర్తల సమన్వయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ టిడిపి మొదటి నుండి నారాయణపేట జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. కాంగ్రెస్, టిఆర్‌ఎస్ నాయకులు నారాయణపేట జిల్లాను ఎందుకు కోరుకోవడంలేదని ఆయన ప్రశ్నించారు. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలోనే మూడు జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికై ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న కెసిఆర్ పాలమూరు జిల్లాపై సంపూర్ణంగా అవగాహన వ్యక్తి అని అన్నారు. కానీ ఇలాంటి జిల్లాకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలుగానీ, పార్డీల నాయకులుగానీ నారాయణపేటపై ఎందుకు చిన్నచూపు చూస్తున్నారని అన్నారు. నీరు, నిధులు నికర జలాలపై సంపూర్ణ అవగాహన ఉన్న ముఖ్యమంత్రి మొదట జిల్లాలకు హక్కులపై ఒక నివేధిక విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జూరాల ప్రాజెక్టును రీడిజైన్ చేయాలని అప్పుడే కృష్ణా జలాలు ఈ ప్రాంతానికి అనుకున్నంత స్థాయిలో నిలుపుకునే ఆస్కారం ఉంటుందని అన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని ఇతర జిల్లాలకు తీసుకెళ్లే కుట్ర జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌కు దక్షిణ తెలంగాణ అంటే చిన్న చూపు అని ఆరోపించారు. ఆయన మొత్తం ఉత్తర తెలంగాణపైనే దృష్టి పెట్టారని ఆరోపించారు. టిడిపి కార్యకర్తలు ఆదైర్యపడొద్దని తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో నాయకులు ఎన్‌పి వెంకటేష్, సామ్రాట్ శ్రీను, ఎక్బాల్ పాష, సత్యనారాయణ, నాగయ్యశెట్టి, హన్మంతురెడ్డి, కుర్మన్న పాల్గొన్నారు.