మహబూబ్‌నగర్

పోలీసుల త్యాగాలు మరువలేనివి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, అక్టోబర్ 21: సమాజంలో శాంతిని నెలకొల్పేందుకు సంఘ విద్రోహ శక్తులను ఎదుర్కొని వారిని సమాజంలో లేకుండా చేసి ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పని చేసి అమరులైన పోలీసుల త్యాగాలు మరువలేనివని మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. శుక్రవారం పొలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసు ఫరేడ్ గ్రౌండ్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసుల ఆమరుల స్థూపానికి మహబూబ్‌నగర్ కలెక్టర్ రోనాల్డ్ రోస్, మహబూబ్‌నగర్ ఎస్పీ రెమా రాజేశ్వరి, నాగర్‌కర్నూల్ ఎస్పీ కల్మేశ్వర్ సింగనావర్, వనపర్తి ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, గద్వాల అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్‌వాస్‌రావు, మహబూబ్‌నగర్ డి ఎస్పీ కృష్ణమూర్తి ఆమరవీరుల కుటుంబాల సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన పోలీసు ఆమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్పీ రెమా రాజేశ్వరి మాట్లాడుతూ ఆమర పోలీసుల త్యాగాలను స్మరిస్తూ వారు ఏ ఆశయసాధన కోసం ప్రాణాలు అర్పించారో వారి స్పూర్తితో దేశరక్షణ కోసం, ప్రజలు శాంతియుత వాతావరణంలో జీవనం కొనసాగించేందుకు ఆహర్నిశలు పోరాడుతూ తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడి ఆమరులైన వారిని స్పూర్తిగా తీసుకుని సమాజంలోని ప్రతి ఒక్కరు ముందుకు వెళ్లాలని ఆమె సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పోలీసులు పని చేయాలని ఆమరులను స్మరిస్తూ వారు ఏ లక్ష్య సాధన కోసం తుది శ్వాస విడిచారో సమాజంలో సంఘ విద్రోహ శక్తులను నామరూపాలు లేకుండా నిర్మూలించాల్సిన భాద్యత మనపై ఉందని అన్నారు. పోలీసులకు ప్రజల సహకారం ఎంతో అవసరమని, సహకారం లేకుండా సమాజంలో శాంతిని నెలకొల్పడం కష్టతరంగా ఉంటుందని అన్నారు. అభివృద్ది జరగాలంటే పోలీసుల పాత్ర కీలకమని, పోలీసు ఉద్యోగం అంటేనే కత్తిమీదసాము లాంటిదని ఆమె తెలిపారు. నిరంతరం విధి నిర్వహణలో నిమగ్నమై ప్రజల కోసమే పనిచేస్తున్న వారు పోలీసులని అన్నారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 473 మంది పోలీసులు ఆమరులయ్యారని దేశంలో ప్రతి నిత్యం ఒకరు చోప్పున సైనికులు, పోలీసులు తమ విధి నిర్వహణలో ఆమరులవుతున్నారని దింతో వారి కుటుంబాలకు తీరని లోటు అన్నారు. అయితే దేశం కోసం పని చేయడం, ప్రాణాలు అర్పించడం పోలీసులకే సాధ్యమవుతుందని అన్నారు. ఈ భాద్యత అందరికి సాధ్యం కాదని కొంతమందికే సాధ్యపడుతుందని దినిని ఆమర పోలీసులు కుటుంబాలు గర్వంగా భావిస్తారు కానీ కుటుంబంలోని వ్యక్తి కళ్లముందు లేకపోవడం బాదేస్తుందన్నారు. ప్రభుత్వం పోలీసులపై ఎంతో నమ్మకం పెట్టుకుని కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిరంతరంగా పని చేస్తామని ఎస్పీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిఐలు డివిపి.రాజు, రామకృష్ణ, సీతయ్య, ట్రాఫీక్ సిఐ రామకృష్ణ, ఎస్సైలు, పోలీసు సంఘం అధ్యక్షులు శ్రీనివాసులు పాల్గొన్నారు. జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుండి పరదేశీనాయుడు చౌరస్తా వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు.