మహబూబ్‌నగర్

ప్రాజెక్టుల భూసేకరణ పూర్తిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, నవంబర్ 3: పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంకు సంబంధించిన భూసేకరణ పనులతో పాటు భూ నిర్వాసితులకు అందించాల్సిన పరిహారాన్ని జాప్యం చేయకుండా అందించాలని రాష్ట్ర భారీనీటి పారుదలశాఖ మంత్రి తన్నీరు హరిష్‌రావు అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్‌తో పాటు సంబంధిత అధికారులతో విడియోకాన్పరెన్స్ నిర్వహించారు. నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాల కలెక్టర్లతో మంత్రి మాట్లాడారు. అయా జిల్లాల పరిధిలోని పాలమూరు ఎత్తిపోతల పథకం పురోగతిని తెలుసుకున్నారు. అంతేకాకుండా ఆన్‌గోయింగ్ సాగునీటి ప్రాజెక్టులు కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ పనుల విషయంలో నిర్లక్ష్యం చేయోద్దని సూచించారు. ఈ ఖరీఫ్‌లోనే అనుకున్న లక్ష్యానికి సాగునీరు నాలుగు ప్రాజెక్టుల ద్వారా అందించామని అయితే ఈ రబీలోనే మరో రెండు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించాలని అందుకుగాను పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. ఖరీఫ్, రబీలో కలిపి దాదాపు నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అందించాలని లక్ష్యం ఉండేదని ఇప్పటికే ఆ లక్ష్యానికి దగ్గ ర ఉన్నామని అన్నారు. ప్రస్తుతం జిల్లాల విభజన జరిగినందునా అయా జిల్లాల పరిధిలో ఉండే పాజెక్టుల పనులు వేగవంతం చేయించే బాధ్యత కలెక్టర్లదేనని తెలిపారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పరిధిలో 1,2,3 లీప్ట్‌ల ద్వారా సాగునీరు అందిస్తున్నామని పలు నియోజకవర్గాలలో సాగునీరు రావడంతో రైతులు రబీ సీజన్‌లో పంటలు వేసుకుంటారని తెలిపారు. అందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు. భీమా ప్రాజెక్టు కింద కూడా సాగునీరు విడుదల చేయడం జరిగిందని అన్నారు. కోయిల్‌సాగర్, నెట్టెంపాడు ప్రాజెక్టుల నుండి కృష్ణా జలాలను విడుదల చేశామని అయితే ఇంకా మిగిలి ఉన్న పనులు పూర్తి చేస్తే వచ్చే ఖరీప్ నాటికి మహబూబ్‌నగర్, వనపర్తి, జోగులాంబ, నాగర్‌కర్నూల్ జిల్లాల పరిధిలో మరో మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని అందుకు కలెక్టర్లు తరుచూ సంబంధింత అధికారులచే పనులు వేగవంతం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎట్టిపరిస్థితుల్లో సాగునీటి ప్రాజెక్టుల పనులు అలస్యం కావడానికి వీలులేదని తెలిపారు. అదేవిధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలని రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అయితే వీడియో కాన్పరెన్స్‌కు మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ హాజరై మాట్లాడుతూ పాలమూరు పెద్దచెరువుకు సంబందించిన కాల్వల పనులు చేపట్టాలని మంత్రిని కోరారు. అంతేకాకుండా మాడల్ రైతు బజార్ ఏర్పాటు సైతం స్థలం పరిశీలించడం జరిగిందని, హేమసముద్రం రిజర్వాయర్‌పై కూడా దృష్టి పెట్టాలంటూ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మంత్రి హరిష్‌రావు దృష్టికి తీసుకుపోయారు. అందుకు మంత్రి స్పందిస్తూ రెండు రోజుల్లో పెద్దచెరువు, రైతు బజార్ ప్రతిపాధలను తనకు పంపాలని అధికారులను ఆదేశించారు. విడియో కాన్పరెన్స్‌లో కలెక్టర్ రోనాల్డ్‌రోస్ పాల్గొన్నారు.